సమీక్ష : లేడీస్ & జెంటిల్ మెన్ – మీకు నచ్చే బోల్డ్ అటెంప్ట్.!

సమీక్ష : లేడీస్ & జెంటిల్ మెన్ – మీకు నచ్చే బోల్డ్ అటెంప్ట్.!

Published on Jan 30, 2015 6:24 PM IST
Ladies-and-Gentlemen-review విడుదల తేదీ : 30 జనవరి 2015
123తెలుగు. కామ్ రేటింగ్ : 3/5
దర్శకత్వం : పిబి మంజునాథ్
నిర్మాత : ఎంవికె రెడ్డి
సంగీతం : రఘు కుంచె
నటీనటులు : అడవి శేష్, మహాత్ రాఘవేంద్ర, కమల్ కామరాజు, చైతన్య కృష్ణ, స్వాతి దీక్షిత్, నిఖిత నారాయణ్

చిన్న చిత్రాల డైరెక్టర్ మరియు నిర్మాత మధుర శ్రీధర్ నిర్మాణ సారధ్యంలో పిబి మంజునాథ్ ని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ చేసిన సినిమా ‘లేడీస్ & జెంటిల్ మెన్’. అడవి శేష్, మహాత్ రాఘవేంద్ర, కమల్ కామరాజు, చైతన్య కృష్ణ, స్వాతి దీక్షిత్, నిఖిత నారాయణ్, జాస్మిన్ బేసిన్ హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా తెలుగులో వచ్చిన ఫస్ట్ సైబర్ క్రైమ్ మూవీ. రఘు కుంచె మ్యూజిక్ అందించాడు. మరి తెలుగులో వచ్చిన ఈ ఫస్ట్ సైబర్ క్రైమ్ కామెడీ మూవీ ప్రేక్షకులను ఎంత వరకూ ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం..

కథ :

ఈ సినిమా కథ ముగ్గురు విభిన్న వ్యక్తుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ ముగ్గురు ప్రస్తుతం ఉన్న ఇంటర్నెట్ మరియు సోషల్ టెక్నాలజీ వల్ల ఎంత సఫర్ అయ్యారనేదే ఈ సినిమా మెయిన్ పాయింట్. మనీ అంటే పిచ్చి ఉన్న విజయ్(మహాత్ రాఘవేంద్ర) బ్లాక్ మనీ కోసం సోషల్ నెట్వర్క్స్ ని ఎలా వాడి ఇబ్బందుల్లో పడ్డాడన్నది అతని కథ. ఇక కృష్ణ మూర్తి(చైతన్య కృష్ణ)కి అమ్మాయిలంటే అమితమైన పిచ్చి. అలాంటి కృష్ణ మూర్తి ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన అమ్మాయి ద్వారా కృష్ణ మూర్తి ఎదుర్కున్న ఇబ్బందులేమిటి.?

ఇక చివరి కథ ఆనంద్ (కమల్ కామరాజు) – ప్రియ (నిఖిత నారాయణ్) లది.. ఆనంద్ తన బిజీ లైఫ్ లో వైఫ్ కి సరైన ప్రాముఖ్యత ఇవ్వకపోతే దానివల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి.? వీరిద్దరి మధ్యలోకి అడవి శేష్ ఎలా వచ్చాడు.? ఇలా ముగ్గురు విషయాల్లో చివరికి ఏం జరిగింది అనేది మీరు వెండి తెరపైనే చూడాలి.

ప్లస్ పాయింట్స్ :

లేడీస్ అండ్ జెంటిల్ మెన్ సినిమాకి ఎంచుకున్న కాన్సెప్ట్ బిగ్గెస్ట్ ప్లస్ అని చెప్పాలి. ప్రస్తుతం మన రోజు వారి ప్రపంచంలో జరుగుతున్న కొన్ని హార్డ్ హిట్టింగ్ విషయాలను చాలా మంచిగా చెప్పారు. చెప్పాలంటే కథకి ఎంచుకున్న మూడు కథలు చాలా సింపుల్ గా ఉంటాయికానీ ఈ మూడు కథలను ఎండ్ చేసిన విధానం అందరినీ కాస్త షాక్ అయ్యేలా చేయడమే కాకుండా, అందరిచేత మెప్పు పొందేలా ఉంటుంది. నటీనటుల్లో ముందుగా అడవి శేష్ గురించి చెప్పాలి. అడవి శేష్ నటన చాలా బాగుంది. ఇచ్చిన పాత్రని చాలా బాగా డీల్ చేసాడు. అతని లుక్ కూడా చాలా స్టైలిష్ గా ఉంది.

యంగ్ యాక్టర్ చైతన్య కృష్ణ కూడా కాలేజ్ కుర్రాడి పాత్రలో సూపర్బ్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. అలాగే నిఖిత నారాయణ్ – కమల్ కామరాజు ల పెర్ఫార్మన్స్ కూడా సినిమాకి బాగా హెల్ప్ అయ్యింది. మహాత్ రాఘవేంద్ర, స్వాతి దీక్షిత్, జాస్మిన్ బేసిన్ లు ఓకే అనిపించారు. ఈ సినిమా క్లైమాక్స్ ఎపిసోడ్ అందరినీ థ్రిల్ చేసేలా ఉండడమే కాకుండా కథకి పర్ఫెక్ట్ ఎండింగ్ ఇచ్చారనిపిస్తుంది. ఇలాంటి ఓ బోల్డ్ కాన్సెప్ట్ ని అటెంప్ట్ చేసి దాని నుంచి పక్కకి వెళ్ళకుండా అనుకున్న పాయింట్ చుట్టే కథని తిప్పడం సినిమాకి పెద్ద ప్లస్ అయ్యింది. ఇలాంటి సినిమా తీసినందుకు నిర్మాతలకు హ్యాట్సాఫ్ చెప్పాలి. మెసేజ్ ని కూడా బాగా చూపించాడు. రన్ టైం కేవలం 2 గంటలే అవడం కూడా ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ సాంగ్స్. అలా అని రఘు కుంచె మంచి సాంగ్స్ ఇవ్వలేదని అనుకోకండి.. ఆయన మంచి సాంగ్స్ ఇచ్చాడు కానీ పాటలు వచ్చే ప్లేస్ మాత్రం ఒక్కటి కూడా సెట్ అవ్వలేదు. సినిమా ఫ్లోని సాంగ్స్ బాగా చెడగొట్టాయి. ఇదొక కాన్సెప్ట్ ఓరియెంతెడ్ ఫిల్మ్ రెగ్యులర్ కమర్షియల్ అంశాలు కోరుకునే వారికి ఈ సినిమా పెద్దగా నచ్చక పోవచ్చు. అలాగే ఈ సినిమాకి ఈ టైటిల్ కూడా సెట్ అవ్వలేదు. ఇది కాకుండా కాన్సెప్ట్ ని రెప్రజెంట్ చేసేలా వేరే టైటిల్ ఏదైనా పెట్టి ఉంటే బాగుండేది.

సెకండాఫ్ తో పోల్చుకుంటే ఫిరత్ హాఫ్ కాస్త స్లోగా అనిపిస్తుంది. సినిమా మొదట్లో పాత్రలని ఎస్టాబ్లిష్ చెయ్యడం ఏదో హడావిడిగా జరిగిపోయినట్టు అనిపిస్తుంది. మహాత్ రాఘవేంద్ర పాత్రలో డైరెక్టర్ మిస్ చేసిన లాజికల్ పాయింట్స్ చాలానే
ఉన్నాయి. ఈ సినిమా బి, సి సెంటర్ ప్రేక్షకులకు పెద్దగ అనచ్చాక పోవచ్చు.

సాంకేతిక విభాగం :

రఘు కుంచె మ్యూజిక్ డీసెంట్ గా ఉంది. ముఖ్యంగా టైటిల్ సాంగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. సినిమాలో మూడు కథలను ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా చక్కగా కథను ప్రేక్షకులకు అర్ధమయ్యేలా చెప్పారు. సినిమా నిడివి తక్కువ ఉండేలా చూసుకుని, స్క్రీన్ ప్లేను ఆసక్తికరంగా రాసుకున్నారు. డైలాగ్స్ బాగున్నాయి.

మొదటి సినిమాతో దర్శకుడు మంజునాథ్ ఆకట్టుకున్నాడు. ఇంటర్నెట్ ప్రస్తుత సమాజం, మనుషులపై ఎటువంటి ప్రభావం చూపుతుంది, దాని వల్ల కలిగే అనర్ధాలు ఏంటి..? అనే అంశాలను సినిమాలో చూపించాడు. కథనంతో ప్రేక్షకులను థ్రిల్ కు గురి చేశాడు. ఎడిటింగ్ మరియు సినిమాటోగ్రఫీ సైతం బాగున్నాయి.

తీర్పు :

బోల్డ్ & కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమా ‘లేడీస్ & జెంటిల్ మెన్’. ఎటువంటి కమర్షియల్ మరియు కామెడీ అంశాలు లేకుండా రూపొందించినా, సినిమాను ఆసక్తికరంగా ముందుకు నడపడంలో దర్శకనిర్మాతలు సక్సెస్ అయ్యారు. సందేశాత్మక సినిమాలను, ప్రజెంట్ ఫాస్ట్ ఫార్వర్డ్ లైఫ్ లో మనుషల ప్రవర్తన, నేరపూరిత ఆలోచనలు ఎలా ఉంటున్నాయో తెలుసుకోవాలనుకునేవారు ఈ సినిమాను తప్పకుండా చూడండి.

123తెలుగు. కామ్ రేటింగ్ : 3/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు