సమీక్ష : “లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్” – సిల్లీ కామెడీతో సాగే బోరింగ్ డ్రామా!

సమీక్ష : “లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్” – సిల్లీ కామెడీతో సాగే బోరింగ్ డ్రామా!

Published on Nov 5, 2022 3:03 AM IST
LSS Movie-Review-In-Telugu

విడుదల తేదీ : నవంబర్ 04, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు: సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా, బ్రహ్మాజీ, సుదర్శన్, నరేన్, మైమ్ గోపి, గోవింద్ పద్మసూర్య, సప్తగిరి తదితరులు

దర్శకుడు : మేర్లపాక గాంధీ

నిర్మాత: వెంకట్ బోయనపల్లి

సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, రామ్ మిరియాల

సినిమాటోగ్రఫీ: ఎ వసంత్

ఎడిటర్: రాము తూము

 

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

 

సంతోష్ శోభన్ హీరోగా నటించిన కొత్త చిత్రం లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్. మేర్లపాక గాంధీ తెరకెక్కించిన ఈ మూవీలో జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించింది. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ సినిమా పై ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

 

కథ :

 

సంతోష్ శోభన్ (విప్లవ్) గువ్వ విహారి అనే నేమ్ తో యూట్యూబ్ ట్రావెలర్ గా ఫేమస్ కావడానికి అరకు టూర్ ప్లాన్ చేస్తాడు. అయితే, ఈ టూర్ లో అనుకోకుండా ఫరియా అబ్దుల్లా (వసుధ వర్మ) కూడా కలుస్తోంది. ఆమె అప్పటికే ఫేమస్ యూట్యూబ్ ట్రావెలర్. ఆమె ప్రేరణ తోనే సంతోష్ శోభన్ యూట్యూబ్ ట్రావెలర్ అవ్వాలి అనుకుంటాడు. ఆమె కలిసిన దగ్గర నుంచే సంతోష్ శోభన్ ఆమె వెనుక తిరుగుతూ ట్రై చేస్తూ ఉంటాడు. మరోపక్క డీజీపి ని చంపడానికి పీపీఎఫ్ పార్టీ ఉద్యమ కారులు ప్రయత్నం చేస్తుంటారు. అసలు ఈ పీపీఎఫ్ పార్టీకి డీజీపికి మధ్య గొడవ ఏమిటీ ?, వీరి మధ్యలోకి ఫరియా అబ్దుల్లా – సంతోష్ శోభన్ ఎలా ఇరుక్కుంటారు?, ఎందుకు పీపీఎఫ్ పార్టీ బ్రహ్మన్న (బ్రహ్మాజీ) వీరిని కిడ్నాప్ చేస్తాడు ?, చివరకు ఫరియా అబ్దుల్లా – సంతోష్ శోభన్ వారి నుంచి ఎలా తప్పించుకుంటారు ?, ఈ క్రమంలో వీరిద్దరూ ఎలా ప్రేమలో పడతారు? లాంటి విషయాలు తెలియాలంటే వెండితెర పై ఈ సినిమా చూడాల్సిందే.
 

ప్లస్ పాయింట్స్ :

 

సంతోష్ శోభన్ గత తన సినిమాల్లో కంటే ఈ సినిమాలో మంచి కామెడీ టైమింగ్ తో చాలా బాగా ఆకట్టుకున్నాడు. తన క్యారెక్టరైజేషన్ తో వచ్చే ఫన్ తో బాగా నవ్వించాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్స్ లో మరియు కొన్ని సెకండ్ హాఫ్ లో వచ్చే లవ్ సీక్వెన్స్ లో అలాగే మిగిలిన కామెడీ సీన్స్ లో కూడా సంతోష్ శోభన్ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. ఇక కథానాయకగా నటించిన ఫరియా అబ్దుల్లా తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు గ్లామర్ తోనూ ఆకట్టుకుంది.

సినిమాలో ఇంపార్టెంట్ రోల్ లో కనిపించిన బ్రహ్మాజీ ఎప్పటిలాగే అద్భుతంగా నటించాడు. బ్రహ్మాజీ కామెడీ టైమింగ్ బాగా వర్కౌట్ అయింది. మరో కీలక పాత్రలో కనిపించిన సప్తగిరి కూడా బాగా ఆకట్టుకున్నాడు. అలాగే సుదర్శన్, నరేన్, మైమ్ గోపి, గోవింద్ పద్మసూర్య తదితరులతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

 

మైనస్ పాయింట్స్ :

 

సినిమా కొన్ని చోట్ల ఎంటర్టైన్ గా సాగినా అక్కడక్కడ నెమ్మదిగా సాగుతుంది. అలాగే దర్శకుడు మేర్లపాక గాంధీ రాసుకున్న స్టార్టింగ్ సీన్స్ కూడా స్లోగా ఉన్నాయి. ఇక కొన్ని సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువ అయింది. అలాగే కామెడీ కోసం కథను పూర్తి సినిమాటిక్ టోన్ లో నడిపాడు దర్శకుడు.

అలాగే క్లైమాక్స్ లోని మెయిన్ విలన్ ట్రాక్ కి సంబంధించి మరింత డిటైల్డ్ గా చూపించి ఉంటే.. ఇంకా బెటర్ గా ఉండేది. అయితే, సినిమాలో మంచి స్టోరీ లైన్ ఉన్నా, సినిమాలో విలువైన భావోద్వేగాన్ని పండించే సన్నివేశాలకి స్కోప్ ఉన్నా, మేర్లపాక గాంధీ మాత్రం ఆ ఎమోషన్స్ ను సస్టైన్ చేయకుండా క్లుప్తంగా ముగించేశాడు.

దానికి తోడు కొన్ని కామెడీ సీన్స్ కూడా ఆకట్టుకునే విధంగా లేవు. అసలు హీరో హీరోయిన్ కొన్ని సీన్స్ లో అయితే మరీ సిల్లీగా బిహేవ్ చేస్తోన్న ఫీలింగ్ కలుగుతుంది. కొన్ని కీలక సన్నివేశాలు కూడా బాగాలేదు.

 

సాంకేతిక విభాగం :

 

దర్శకుడు మేర్లపాక గాంధీ తాను రాసుకున్న కథను స్క్రీన్ మీద మంచి ఫన్ తో బాగా ఎగ్జిక్యూట్ చేశాడు. కాకపోతే మేర్లపాక గాంధీ కథ పై ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో దృశ్యాలన్నీ కెమెరామెన్ చాలా అందంగా చూపించారు. సంగీతం ఆకట్టుకునేలా ఉంది. అయితే, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాకి తగ్గట్టు ఉంటే బాగుండేది. ఇక ఎడిటింగ్ బాగుంది. సినిమాలోని ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.

 

తీర్పు :

 

‘లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్’ అంటూ పక్కా కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది. సినిమాలో స్టార్టింగ్ సీన్స్, సిల్లీ ట్రాక్స్, ఫేక్ ఎమోషన్స్ అండ్ పూర్తి సినిమాటిక్ టోన్ మరియు కొన్ని కీలక సీన్స్ స్లోగా సాగడం వంటి అంశాలు కారణంగా సినిమా ఫలితం దెబ్బ తింది. అయితే, సంతోష్ శోభన్ నటన, ఫరియా అబ్దుల్లా గ్లామర్, బ్రహ్మాజీ కామెడీ సినిమాలో బాగున్నాయి. అంతకు మించి ఈ చిత్రంలో కంటెంట్ లేదు. మొత్తమ్మీద ఈ సినిమా నిరుత్సాపరుస్తుంది.

123telugu.com Rating: 2/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు