Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 
సమీక్ష : ఐస్ క్రీమ్ 2 – మరో టేస్ట్ లెస్ ఐస్ క్రీమ్

 ice-cream2_review విడుదల తేదీ : 21 నవంబర్ 2014
123తెలుగు. కామ్ రేటింగ్ : 2.25/5
దర్శకత్వం : రామ్ గోపాల్ వర్మ
నిర్మాత : తుమ్మలపల్లి రామసత్యనారాయణ 
సంగీతం : సత్య కశ్యప్
నటీనటులు : నందు, నవీన, జెడి చక్రవర్తి…


రామ్ గోపాల్ వర్మ ఈ పేరు వింటే ఒకప్పుడు సెన్సేషనల్ సినిమాల గురించి చెప్పేవారు.. ఇప్పుడేమో వర్మ అంటే ఫ్లాప్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు. ఇలా ఎన్ని వినిపించినా తన పంథాలో సినిమాలు చేయడం మాత్రం ఆపలేదు. ఇటీవలే ఫ్లో కామ్ టెక్నాలజీ అంటూ ‘ఐస్ క్రీమ్’ అనే సినిమాని తీసి థియేటర్స్ కి వచ్చిన ఆడియన్స్ కి చెడు అనుభవాన్ని మిగిల్చాడు. మరి ఇప్పుడు అడ్వాన్స్ ఫ్లో కామ్ అంటూ ‘ఐస్ క్రీమ్’ కి సీక్వెల్ అంటూ ‘ఐస్ క్రీమ్ 2’ సినిమా తీసాడు. ఆ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నందు, నవీన, జెడి చక్రవర్తి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సీక్వెల్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

ఒక ఐదు మంది ఫ్రెండ్స్ కలిసి ఒక షాట్ ఫిల్మ్ తియ్యాలని నిర్ణయించుకుంటారు. ఆ షార్ట్ ఫిల్మ్ తీద్దామని అడవిలో ఉన్న గెస్ట్ హౌస్ కి వెళ్తారు. వాళ్ళు అక్కడకి వెళ్ళినప్పటి నుంచి వాళ్ళకు కొన్ని వింత అనుభూతులు ఎదురవుతుంటాయి. దాంతో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకునే టైంలో బ్యాంక్ దొంగతనాలు చేసే సిక్క(జెడి చక్రవర్తి) అతని గ్యాంగ్ తో కలిసి ఈ ఐదుగురు ఫ్రెండ్స్ ని కిడ్నాప్ చేస్తాడు. అక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. కిడ్నాప్ జరిగిన రోజు నుంచి ఆ గ్యాంగ్ లో ఒక్కొక్కరే చంపబడుతూ ఉంటారు.. ఆ అడవిలో వాళ్ళని ఎవరు చంపుతున్నారు.? ఎందుకు చంపుతున్నారు.? చివరికి ఎవరన్నా బతికారా.? లేదా.? అలా బతికిన వాళ్ళు తమ ఫ్రెండ్స్ చావుల వెనుక ఉన్నది ఎవరు అనే విషయాన్ని చేధించగలిగారా.? లేదా.? అన్నది మీరు వెండితెపైనే చూడాలి..

ప్లస్ పాయింట్స్ :

ఐస్ క్రీమ్ సినిమా చూడని వారికి ఐస్ క్రీమ్ 2 సినిమా కాస్త బెటర్ గా అనిపించవచ్చు. ఎందుకు ఐస్ క్రీమ్ 2 కాస్త బెటర్ అంటున్నాం అంటే ఈ సినిమాలో చెప్పుకోవడానికి ఓ కాస్తో కూస్తో కథ అనేది ఒకటుంది, అలాగే కొన్ని సస్పెన్స్ ఎలిమెంట్స్ ని చాలా బాగా డీల్ చేసాడు. ఇలాంటి ఓ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాకి మంచి లొకేషన్స్ ని ఎంచుకున్నారు. ముందుగా సీనియర్ యాక్టర్ అయిన జెడి చక్రవర్తి సిక్క పాత్రలో మంచి నటనని కనబరచడమే కాకుండా, కొన్ని చోట్ల తన మానరిజమ్స్ తో ప్రేక్షకులను నవ్వించాడు. అలాగే తన పాత్రకి తగ్గట్టుగా తనకి చేసిన మేకప్ సూపర్బ్ గా సెట్ అయ్యింది.

ఆ తర్వాత ఐదు మంది ఫ్రెండ్స్ లో ముఖ్య పాత్రలు పోషించిన నందు నటన బాగుంది. అలాగే ధన్ రాజ్ కూడా అక్కడక్కడా నవ్వించడానికి ట్రై చేసాడు. నవీన సినిమాలో కేవలం గ్లామర్ పరంగా, అందాల ఆరబోతకి మాత్రమే ఉపయోగపడింది. తన అందాల విందు మాస్ ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటుంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండాఫ్ లో వచ్చే కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ బాగుండడంతో ఫస్ట్ హాఫ్ కంటే సెకండాఫ్ కాస్త బెటర్ గా అనిపిస్తుంది.

మైనస్ పాయింట్స్ :

ఈ మధ్య వస్తున్న ప్రతి రామ్ గోపాల్ వర్మ సినిమాలోనూ సస్పెన్స్ ఎలిమెంట్స్ ని బాగా ఆసక్తికరంగా స్టార్ట్ చేస్తాడు కానీ ఆ తర్వాత మాత్రం అవి బాగా డల్ అయిపోతాయి. అనుకున్న స్థాయిలో సస్పెన్స్ ఉండదు. ఈ సినిమాలో వర్మ ప్రతి ఒక్కరినీ చంపే విషయం మీద ఎక్కువ దృష్టి పెట్టాడు, కానీ అందరూ వాళ్ళని ఏమి చంపబోతోందా అని ఎదురు చూస్తున్న టైంలో చాలా సింపుల్ గా ట్విస్ట్ ని రివీల్ చెయ్యడం ఆడియన్స్ ని నిరాశపరుస్తుంది.

ఈ సినిమా కథా పరంగా ఫస్ట్ హాఫ్ అనేది పెద్ద మైనస్.. ఈ మధ్య కాలంలో వర్మ వాడుతున్న చీప్ గ్లామరస్ డోస్, వల్గర్ సాంగ్స్ ప్రేక్షకులకి కాస్త చిరాకు తెస్తాయి. వాటివల్ల రన్ టైం కూడా పెరిగిపోయింది. ప్రతి సినిమాలోలానే ఈ సినిమాలో కూడా హర్రీ బర్రీగా సినిమాని ముగించేసాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో పర్ఫెక్ట్ గా రివీల్ చేసి ఎండ్ చెయ్యకుండా సింపుల్ గా వాయిస్ ఓవర్ తో ఎండ్ చేసెయ్యడం బాలేదు.

సాంకేతిక విభాగం :

మొదటి సినిమాతో పోల్చుకుంటే ఐస్ క్రీమ్ 2 సినిమా లో ఉపయోగించిన ఫ్లో కామ్ టెక్నాలజీ కాస్త బెటర్ గా ఉంది. ఇందులో డైలాగ్స్ పెద్దగా లేవు, ఉన్నవి డీసెంట్ గానే ఉన్నాయి. అలాగే రన్ టైం కూడా తక్కువగా ఉంది. రామ్ గోపాల్ వర్మ తీసుకున్న ఐడియా బాగున్నా, దాన్ని ఓవర్ డోస్ వెళ్ళిపోయి తీయడం వల్ల సినిమా అంతబాగా లేదు. ఇకనుంచి అన్నా వర్మ క్లైమాక్స్ ని క్లియర్ గా ఉండేలా ప్లాన్ చేసుకుంటే బాగుండేది. స్క్రీన్ ప్లే కూడా బాగా స్లోగా ఉంటుంది. అలాగే కథలో చాలా పాత్రలకి సరైన జస్టిఫికేషన్ ఇవ్వలేదు.

తీర్పు :

రామ్ గోపాల్ వర్మ తీసిన ఐస్ క్రీమ్ సినిమా కంటే ‘ఐస్ క్రీమ్ 2’ సినిమా బాగుంది.. బాగుంది అన్నా కదా అని తొందరపడకండి.. మొదటి పార్ట్ కంటే ఇది బెటర్ అని మాత్రమే చెప్పా రామ్ గోపల్ వర్మ సక్సెస్ అయ్యాడని మాతం చెప్పలేదు. ప్రతి సినిమాలోలానే ఈ సినిమాలో కూడా అసంపూర్తిగా అనిపించే క్లైమాక్స్, అవసరానికి మించి గ్లామర్ ని వాడి సినిమా ఫ్లో ని చెడగొట్టారు. చెప్పాలంటే ఈ సినిమాని షార్ట్ ఫిల్మ్ గా తీస్తే చాలా బాగుండేది. ఫైనల్ గా ఐస్ క్రీమ్ 2 అనేది రామ్ గోపాల్ వర్మ నుంచి వచ్చిన ఫెయిల్యూర్ ప్రోడక్ట్..

123తెలుగు. కామ్ రేటింగ్ : 2.25/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW


సంబంధిత సమాచారం :