సమీక్ష : ‘ఏనుగు’ – కొన్ని చోట్ల ఆకట్టుకున్న ఎమోషల్ ఫ్యామిలీ డ్రామా

సమీక్ష : ‘ఏనుగు’ – కొన్ని చోట్ల ఆకట్టుకున్న ఎమోషల్ ఫ్యామిలీ డ్రామా

Published on Jul 2, 2022 3:02 AM IST
Enugu Movie Review

విడుదల తేదీ : జులై 01, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: అరుణ్ విజయ్, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని, యోగి బాబు, అమ్ము అభిరామి

దర్శకత్వం : హరి

నిర్మాత: సీహెచ్‌ సతీష్‌ కుమార్‌

సంగీత దర్శకుడు: జి.వి. ప్రకాష్ కుమార్

సినిమాటోగ్రఫీ: గోపీనాథ్

ఎడిటర్: ఆంథోని


అరుణ్‌ విజయ్, ప్రియా భవానీ శంకర్‌ జంటగా నటించిన తమిళ చిత్రం ‘యానై’… తెలుగులో ఏనుగు పేరుతో రిలీజ్ అయ్యింది. కాగా ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.

 

కథ :

రవి (అరుణ్‌ విజయ్) కుటుంబానికి ‘సముద్రం’ కుటుంబానికి మధ్య శత్రుత్వం ఉంటుంది. శత్రువుల నుంచి తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి రవి కవచంలా నిలబడతాడు. ఈ క్రమంలో రవికి అతని కుటుంబంలోనే చెడ్డ పేరు వస్తోంది. రవి రెండో భార్య కొడుకు కావడంతో.. అతని సవతి అన్నయ్య (సముథ్రకని)కి రవి అంటే కోపం. అన్నదమ్ముల మధ్య పుట్టిన విబేధాల కారణంగా రవి జీవితం మలుపు తిరుగుతుంది ?, చివరకు రవి తన నిజాయితీని ఎలా రుజువు చేసుకున్నాడు ?, ఈ మధ్యలో మేరీ (ప్రియా భవానీ శంకర్‌)తో రవి ప్రేమాయణం ఎలా సాగింది అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

ఈ చిత్రంలో ఎమోషనల్ కంటెంట్ తో పాటు మంచి ఫ్యామిలీ వాల్యూస్ ను బాగా చూపించడం జరిగింది. అలాగే ఈ సినిమాలో యాక్షన్, సెంటిమెంట్ కూడా బాగున్నాయి. ఇక ఈ కథ జరిగిన నేపధ్యమే ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్. అరుణ్ విజయ్ సున్నితమైన పాత్ర కూడా ఈ సినిమాకు ప్రధాన బలం. ముఖ్యంగా అరుణ్ విజయ్ భావోద్వేగమైన పాత్రలో బరువైన ఎమోషన్ పండించిన విధానం బాగుంది.

హీరోయిన్ ప్రియా భవానీ శంకర్‌ కూడా తన నటనతో మెప్పిస్తోంది. దర్శకుడు హరి రాసుకున్న స్క్రీన్ ప్లేలో ప్రతి పాత్రను కథలోకి తీసుకొచ్చిన విధానం మెచ్చుకోదగినది. సినిమా చివరకి వచ్చేసరికి ఏం జరుగుతుందో అనే ఉత్సుకతను దర్శకుడు బాగా మెయిటైన్ చేశాడు. నేపధ్య సంగీతం ఈ సినిమాకే హైలెట్. దర్శకుడు హరి టేకింగ్ సినిమాకు కావాల్సినంత ఎమోషన్ని అందించింది.

 

మైనస్ పాయింట్స్ :

ఎమోషనల్ గా సాగే పాత్రలతో ఈ సినిమా కొన్ని చోట్ల బాగా ఆకట్టుకున్నా.. కథనం పరంగా ఎలాంటి కొత్తధనం లేదు. అలాగే ఫస్టాఫ్ ను ఆసక్తికరమైన యాక్షన్ ఎమోషన్స్ తో బాగానే చూపించే ప్రయత్నం చేశారు. అయితే అక్కడక్కడ అనవసరమైన సీన్స్ ను ఇరికించడం వల్ల.. సినిమాలోని సీరియస్ నెస్ మరియు సినిమా ప్లోను డిస్ట్రబ్ అయ్యింది.

దాంతో పాటు స్లోగా సాగే సీన్స్ తో కొన్నిచోట్ల స్క్రీన్ ప్లే ను నెమ్మదిగా నడిపారు. సెకెండ్ హాఫ్ లో కూడా కొన్ని సీన్స్ మెలో డ్రామాలా స్లోగా సాగుతాయి. ముఖ్యంగా కొన్ని సీన్స్ ను అనవసరంగా లాగడం వల్ల ఆ సాగ తీత సీన్స్ లో ఇంట్రస్ట్ మిస్ అయింది. అలాగే మధ్యమధ్యలో వచ్చే లాజిక్ లేని ఎమోషనల్ ట్రాక్ కూడా కొంత ఇబ్బంది పెడుతుంది.

 

సాంకేతిక విభాగం :

దర్శకుడు హరి దర్శకత్వ విషయంలో ఈ సినిమాకు పూర్తి న్యాయం చేశారు. అయితే రచయితగా మాత్రం ఆయన విఫలం అయ్యారు. ఎమోషన్ అండ్ ఫీల్ వంటి అంశాలని సమపాళ్లలో ఉంచి సగటు ప్రేక్షకుడిని అలరించే సినిమాను మాత్రం దర్శకుడు హరి తయారుచేయలేకపోయారు. సంగీత దర్శకుడు అందించిన నేపధ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ సినిమాకి తగట్లు ఉంది. నిర్మాత ప్రొడక్షన్ డిజైన్ కూడా ఆకట్టుకుంటుంది.

 

తీర్పు :

యాక్షన్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా వచ్చిన ఈ ‘ఏనుగు’ చిత్రంలో అరుణ్ విజయ్ నటన, అలాగే ఈ సినిమా మెయిన్ థీమ్ మరియు కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటాయి. అయితే, సెకెండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ చాలా స్లోగా సాగడం, అలాగే రెగ్యులర్ ప్లే, బోరింగ్ ట్రీట్మెంట్ వంటి అంశాలు సినిమాకి డ్రా బ్యాగ్స్ గా నిలుస్తాయి. మొత్తం మీద ఈ ‘చిత్రం’ ఫ్యామిలీ ఎమోషన్స్ కోరుకునే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మిగిలిన వర్గాల ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా నచ్చదు.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు