సమీక్ష : ఒకే ఒక జీవితం – ఫీల్ గుడ్ ఎమోషనల్ సైంటిఫిక్ డ్రామా !

సమీక్ష : ఒకే ఒక జీవితం – ఫీల్ గుడ్ ఎమోషనల్ సైంటిఫిక్ డ్రామా !

Published on Sep 10, 2022 2:08 AM IST
Ranga Ranga Vaibhavanga Movie Review

విడుదల తేదీ : సెప్టెంబర్ 09, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

నటీనటులు: శర్వానంద్, రీతూ వర్మ, అక్కినేని అమల, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, ఆలీ, మధు నందన్ తదితరులు.

దర్శకత్వం : శ్రీ కార్తీక్

నిర్మాతలు: ఎస్ ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు

సంగీత దర్శకుడు: జెక్స్ బిజోయ్

సినిమాటోగ్రఫీ: సుజీత్ సారంగ్

శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ ఒకే ఒక జీవితం. ప్రియదర్శి, వెన్నెల కిషోర్, అమల అక్కినేని, నాజర్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించిన ఈ సినిమాని శ్రీ కార్తీక్ తెరకెక్కించారు. ఈ రోజు విడుదల అయిన ఈ చిత్రం ఏ మేరకు ఆకట్టుకుందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

ఆది (శర్వానంద్), శ్రీను (వెన్నెల కిషోర్), మరియు చైతు (ప్రియదర్శి) ముగ్గురు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. అయితే, ఈ ముగ్గురు తమ జీవితాల్లో ఎవరి సమస్యతో వారు పడుతూ ఉంటారు. తమ ప్రస్తుత పరిస్థితి పై అసంతృప్తి గా ఉంటారు. ఇలాంటి సమయంలోనే వీరి జీవితాల్లోకి సైంటిస్ట్ (నాజర్) వస్తాడు. అతను కనిపెట్టిన టైమ్ మిషన్ తో ఈ ముగ్గురు తమ గతంలోకి వెళ్లి, తమ ప్రస్తుతం సమస్యలను అలాగే భవిష్యత్తును గొప్పగా మార్చుకోవాలని అనుకుంటారు. అయితే ఆది మాత్రం చనిపోయిన తన తల్లి (అమల) ప్రాణాలు కాపాడాలని బలంగా కోరుకుంటాడు. ఈ క్రమంలో వచ్చే కొన్ని నాటకీయ పరిణామాల మధ్య వీరు గతంలోకి ఎలా వెళ్లారు ?, వెళ్ళాక వీరి జర్నీ ఎలా సాగింది ?, చివరకు వీరి జీవితాలు ఎలా టర్న్ అయ్యాయి ?, అసలు ఇంతకీ వీళ్ళు అనుకున్నది సాధించారా ? లేదా ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

చాలా ఎమోషనల్‌ సాగిన ఈ ఫిల్మ్ లో చాలా బ్యూటీఫుల్ ఎమోషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా అమ్మ ప్రేమకు సంబంధించి వచ్చే సన్నివేశాల్లో హృదయం బరువెక్కుతుంది. పైగా సినిమాలో సెంటిమెంట్‌, ఎమోషనలే కాదు, నావెల్టీ కూడా చాలా బాగుంది. అన్నిటికీ కంటే ముఖ్యంగా తెలుగు తెరకు ఈ పాయింట్‌ చాలా కొత్తగా ఉంది.

శర్వానంద్ ఈ సినిమాలో తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు చక్కగా నటించి మెప్పించాడు. ముఖ్యంగా తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్ని ఎమోషనల్ అండ్ ఫీల్ గుడ్ సీక్వెన్స్ స్ లో శర్వానంద్ చాలా బాగా నటించాడు. తల్లి పాత్రలో నటించిన అమల తన నటనతోనూ మరియు తన స్మైల్ తోనూ ఆకట్టుకుంది. హీరోయిన్ గా నటించిన రీతూ వర్మకి పెద్దగా స్కోప్ లేదు. అయితే ఉన్నంతలో ఆమె తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది.

ఇక ఈ సినిమాలో మెయిన్ హైలైట్ మాత్రం కామెడీ. ప్రియదర్శి, వెన్నెల కిషోర్‌ తమ కామెడీ టైమింగ్ తో ఈ సినిమా స్థాయిని పెంచారు. మెయిన్ గా శర్వానంద్, ప్రియదర్శి, వెన్నెల కిషోర్‌ ల మధ్య వచ్చే కామెడీ సీన్స్ చాలా బాగా మెప్పిస్తాయి. నాజర్ నటన కూడా సహజంగా ఉంది. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.

దర్శకుడు శ్రీ కార్తీక్ తీసుకున్న స్టోరీ లైన్, రాసుకున్న కొన్ని ఎమోషనల్ సీక్వెన్స్ స్ బాగున్నాయి. శర్వానంద్ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే సీన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక చివర్లో ఎమోషనల్ ఎలిమెంట్స్ తో సినిమాను ముగించడం కూడా ఆకట్టుకుంది.

 

మైనస్ పాయింట్స్ :

శర్వానంద్ పాత్రను, ఆ పాత్ర తాలూకు ప్లాష్ బ్యాక్ ను బాగా డైజైన్ చేసుకున్న దర్శకుడు అంతే స్థాయిలో సెకండ్ హాఫ్ ను రాసుకోలేదు. కొన్ని సీన్స్ కూడా లాజికల్ కరెక్ట్ గా అనిపించదు. అయితే, రాసుకున్న కథను తెర పై చాలా క్లారిటీగా చాలా ఎమోషనల్ గా చూపించాడు శ్రీ కార్తీక్. కానీ, ఎందుకో ప్లేను మాత్రం చాలా స్లోగా నడిపాడు.

నిజానికి సినిమాలో చాలా భాగం ఎమోషనల్ గా అండ్ ఫీల్ గుడ్ ఎలిమెంట్స్ తో ఇంట్రెస్ట్ గా నడిపినా.. కొన్ని సీన్స్ మాత్రం బోర్ గా సాగాయి. అలాగే సినిమా కళాత్మకంగా ఉండటం కారణంగా పక్కా మాస్ ఆడియన్స్ ను ఈ చిత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోకపోవచ్చు.

 

సాంకేతిక విభాగం :

టెక్నికల్ విభాగానికి వస్తే.. సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ చాలా బాగుంది. మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయ్యింది. ముఖ్యంగా మదర్ యాక్సిడెంట్ సీక్వెన్స్ లో నేపధ్య సంగీతం చాలా బాగుంది. అదే విధంగా సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది. దర్శకుడు శ్రీ కార్తీక్ స్క్రిప్ట్ పరంగానే కాకుండా, డైరెక్షన్ పరంగా కూడా చాలా బాగా ఆకట్టుకున్నాడు. ఇక నిర్మాతలు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి.

 

తీర్పు :

‘ఒకే ఒక జీవితం’ అంటూ వచ్చిన ఈ ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామాలో గుడ్ ఎమోషన్స్, బెటర్ స్క్రిప్ట్, మరియు బెస్ట్ ఫీల్ ఉంది. అలాగే, శర్వానంద్ – అమల నటన, , ప్రియదర్శి – వెన్నెల కిషోర్‌ కామెడీ ఈ సినిమాలో మెయిన్ హైలైట్స్. పైగా సినిమా కూడా కళాత్మకంగా ఎమోషనల్ గా సాగుతూ ఆకట్టుకుంది. అయితే స్క్రీన్ ప్లే లో స్లో నెరేషన్, కొన్ని సన్నివేశాలు పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. కానీ, సినిమాలో కంటెంట్ అండ్ ట్రీట్మెంట్ అద్భుతంగా ఉంది. మొత్తమ్మీద ఈ చిత్రం మెప్పిస్తోంది.

123telugu.com Rating: 3.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు