సమీక్ష : ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం – స్లోగా సాగే ఎమోషనల్ సోషల్ డ్రామా!

సమీక్ష : ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం – స్లోగా సాగే ఎమోషనల్ సోషల్ డ్రామా!

Published on Nov 26, 2022 3:04 AM IST
Itlu Maredumilli Prajaneekam Movie-Review-In-Telugu

విడుదల తేదీ : నవంబర్ 25, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: అల్లరి నరేష్, ఆనంది, వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్

దర్శకుడు : ఏఆర్ మోహన్

నిర్మాత: రాజేష్ దండా

సంగీత దర్శకులు: శ్రీచరణ్ పాకల

సినిమాటోగ్రఫీ: రామ్ రెడ్డి

ఎడిటర్: ఛోటా కె ప్రసాద్

 

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

అల్లరి నరేష్ హీరోగా నటించిన చిత్రం ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. ఏఆర్ మోహన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నేడు రిలీజ్ అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

 

కథ :

 

తెలుగు టీచర్‌ శ్రీనివాస్ (నరేష్ ) ఎలక్షన్ డ్యూటీలో భాగంగా ఓ మారుమూల గిరిజన ప్రాంతం అయిన మారేడుపల్లి కి వెళ్తాడు. అప్పటికే ప్రభుత్వం పై కోపంతో రగిలిపోతున్న అక్కడ ప్రజలు శ్రీనివాస్ కి సహకరించారు. ఈ నేపథ్యంలో లక్ష్మి (ఆనంది) శ్రీనివాస్ కి సాయం చేస్తోంది. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో శ్రీనివాస్ పై మారేడుపల్లి ప్రజలకు నమ్మకం కుదురుతుంది. దీనికితోడు అక్కడ వారి సమస్యల్ని చూసి చలించిపోయిన శ్రీనివాస్ వారి తరఫున పోరాడాలని నిర్ణయించుకుంటాడు. మారేడుమిల్లి ప్రజానీకానికి కావాల్సిన కనీస సౌకర్యాల కోసం శ్రీనివాస్ ఏం చేశాడు?, మారేడుమిల్లి ప్రజానీకం హక్కులను ఎలా సాధించాడు?, ఈ క్రమంలో అక్కడ ప్రజానీకం చేసిన పోరాటం ఏమిటి? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

అమాయకత్వంతో 30 ఏళ్లుగా అన్యాయాలకి గురవుతున్న స్వచ్ఛమైన మనస్తత్వాలకు – సాయం చేయని అధికారులకు మధ్య జరిగిన సంఘర్షణ మయం ఈ సినిమా. ఈ ట్రెండీ లోకంలో వెనుకబడిన నేపథ్యాన్ని తీసుకుని, ఆ నేపథ్యంలోనే పూర్తి అమాయకపు పాత్రలను రాసుకుని, వారి సమస్యల పై సినిమా తీసిన దర్శకుడు ఏఆర్ మోహన్ ను మెచ్చుకొని తీరాలి. తెలుగు టీచర్ శ్రీనివాస్ పాత్రలో అల్లరి నరేష్ అద్భుతంగా నటించాడు. పాత్రకు తగ్గట్టు తన లుక్ ను తన బాడీ లాంగ్వేజ్ ను మార్చుకోవడం చాలా బాగుంది. కొన్ని కీలకమైన సన్నివేశాల్లో నరేష్ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో చాలా సహజంగా నటిస్తూ సినిమాకి హైలెట్ గా నిలచారు.

హీరోయిన్ గా నటించిన ఆనంది తన గ్లామర్ తో పాటు, తన సెటిల్డ్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంటుంది. కలెక్టర్ గా సంపత్ రాజ్, ఇంగ్లీష్ టీచర్ గా వెన్నెల కిషోర్ ఆకట్టుకున్నారు. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో కిషోర్ తన మ్యానరిజమ్స్ తో బాగానే నవ్వించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేశారు. సెకండాఫ్ లో కొన్ని భావోద్వేగ సన్నివేశాలను మోహన్ చాలా చక్కగా చూపించారు.

 

మైనస్ పాయింట్స్ :

 

దర్శకుడు ఏఆర్ మోహన్ గిరిజనల పై జరుగుతున్న దారుణాలకు సంబంధించి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథనాన్ని రాసుకోలేదు. మారేడుమిల్లి ప్రజలు ప్రభుత్వ అధికారులు మధ్యన వచ్చే ఘర్షణ తాలూకు సన్నివేశాలు సాగతీసినట్లు, కొంచెం సినిమాటిక్ గా అనిపిస్తాయి.

వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి సమస్యలను బాగానే ఎలివేట్ చేసినప్పటికీ, అవి కూడా స్క్రీన్ పై ఎఫెక్టివ్ గా పండలేదు. ఇక లవ్ ట్రాక్ ను ఇంకా బాగా ఎలివేట్ చేసే అవకాశాలు ఉన్నా, దర్శకుడు మాత్రం ఎందుకో లవ్ ట్రాక్ ను పూర్తిగా వాడుకోలేదు. సినిమాలో ముఖ్యంగా ఫారెస్ట్ నేటివిటీ ఎక్కువుగా కనిపిస్తోంది. అయినా నేటివిటీ తాలూకు డెప్త్ ఎక్కడో మిస్ అయింది.

దీనికితోడు దర్శకుడు ఏఆర్ మోహన్ కథనం విషయంలో బాగా స్లోగా అనిపించారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కొన్ని ల్యాగ్ ఎపిసోడ్స్ ను ఇంకా కుదించి ఉంటే బాగుండేది. అలాగే కథకు అవసరం లేని కొన్ని కామెడీ సీన్స్ ను తగ్గించాల్సింది.

 

సాంకేతిక విభాగం :

 

దర్శకుడు ఏఆర్ మోహన్ మంచి స్టోరీ లైన్ తీసుకున్నారు. గిరిజనల జీవితాల్లోని సమస్యలను చూపించే ప్రయత్నం చేశారు. సంగీత దర్శకుడు అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను ఎంతో రియలిస్టిక్ గా చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. ఎడిటింగ్ బాగుంది. కానీ అక్కడక్కడా ఉన్న కొన్ని సాగతీత సీన్స్ ను కూడా తగ్గించి ఉంటే ఇంకా బాగుండేది. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

 

తీర్పు :

 

ఎమోషనల్ సోషల్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో కొన్ని ఎలిమెంట్స్ తో పాటు ఫ్యూ ఎమోషనల్ సీన్స్, క్లైమాక్స్ బాగున్నాయి. అయితే, ఇంట్రస్టింగ్ గా సాగని ట్రీట్మెంట్ తో పాటు బోర్ గా సాగే కథనం, స్లో నేరేషన్ సినిమా ఫలిత్తాన్ని దెబ్బ తీసింది. ఓవరాల్ గా ఈ సినిమా ఓ వర్గం ప్రేక్షకులను మాత్రమే ఆకట్టుకుంటుంది.

 

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు