ఓటిటి సమీక్ష : అనన్య పాండే ‘ఖో గయే హం కహాన్’ – నెట్ ఫ్లిక్స్ లో హిందీ సినిమా

ఓటిటి సమీక్ష : అనన్య పాండే ‘ఖో గయే హం కహాన్’ – నెట్ ఫ్లిక్స్ లో హిందీ సినిమా

Published on Dec 26, 2023 11:54 PM IST

Salaar Movie Review in Telugu

విడుదల తేదీ : డిసెంబర్ 26, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు: అనన్య పాండే, సిద్ధాంత్ చతుర్వేది, ఆదర్శ్ గౌరవ్, రోహన్ గుర్బక్సాని, కల్కి కోల్చెయిన్ తదితరులు.

దర్శకుడు : అర్జున్ వరైన్ సింగ్

నిర్మాత: జోయా అక్తర్, రీమా కగ్టి, రితేష్ సిధ్వాని, ఫర్హాన్ అక్తర్

సంగీతం: OAFF-సవేరా, అంకుర్ తివారీ, సచిన్-జిగర్, కరణ్ కంచన్, అచింత్, రష్మీత్ కౌర్, సిద్ శిరోద్కర్

సినిమాటోగ్రఫీ: తనయ్ సతం

ఎడిటర్: నితిన్ బెయిద్

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

లైగర్ మూవీ ఫేమ్ అనన్య పాండే ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఖో గయే హం కహాన్ మూవీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది. సిద్ధాంత్ చతుర్వేది, ఆదర్శ్ గౌరవ్, రోహన్ గుర్బక్సాని, కల్కి కోల్చెయిన్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ యొక్క సమీక్ష ఇప్పుడు చూద్దాం.

 

కథ :

ఈ కథ ముఖ్యంగా ముగ్గురు స్నేహితుల మధ్య సాగుతుంది. కాగా వారు ముగ్గురు ఎవరంటే అహానా (అనన్య పాండే), ఇమాద్ (సిద్దాంత్ చతుర్వేది), నీల్ (ఆదర్శ్ గౌరవ్). అయితే వీరిలో ఇమాద్ స్టాండప్ కమెడియన్ కాగా జిమ్ ఇన్స్ట్రక్టర్ గా నీల్ పని చేస్తుంటారు. కాగా తమ వృత్తిలో మరింత గొప్పగా ఎదగాలని వారు ప్రయత్నిస్తుంటారు. మరోవైపు ఎంబీఏ గ్రాడ్యుయేట్ అయిన అహానా ఒక రిలేషన్ షిప్ సమస్యలో ఉంటుంది. అయితే మొత్తంగా ఈ ముగ్గురి జీవితాల్లో అనంతరం ఏమి జరిగింది అనేది మిగతా కథ.

 

ప్లస్ పాయింట్స్ :

ముఖ్యంగా ఖో గయే హం కహాన్ మూవీ నేటి యువతకు సంబందించిన ఒక కీలక టాపిక్ ని బేస్ చేసుకుని సాగుతుంది. ప్రస్తుతం నిజజీవితం కంటే ఎక్కువగా యువత సోషల్ మీడియాకే ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే. ఆ విధంగా తమ జీవితాల్లో ఎక్కువ సమయాన్ని మొబైల్ ఫోన్ చూస్తూనే గడుపుతూ ఉండే పాయింట్ ఆధారంగా మల్టిపుల్ అంశాలను స్పృశిస్తూ ఈ కథ సాగుతుంది. ఇక ఈ ముగ్గురు స్నేహితుల జీవితం ఆధారంగా మనకు ఒక మంచి మెసేజ్ కూడా ఈ మూవీలో ఉంటుంది. ఈ ముగ్గురూ కూడా తమ వ్యక్తిగత సమస్యలతో సతమతం అవుతూ సోషల్ మీడియా వలన జరిగిన ఎఫెక్ట్స్ ని ఎదుర్కొంటారు. అయితే ముందుగా సాదాసీదాగా సాగుతున్న కథలోకి ఈ ముగ్గురుకి సంబందించిన ఒక అంశాన్ని లింక్ చేసి కథనాన్ని ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. అయితే ఎండింగ్ సమయంలో ఎంతో ఇంటెన్స్ గా డార్కర్ వే కి స్టోరీ చేరుకుంటుంది. అయితే దానిని సటిల్ మ్యానర్ లో డీల్ చేశాడు దర్శకుడు. ప్రధాన పాత్ర పోషించిన అనన్య పాండే ఈ మూవీలో గత సినిమాలతో పోలిస్తే తన అభినయంతో ఆకట్టుకున్నారు. సిద్దాంత్ చతుర్వేది, ఆదర్శ్ గౌరవ్ తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించారు. అయితే సినిమాలో తక్కువ స్క్రీన్ టైం ఉన్నప్పటికీ కల్కి కొల్చెయిన్ ఎంతో ఆకట్టుకున్నారు.

 

మైనస్ పాయింట్స్ :

నిజానికి సినిమాలో తీసుకున్న పాయింట్, కథ బాగున్నప్పటికీ చాలా వరకు స్లోగా సాగుతుంది. ఇక మొదటి గంట మొత్తం ఆసక్తికరంగా సాగకపోవడంతో పాటు కొద్దిగా ఎడిట్ చేస్తే బాగుండేదనిపిస్తుంది. ఇక ఈ మూవీ యొక్క కాన్సెప్ట్ ఎక్కువగా అర్బన్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. ఇతర సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి పెద్దగా కనెక్ట్ కాకపోవచ్చు. కొంతవరకు కథనం నెక్స్ట్ ఏమి జరుగుతుంది అనేది ఊహించేలా సాగుతుంది. ఇక కామెడీ సన్నివేశాలను కూడా మరింత ఎఫెక్టివ్ గా రాసుకుని ఉండాల్సింది.

 

సాంకేతిక వర్గం :

ముఖ్యంగా మూవీలో మ్యూజిక్ ఎంతో బాగుంది మరియు మూవీ థీమ్ కి బాగా సింక్ అవుతుంది. అలానే తనయ్ సతం అందించితిన్ ఫోటోగ్రఫి అద్బుతముగా ఉంది. ఎడిటింగ్ విభాగం మరింతగా వర్క్ చేస్తే బాగుండేది. దర్శకుడు అర్జున్ వరైన్ సింగ్ ఫస్ట్ మూవీ అయినప్పటికీ బాగానే కష్టపడ్డారు. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ బాగానే హ్యాండిల్ చేశారు. నేటి డిజిటల్ ఎరాలోని పలు అంశాలను తీసుకుని తెరకెక్కించిన మేకర్స్ ని మెచ్చుకొవాలి.

 

తీర్పు :

మొత్తంగా ఖో గయే హం కహాన్ మూవీ నేటి కాలంలోని వారు అద్భుతమైన వ్యక్తిగత జీవితం కంటే సోషల్ మీడియాకి ఏ విధంగా అధిక ప్రాధాన్యతనిస్తున్నారు అనే కథాంశంతో తెరకెక్కింది. అనన్య పాండే, సిద్ధాంత్ చతుర్వేది, ఆదర్శ్ గౌరవ్ అనే ముగ్గురు జీవితాలు మనలోని చాలా మందికి రిలేట్ అవుతాయి. ఇందులోని నటీనటులు అందరూ కూడా బాగానే పెర్ఫార్మ్ చేసారు. అయితే స్లో పేస్ లో సాగడంతో పాటు అధిక రన్ టైం కొంత ఇబ్బంది పెడతాయి. ఇలాంటివి పెద్దగా పట్టించుకోకపోతే మీరు ఈవారం హ్యాపీగా ఖో గయే హం కహాన్ నెట్ ఫ్లిక్స్ లో చూసేయవచ్చు.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు