సమీక్ష : “మైదాన్” – మెప్పించే స్పోర్ట్స్ డ్రామా

సమీక్ష : “మైదాన్” – మెప్పించే స్పోర్ట్స్ డ్రామా

Published on Apr 10, 2024 8:54 AM IST
Maidaan Movie Review in Telugu

విడుదల తేదీ : ఏప్రిల్ 11, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

నటీనటులు: అజయ్ దేవగన్, గజరాజ్ రావ్, ప్రియమణి, రుద్రనీల్ ఘోష్, చైతన్య శర్మ, దేవిందర్ గిల్, తేజస్ రవిశంకర్, అమర్త్య రే, సుశాంత్ వయదండే మరియు ఇతరులు

దర్శకుడు: అమిత్ రవీందర్నాథ్ శర్మ

నిర్మాతలు: బోనీ కపూర్, జీ 5 స్టూడియోస్, అరుణవ రాయ్ సేన్‌గుప్తా, ఆకాష్ చావ్లా

సంగీత దర్శకుడు: ఏఆర్ రెహమాన్

సినిమాటోగ్రాఫర్‌లు: తుషార్ కాంతి రాయ్, ఫ్యోదర్ లియాస్

ఎడిటింగ్: దేవ్ రావ్ జాదవ్, షానవాజ్ మోసాని

సంబంధిత లింక్స్: ట్రైలర్

ప్రస్తుతం బాలీవుడ్ సినిమా వరుస హిట్స్ తో దూసుకెళ్తుంది. మరి ఈ క్రమంలో హీరో అజయ్ దేవగన్ కూడా వరుస హిట్స్ అందుకోగా ఇప్పుడు మరో చిత్రం “మైదాన్” తో ముందుకు వచ్చాడు. గత నెలలోనే “సైతాన్” చిత్రంతో భారీ హిట్ అందుకోగా ఇప్పుడు తన అవైటెడ్ సినిమా “మైదాన్” ని ఈ ఈద్ కానుకగా అయితే తీసుకొచ్చారు. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ :

ఇక కథలోకి వస్తే.. 1952 హెల్సింకీ ఒలింపిక్స్ లో జరిగిన ఫుట్ బాల్ మ్యాచ్ లో భారత జట్టు యుగోస్లీవియా జట్టుతో భారీ తేడాతో ఓటమి పాలవుతుంది. దీనితో అక్కడ పైనుంచి భారత్ జట్టుపై మీడియా టార్గెట్ చేస్తూ కథనాలు ప్రచారం చేస్తుంది. దీనితో అసలు ఓటమికి కారణం ఏంటి అనేది జట్టు కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్(అజయ్ దేవగన్) భారత్ ఫుట్ బాల్ ఫెడరేషన్ కి వివరించే ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత కొత్త ఆటగాళ్లతో మరోసారి తన ప్రయత్నాన్ని ఆరంభిస్తాడు. మరి హైదరాబాద్ నుంచి భారత జట్టు కోచ్ గా ఎదిగి తాను ఏం సాధించాడు? ఈ క్రమంలో తాను ఎదుర్కున్న సవాళ్లు ఏంటి? తదుపరి ఒలింపిక్స్ లో తాను సిద్ధం చేసిన టీం ఎలా పెర్ఫామ్ చేసింది అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

ఖచ్చితంగా మన దేశం తాలూకా గతాన్ని తెలియని నిజాల్ని నేటి తరానికి తెలియజేయడం తెలుసుకోవడం ఎంతో ఆవశ్యకతం. అలా వచ్చిన ఎన్నో బయో పిక్ చిత్రాల్లో కొన్ని చిత్రాలు సుస్థిర స్థానాన్ని ఏర్పర్చుకున్నాయి. అలాంటి వాటిలో ఈ చిత్రం తప్పకుండా నిలుస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. అది కూడా స్పోర్ట్స్ జానర్ లో వచ్చిన చిత్రాల్లో మైదాన్ కూడా ప్రత్యేక ముద్ర వేసుకుంటుంది.

పలు స్పోర్ట్ బ్యాక్ డ్రాప్ బయోపిక్ చిత్రాలు దంగల్, ఎం ఎస్ ధోని అలాగే చక్ దే ఇండియా లాంటి చిత్రాల్లో ఏ రేంజ్ థ్రిల్స్ ఎమోషన్స్ ఉన్నాయో మైదాన్ లో ధీటైన ఎమోషన్స్ కనిపిస్తాయి. దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కరినీ మైదాన్ కదిలిస్తుంది, ఆధ్యంతం ఆసక్తికర నరేషన్ తో హై మూమెంట్స్ తో కొనసాగుతుంది. వీటితో పాటుగా అసలు మన దగ్గర జరిగే అంతర్గత రాజకీయాలు అంతర్జాతీయ స్థాయిలో మన దేశపు స్పోర్ట్స్ అన్ని విషయాల్లో ఎందుకు రాణించడం లేదు అనేటి సున్నిత అంశాలు కూడా చాలా హార్డ్ హిట్టింగ్ గా మేకర్స్ చూపించారు.

ఇక ఈ సినిమాలో నటించిన ప్రధాన పాత్రదారుడు అజయ్ దేవగన్ కోసం చెప్పుకున్నట్టు అయితే.. అజయ్ దేవగన్ ఎలాంటి పొటెన్షియల్ కలిగిన నటుడో అందరికీ తెలుసు. ఎలాంటి పాత్రలో అయినా ఇమిడిపోయే ఈ నటుడు మైదాన్ లో కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ గా ప్రాణం పెట్టేసారు. ప్రస్తుత తరం చాలా మంది నిజ జీవిత రహీం ని ఆయన జీవిత గాథని దగ్గరుండి చూసి ఉండకపోవచ్చు. కానీ అజయ్ మాత్రం అతనే తానుగా జీవించి మరిపిస్తారు. మెయిన్ గా తన ఎమోషనల్ నటన ఖచ్చితంగా కదిలిస్తుంది. తనకి ఈ సినిమాతో మరోసారి జాతీయ పురస్కారం వచ్చినా ఎలాంటి ఆశ్చర్యం లేదని చెప్పవచ్చు. ఆ స్థాయిలో ఒక నటుడిగా ఈ సినిమాలో తాను మెప్పిస్తారు.

అలాగే ఈ సినిమాలో ఉన్న ఎన్నో హైలైట్ అంశాల్లో మెయిన్ మరో ముఖ్య అంశం ఫుట్ బాల్ మ్యాచులపై సీన్స్ అని చెప్పాలి. ఈ సీన్స్ లో గూస్ బంప్స్ ఇచ్చే ఎపిసోడ్స్ చాలా ఉన్నాయి. సాలిడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఈ సన్నివేశాలు బిగ్ స్క్రీన్స్ పై ఓ రేంజ్ ట్రీట్ ని అందిస్తాయి. అలాగే ఈ మ్యాచ్ సీన్స్ లో వి ఎఫ్ ఎక్స్ వర్క్ కూడా బాగా ఇంప్రెస్ చేస్తుంది. వీటి పరంగా ప్రొడక్షన్ డిజైన్ చాలా బాగుంది. ఇక ఇతర నటీనటుల్లో చైతన్య శర్మ, డేవిందర్ గిల్, తేజస్ రవిశంకర్, అమర్త్య రే, సుశాంత్ వాయదండే తదితరులు సాలిడ్ పెర్ఫామెన్స్ లు కనబరిచారు. అలాగే నెగిటివ్ షేడ్ లో కనిపించిన గజరాజ్ నటి ప్రియమణిలు తమ పాత్రలకి సంపూర్ణ న్యాయం చేకూర్చారు.

మైనస్ పాయింట్స్ :

ఈ చిత్రంలో మెప్పించే అంశాలు అధికంగానే ఉన్నాయి కానీ కొన్ని లోటుపాట్లు కూడా లేకపోలేవు. మెయిన్ గా సినిమా నిడివి చాలా పెద్దది, ఒక బయోపిక్ ని ఇంత నిడివి లోనే చూపించాలి అని లేదు కానీ ఉన్న సమయంలో ఎంత ఎంగేజింగ్ గా చూపించాం అనేది ముఖ్యం ఇది ఈ సినిమాలో అక్కడక్కడా మిస్ అవుతుంది.

మెయిన్ గా ఫస్టాఫ్ లో కొన్ని చోట్ల కథనం నెమ్మదిగా సాగుతుంది. అలాగే మరికొన్ని చోట్ల సన్నివేశాలు నెమ్మదిగా సాగుతాయి. మంచి హై మూమెంట్స్ తర్వాత కొన్ని బోర్ సీన్స్ లాంటివి ఫ్లో ని దెబ్బ తీస్తాయి. అలాగే మరికొన్ని సీన్స్ అనవసరంగా సాగదీసినట్టు అనిపిస్తుంది.

సాంకేతిక వర్గం :

పైన చెప్పినట్టుగా ఈ సినిమాలో నిర్మాణ విలువలు అన్ని అంశాల్లో అద్భుతంగా ఉన్నాయని చెప్పాలి. టెక్నీకల్ టీం లో రెహమాన్ ఇచ్చిన సంగీతం అయితే సినిమాకి వెన్నుముక అని చెప్పాల్సిందే. తన మ్యూజిక్ తో సినిమా మరో స్థాయిలోకి వెళ్ళింది. అలాగే తుషార్ కంటి రాయ్ అలాగే ఫ్యోడోర్ ల్యాస్ ల సినిమాటోగ్రఫీ విజువల్స్ నెక్ట్ లెవెల్లో ఉన్నాయి. ఫుట్ బాల్ మ్యాచ్ లని చిత్రాకరించిన విధానం, మెయిన్ గా చివరి 30 నిమిషాలు వర్క్ అయితే ఊహాతీతంగా ఉంటుంది. డైలాగ్స్ ఎడిటింగ్ కొన్ని సీన్స్ మినహా మిగతా అంతా బాగుంది.

ఇక దర్శకుడు అమిత్ రవీంద్రనాథ్ శర్మ విషయానికి వస్తే.. తాను ఈ చిత్రానికి అద్భుతమైన వర్క్ ని అందించారు అని చెప్పడంలో సందేహం లేదు. నటీనటుల నుంచి స్టన్నింగ్ పెర్ఫామెన్స్ ని రాబట్టడం నుంచి అన్ని అంశాల్లో కూడా తన పర్ఫెక్ట్ ఆలోచనా విధానం కనిపిస్తుంది. కథనాన్ని నడిపించిన విధానం ఎమోషన్స్ ని ఆవిష్కరించిన విధానం అన్నీ కూడా తాను బాగా హ్యాండిల్ చేశారు.

తీర్పు :

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “మైదాన్” ఖచ్చితంగా ఇండియన్ సినిమా నుంచి వచ్చిన బెస్ట్ స్పోర్ట్స్ డ్రామాస్ లో ఒకటి అని చెప్పవచ్చు. ఇలాంటి ఒక అరుదైన నిజ జీవిత కథకి అజయ్ దేవగన్ లాంటి నటుడు తోడై మరింత ప్రాణం పోశారు. ఇక దర్శకుడు పనితనం, సాంకేతిక నిపుణుల ఎఫర్ట్స్ అన్నీ కూడా ఈ మన చరిత్రగా రూపొందించిన “మైదాన్” ని తప్పకుండా వీక్షించే చిత్రంగా తీర్చి దిద్దారు. వీటితో ఈ చిత్రాన్ని ఖచ్చితంగా వెండితెరపై చూసి ఎంజాయ్ చేయవచ్చు. గతం కోసం తెలుసుకోవచ్చు.

123telugu.com Rating: 3.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు