సమీక్ష : ఇంకేంటి నువ్వే చెప్పు – పాయింట్ బాగుంది కానీ ప్రయత్నం బాగాలేదు !

సమీక్ష : ఇంకేంటి నువ్వే చెప్పు – పాయింట్ బాగుంది కానీ ప్రయత్నం బాగాలేదు !

Published on Jan 7, 2017 8:05 AM IST
Inkenti Nuvve Cheppu review

విడుదల తేదీ : జనవరి 06, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

దర్శకత్వం : శివ శ్రీ

నిర్మాత : డా. విజయ్ ప్రసాద్ మళ్ల

సంగీతం : వికాస్ కురిమెళ్ళ

నటీనటులు : ప్రశాంత్, ప్రసన్న

ప్రముఖ నిర్మాత డా. విజయ్ ప్రసాద్ మళ్ల నిర్మించిన చిన్న చిత్రం ‘ఇంకేంటి నువ్వే చెప్పు’. నూతన దర్శకుడు శివశ్రీ అందరు నూతన నటీనటులతో తెరకెక్కించిన ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు పరిశీలిద్దాం..

కథ :

సంధ్య, శివ అనే ప్రేమ జంట తమ ప్రేమ కోసం తమ ప్రేమను కాపాడుకొనే ప్రయత్నాల్లో ఉంటారు. వారిద్దరూ గతంలో తమ రిలేషన్ షిప్ కోసం సపరేట్ మొబైల్స్ మైంటైన్ చేస్తుంటారు. అలా ఉన్న వారి మధ్య ఒకరోజు తీవ్ర గొడవ తలెత్తి ఇద్దరు తమ ఫోన్లను విసిరిపడేస్తారు.

వాటిలో సంధ్య ఫోన్ కార్తీని శివ ఫోన్ నీలుని చేరుతుంది. దాంతో కొత్తగా శివ, నీలు, సంధ్య, కార్తీ ల ప్రేమ కథ స్టార్టవుతుంది. అలా చిత్రంగా మొదలైన ఆ నలుగురి ప్రేమ కథ ఎలా సాగింది ? వారికి ఎలాంటి చిక్కులు వచ్చాయి ? అవి ఎలా సర్దుకున్నాయి ? అనేదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

హీరోయిన్ తండ్రి పాత్రలో సీనియర్ నటుడు సుమన్ నటన ఆకట్టుకుంది. ఆయన పాత్ర సినిమాకి కాస్త సీరియస్ నెస్ తీసుకొచ్చిందని చెప్పాలి. ఇక హీరో పాత్రలో నటించితిన్ ప్రశాంత్ నటన బాగుంది. గూగుల్ గురు పాటకు ఆటను వేసిన స్టెప్పులు అదిరాయి. హీరోయిన్లు సంధ్య, నీలు ల పెర్ఫార్మన్స్ పర్వాలేదు.

ఇక సెకండ్ హీరో ప్రసన్న సెకండాఫ్లో వచ్చే భాధాకరమైన మాంటేజ్ సాంగ్ లో నటనతో, హావా భావాలతో మెప్పించాడు. సినిమా కోసం దర్శకుడు శివ ఎంచుకున్న కథ, సినిమాలో రాసుకున్న డైలాగులు బాగున్నాయి. ముఖ్యంగా సినిమా ఓపెనింగ్లో టెక్నాలజీని ఎలా దుర్వినియోగం చేస్తున్నారో చూపే సన్నివేశాలు ఇంపెస్సివ్ గా ఉన్నాయి.

మైనస్ పాయింట్స్ :

సినిమా తీయడానికి మంచి కాన్సెప్ట్ నే ఎంచుకున్న దర్శకుడు శివ శ్రీ దాన్ని తెరపై ఎగ్జిక్యూట్ చేయడంలో విఫలమయ్యాడు. కథనంలోని లోటు పాట్లు సినిమా ప్రధాన లక్ష్యం నుండి ప్రేక్షకుడ్ని పూర్తిగా పక్కదారి పట్టించాయి. మధ్యలో వచ్చే కొన్ని పాటలు కూడా అంతరాయంలానే అనిపించాయి.

ఇక హీరోయిన్ నీలు డబ్బింగ్ అస్సలు కుదరలేదు. చాలా చోట్ల డబ్బింగ్ సినిమా చూస్తున్నట్టే ఉంది. సెకండాఫ్లో వచ్చే కామెడీ కూడా బోరింగ్ గా కథనం మధ్యలో బలవంతంగా ఇరికించినట్టు అనిపించాయి. అలాగే క్లైమాక్స్ కూడా సరైన ముగింపు లేక హడావుడిగా తెగ్గొట్టేసినట్టు అనిపించింది.

సాంకేతిక విభాగం:

సినిమా నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది కానీ కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటింగ్ వర్క్ ఆకట్టుకోలేదు. వికాస్ కురిమెళ్ళ సంగీతం పర్వాలేదనిపించింది. ఐదింటిలో మూడు పాటలు బాగున్నాయి. ఇక దర్శకుడు శివ శ్రీ విషయానికొస్తే సినిమా కోసం మంచి అంశాన్నే తీసుకున్నప్పటికీ దాన్ని సినిమాగా తీయడంలో, ఆసక్తికరంగా చెప్పడంలో ఆయన పూర్తిగా స్సక్సెస్ కాలేకపోయాడు.

తీర్పు :
మొత్తం మీద ఈ ‘ఇంకేంటి నువ్వే చెప్పు’ చిత్రం యొక్క అంశం మంచిదే అయినా కూడా దాన్ని తెరకెక్కించడంలో జరిగిన ప్రయత్నమే అంత బాగా జరగలేదు. ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్లో అక్కడక్కడా కొన్ని మంచి సన్నివేశాలు ఉన్నప్పటికీ బోరింగ్ కామెడీ, ఏమాత్రం పట్టు లేని నిరుత్సాహపరిచే సన్నివేశాలు ఈ సినిమాని కేవలం బిలో యావరేజ్ సినిమాగా నిలబెట్టాయి.

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు