సమీక్ష : ‘గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3’ – డీసెంట్ గా సాగె ఎమోషనల్ యాక్షన్ అడ్వెంచర్

సమీక్ష : ‘గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3’ – డీసెంట్ గా సాగె ఎమోషనల్ యాక్షన్ అడ్వెంచర్

Published on May 6, 2023 3:04 AM IST
Guardians of the Galaxy English Movie Review

విడుదల తేదీ : మే 05, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు: క్రిస్ ప్రాట్, జో సల్దానా, బ్రాడ్లీ కూపర్, విన్ డీజిల్, డేవ్ బటిస్టా, కరెన్ గిల్లాన్, పోమ్ క్లెమెంటీఫ్, సీన్ గన్, చుక్వుడి ఇవుజీ, విల్ పౌల్టర్ తదితరులు.

దర్శకులు : జేమ్స్ గన్

నిర్మాత: కెవిన్ ఫీగే

సంగీత దర్శకుడు: జాన్ మర్ఫీ

సినిమాటోగ్రఫీ: హెన్రీ బ్రహం

ఎడిటర్: ఫ్రెడ్ రాస్కిన్ మరియు గ్రెగ్ డిఆరియా

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3 ఫైనల్ ఇన్స్టాల్మెంట్ మూవీ పై మొదటి నుండి వరల్డ్ వైడ్ ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సిరీస్ సినిమాలు పిల్లలు పెద్దలు అని తేడాలేకుండా అందరూ ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు. మరి నేడు ఎంతో క్రేజ్ తో ఆడియన్స్ ముందుకి వచ్చిన గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3 మూవీ ఎలా ఉందో ఇప్పుడు సమీక్షలో చూద్దాం.

 

కథ :

ఆడమ్ (విల్ పౌల్టర్) తన ప్రతీకారంలో భాగంగా తమ పై దాడి చేసే వరకు సావరిన్ యొక్క గోల్డెన్ హై ప్రీస్టెస్ అయిన ఆయేషా (ఎలిజబెత్ డెబికి) చేత సృష్టించబడిన నోవేర్ గ్రహం మీద గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ సంతోషకరమైన జీవితాన్ని గడుపుతుంటారు. రాకెట్ (బ్రాడ్లీ కూపర్) ఈ భారీ పోరాటంలో తీవ్రంగా గాయపడతాడు మరియు అతని స్నేహితులు మాట్లాడే రక్కూన్‌ను సృష్టించిన హై ఎవల్యూషనరీ (చుక్వుడి ఇవుజీ) నుండి అతని ప్రాణాలను రక్షించే మిషన్‌ను ప్రారంభిస్తారు. మరి ఇంతకీ హై ఎవల్యూషనరీ రాకెట్ మరియు అతని బృందంపై ఎందుకు దాడి చేసింది? గెలాక్సీ యొక్క గార్డియన్స్ రాకెట్ జీవితాన్ని రక్షించడంలో విజయం సాధించారా? అలానే వారి యొక్క ఏకైక లక్ష్యం రాకెట్‌ను రక్షించడం మాత్రమేనా అనేటువంటి ప్రశ్నలు అన్నింటికీ సమాధానాలు కావాలి అంటే ఈ మూవీ చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

గతంలో వచ్చిన గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ సిరీస్ సినిమాలు చూసిన వారికి ఇది బాగా అర్ధం అవుతుంది. అలానే ముఖ్యంగా రాకెట్ యొక్క ఎమోషనల్ గతం ఆకట్టుకుంటుంది. నిజానికి ఈ మూవీ కథ సింపుల్ గానే ఉన్నప్పటికీ దానిని ఆడియన్స్ కి కనెక్ట్ చేసి చివరి వరకు ఆకట్టుకునేలా సాగేలా తెరకెక్కించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు అనే చెప్పాలి. ఏమాత్రం ఆలస్యం లేకుండా మొదటి పది నిమిషాల్లోనే స్టోరీ యొక్క మెయిన్ పాయింట్ లోకి ఆడియన్స్ ని తీసుకెళ్తాడు దర్శకుడు జేమ్స్ గన్. ముఖ్యంగా సినిమాలో ఎమోషనల్ పార్ట్ ఎంతో ఆకట్టుకుంటుంది. రాకెట్ రాకూన్ బ్యాక్ స్టోరీ కూడా బాగుంటుంది. అలానే క్రిస్ ప్రాట్ (పీటర్ క్విల్ అకా స్టార్-లార్డ్), డేవ్ బటిస్టా (డ్రాక్స్), పోమ్ క్లెమెంటీఫ్ (మాంటిస్), కరెన్ గిల్లాన్ (నెబ్యులా), మరియు విన్ డీజిల్ (గ్రూట్) తమ తమ పాత్రల్లో ఒదిగిపోయి అద్భుతమైన నటన కనబరిచారు. ఇక మరింతగా స్టోరీ కి బలం అందించింది ఏమిటంటే, డ్రాక్స్ మరియు మాంటిస్ యొక్క పాత్రలు వారి మధ్య సంభాషణలు మరియు ఎమోషనల్ సన్నివేశాలు ఆడియన్స్ కి మంచి ఫీల్ ని అందిస్తాయి. ఆర్గో కార్ప్ మరియు కౌంటర్-ఎర్త్ ప్రపంచాలు అసాధారణమైనవిగా ఉంటాయి అలానే అక్కడి ప్రజలు కూడా అలానే మనకు కనిపిస్తారు. ముఖ్యంగా గ్రాండియర్ విజువల్స్ తో పాటు యాక్షన్ సీన్స్ అయితే ఆడియన్స్ ని ఎంతో అలరిస్తాయి. అలానే ఫైట్స్ లో వచ్చే స్లో మోషన్ సన్నివేశాలు కూడా అలరిస్తాయి.

 

మైనస్ పాయింట్స్ :

ఇక ఈ మూవీలో స్టోరీ, డైరెక్షన్, పాత్రధారుల యొక్క పెర్ఫార్మన్స్ అంతా ఎంతో బాగుంటుంది. అయితే గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ సిరీస్ యొక్క చివరి విడతలోని కొన్ని భాగాలు ప్రేక్షకులను గందరగోళానికి గురిచేస్తాయి మరియు సందేహాలను రేకెత్తిస్తాయి. దర్శకుడు జేమ్స్ గన్, రాకెట్ ఎవరు మరియు అతను ఎలా ఎదిగాడు అనేది బాగానే చూపించారు. ఒక సన్నివేశంలో, విలన్ హై ఎవల్యూషనరీ రాకెట్ ఒక మేధావి అని తెలుసుకుంటాడు. ఇక్కడ సమస్య ఏమిటంటే, కథ మొత్తం రాకెట్ గురించి సాగుతున్నపుడు, కౌంటర్-ఎర్త్‌లోని ఇతర జాతులతో పోలిస్తే రకూన్ చాలా తెలివైనదని నిరూపించడానికి జేమ్స్ గన్ ఒక ఆకట్టుకునే సన్నివేశాన్ని అయినా ఉదాహరణగా చూపించి ఉండాల్సింది. అలానే, హై ఎవల్యూషనరీ యొక్క ప్రతినాయక స్వభావాన్ని మరింత మెరుగ్గా చూపించినట్లయితే, అతను ఎంత శక్తివంతుడో ప్రేక్షకులకు మరింత అర్ధం అయ్యేది. గామోరా (జో సల్దానా) మరియు స్టార్-లార్డ్ (క్రిస్ ప్రాట్) మధ్య సన్నివేశాలు పెద్దగా ఆకట్టుకోలేదు. మరియు వారు ప్రేమికులుగా మళ్లీ కలుస్తారని ఆశించిన వారు ఒకింత నిరాశ చెందుతారు. మిగిలిన గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీని కలవడానికి ముందే గ్రూట్ మరియు రాకెట్ ఒకరికొకరు ఎలా దగ్గరయ్యారో దర్శకుడు చూపించి ఉండాల్సింది. వారి బ్యాక్‌స్టోరీని మరింత బాగా చూపించి ఉంటె ఎమోషనల్‌గా ఉండేది.

 

సాంకేతిక వర్గం :

ముందుగా దర్శకుడు జేమ్స్ గన్ ఈ మూవీ ఎంతో బాగా తెరకెక్కించారు అనే చెప్పాలి. కెమెరా వర్క్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్ ఎంతో బాగుండడంతో పాటు కొన్ని సన్నివేశాలు అయితే విజువల్ గా అదిరిపోయాయి. ఆర్గో కార్ప్ కి పెద్దగా రిలేటెడ్ గా లేని కొన్ని సన్నివేశాలని ఎడిటింగ్ విభాగం వారు ట్రిమ్ చేసి ఉంటె బాగుండేది. ప్రొడక్షన్ డిజైన్ ఎంతో రిచ్ గా ఉంది అలానే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా గొప్పగా ఉన్నాయి.

 

తీర్పు :

మొత్తంగా చెప్పాలి అంటే గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3 సినిమా మంచి ఎమోషనల్ అంశాలతో సాగే సూపర్ హీరో మూవీ. దర్శకుడు జేమ్స్ గన్ ఈ సినిమాని పూర్తి చేయడంలో సఫలం అయ్యారు, మరియు క్రిస్ ప్రాట్, జో సల్దానా, బ్రాడ్లీ కూపర్ మరియు కరెన్ గిల్లాన్ అందరూ తమ పెర్ఫార్మన్స్ తో అదరగొట్టారు. సాధారణంగా సాగే సింపుల్ స్టోరీ, మధ్యలో కొద్దిపాటి ల్యాగ్ లు వంటివి ప్రక్కన పెడితే మంచి విజువల్ వండర్ గా సాగే సూపర్ హీరో మూవీస్ ని ఇష్టపడే వారు గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3 మూవీని ఎంచక్కా చూసేయొచ్చు.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు