సమీక్ష : కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ – కొంతమంది యువతకు మాత్రమే

Kiss Kiss Bang Bang movie review

విడుదల తేదీ : డిసెంబర్ 14, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

దర్శకత్వం : కార్తీక్ మేడికొండ

నిర్మాత : సుజన్

సంగీతం : జివి

నటీనటులు : కిరణ్, హర్షద కులకర్ణి, గాయత్రీ గుప్త

టీజర్లతోనే మంచి బుజ్ ను క్రియేట్ చేసుకున్న చిత్రం ‘కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్’. ఈరోజే థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ :

ఆర్యన్ (కిరణ్) అనే వ్యక్తి మీడియాలో పనిచేస్తుంటాడు. గర్ల్ ఫ్రెండ్ (హర్షద కులకర్ణి) వలన విసిగిపోయిన ఆటను ఆమెను తన ఇంట్లోంచి వెళ్లిపొమ్మంటాడు. కానీ ఆమె అతని మాటల్ని లైట్ తీసుకుంటుంది. దాంతో ఇంకా విసిగిపోయిన ఆర్యన్ ఇంట్లోంచి వెళ్ళిపోతాడు.

అలా వెళ్ళిపోయిన అతను గాయత్రి గుప్త ఇన్వాల్వ్ అయిన హత్య కేసులో ఇరుక్కుంటాడు. ఆ హత్యలో ఇరుకున్న ఆర్యన్ కు ఏమైంది, హత్య కేసులో ఎలా ఇరుక్కున్నాడు అనేదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

సినిమాలో బాగా మెప్పించే అంశం నిర్మాణ విలువలు. కేవలం రూ.40 లక్షల బడ్జెట్ తో రూపొందించినప్పటికీ సినిమా చాలా రిచ్ గా కనిపించింది. సినిమాలో మైంటైన్ చేసిన డార్క్ థీమ్ చాలా చోట్ల ఆకట్టుకుంది.

అలాగే సెకండాఫ్లో రివీల్ అయ్యే సస్పెన్స్ ఎలిమెంట్స్ కూడా ఆసక్తికరంగా అనిపిస్తాయి. సినిమలో హైదరాబాద్ నిట లైఫ్ ను ప్రతిబింబించేలా తీసిన సన్నివేశాలు చాలా బాగా కుదిరాయి. ఇక పెర్ఫార్మన్స్ విషయానికొస్తే గాయత్రి గుప్త సహజంగా నటించి తన పాత్రకు చాలా వరకు న్యాయం చేసింది. హీరోయిన్ హర్షద కులకర్ణి కూడా లుక్స్ పరంగా మెప్పించింది.

మైనస్ పాయింట్స్ :

సినిమాకు పెద్ద డ్రాబ్యాక్ ఫస్టాఫ్. ఇందులోని సన్నివేశాలన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి అన్నీ సెకండాఫ్లో రివీల్ అవ్వడంతో ఫస్టాఫ్ అంతా క్లారిటీ లేకుండానే సాగిపోయింది. సెకండాఫ్లోని కొన్ని బిల్డప్ సీన్స్ కూడా మరీ ఓవర్ గా అనిపించాయి.

సాధారణమైన బ్రేకప్ స్టోరీని సాగదీసి చెప్పడంతో ఫస్టాఫ్ ను తట్టుకోవడం ప్రేక్షకులకు కొంత కష్టంగానే అనిపిస్తుంది. దర్శకుడు సినిమాను అసలు కథలోకి ప్రవేశపెట్టడానికి చాలా సమయం తీసుకున్నాడు. అంతేగాక ముగింపు కూడా ప్రేక్షకుల్ని తికమక పెట్టేలా చాలా సిల్లీగా ఉంది.

బాస్ పాత్రలో మహేష్ కత్తి పాత్ర కూడా చిరాకు పెట్టింది. సినిమాలో చాలా చోట్ల విపరీతమైన పదజాలం వాడటం కూడా కొంత ఇబ్బందికరంగా అనిపించింది.

సాంకేతిక విభాగం :

ముందుగా చెప్పినట్టు సినిమా నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. కెమెరా వర్క్ ను ప్రత్యేకంగా ప్రశంసించాల్సిందే. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమా ప్రభావాన్ని ఇంకాస్త పెంచింది. ఎడిటింగ్ బాగానే ఉంది.

దర్శకుడు కార్తీక్ మేడికొండ విషయానికొస్తే అతని పనితనం పర్వాలేదనే స్థాయిలో ఉంది. అతను సినిమాను సహజంగా, స్ట్రైకింగా చెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ అతను కథను చెప్పిన విధానం సరిగా లేకపోవడంతో ప్రయత్నం బెడిసికొట్టింది.

తీర్పు :

ఈ ‘కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్’ అనే సినిమా భిన్నంగా ఉండటానికి ప్రయత్నించింది కానీ ఉండలేకపోయింది. సినిమాలోని డార్క్ థీమ్ బాగున్నా అతిగా వాడిన విపరీత పదజాలం, కొన్ని సన్నివేశాలు ప్రేక్షకుల్ని ఇబ్బందిపడేలా చేస్తాయి. సెకండాఫ్లోని కొన్ని థ్రిల్లింగ్, సస్పెన్స్ ఎలిమెంట్స్ టప ఇందులో ఎంజాయ్ చేయడానికి పెద్దగా ఏమీ దొరకదు. మొత్తం మీద ఈ సినిమా కొంతమంది యువతకు మాత్రమే తగిన సినిమా.

123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :