Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 
సమీక్ష: ఒక్కడొచ్చాడు – మళ్ళీ అదే పాత కథ !

Okkadochadu review

విడుదల తేదీ : డిసెంబర్ 23, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

దర్శకత్వం : సురాజ్‌

నిర్మాత : జి.హరి

సంగీతం : హిపాప్ తమిజా

నటీనటులు : విశాల్‌, తమన్నా, జగపతిబాబు


‘ఒక్కడొచ్చాడు’ సినిమా ఈ ఏడాదిలో రిలీజ్ అవుతున్న చివరి ద్విభాషా చిత్రం. ఈ సినిమా ఈ రోజు ‘వంగవీటి’, మరియు ‘సప్తగిరి’ వంటి చిత్రాలతో పోటీ పడి విడుదల అయ్యింది. విశాల్ కి ఈ సంవత్సరం ‘రాయుడు’ తర్వాత తెలుగులో ఇది రెండవ రిలీజ్. విశాల్ సరసన తమన్నా జోడీగా నటించిన ఈ చిత్రాన్ని సురాజ్ డైరెక్ట్ చేశాడు. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం…

కథ:

డీజీపీ చంద్రబోస్ (జగపతిబాబు) ఒక ధైర్యవంతుడైన పోలీస్ ఆఫీసర్. అతను దేవా (సంపత్) నుండి 50 కోట్ల డబ్బు రికవర్ చేస్తాడు. అర్జున్ (విశాల్) ఒక చిన్న గ్రామం నుండి సిటీకి వచ్చి దివ్య (తమన్నా) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. డీజీపీ చంద్రబోస్ చెల్లి అయిన దివ్య కూడా అతని బ్యాక్ గ్రౌండ్ ఏం తెలుసుకోకుండానే అతనితో లవ్ లో పడిపోతుంది. దివ్య ప్రేమని అంగీకరించిన చంద్రబోస్ పెళ్లి చేయడానికి ఏర్పాట్లు చేసే సమయంలో అర్జున్ తాను ఒక సిబిఐ ఆఫీసర్ అని చెప్తాడు. అంతేకాదు డీజీపీ దగ్గరనుండి 250 కోట్లు స్వాధీనం చేసుకుంటాడు. వెంటనే అక్కడ పెద్ద ట్విస్ట్. అసలు అర్జున్ సిబిఐ ఆఫీసర్ కాదని తెలుస్తుంది.

అసలు అర్జున్ కి కావాల్సింది ఏంటి? అతని గతం ఏంటి? ఎందుకు సిబిఐ ఆఫీసర్ గా నాటకమాడి అందరినీ నమ్మించాడు? డీజీపీ చంద్రబోస్ ద్గగరట డబ్బు ఎందుకుంది ? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్:

”ఒక్కడొచ్చాడు” సినిమాలో డీజీపీ చంద్రబోస్ మరియు దేవా పాత్రలను జగపతిబాబు మరియు సంపత్ పోషించారు. ఈ ఇద్దరు నటులు ప్రేక్షకుల అంచనాల మేరకు, తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. వీరి నటనతో సినిమాలో డెప్త్, సీరియస్ నెస్ పెరిగింది.

విశాల్ మాత్రం సినిమాలో ప్రతి సీన్ లో కనపడుతూ బాగానే నటించాడు, కానీ అతనిలో ఉన్న పూర్తి స్థాయి నటుడుని మాత్రం ఈ కథ బయటకు తీసుకురాలేకపోయింది. ఇక హీరోయిన్ పాత్రలో నటించిన మిల్కీ బ్యూటీ తమన్నా పాటలలో చాలా బాగా కనిపించి కనువిందు చేసింది.

మైనస్ పాయింట్స్:

సినిమా మొదటి భాగంలో అసలు కథే లేదు. ఇంకొక పదినిముషాలలో ఇంటర్వెల్ వస్తుందనగా సినిమా అసలు కథలోకి వెళ్ళింది. అంతవరకూ సినిమాని నడపాలి కాబట్టి రొటీన్, బోరింగ్ సన్నివేశాల్ని బలవంతంగా ఇరికించారు. కథ పాత సినిమా తరహా కథే అయినా కథనంలో కొత్తదనం ఎమన్నా ఉందా అంటే అది కూడా లేదు.

ఇక రెండవ భాగంలో హీరోయిన్ తమన్నా ఒక పాట, మూడు సన్నివేశాలలో తప్ప ఇంకెక్కడా కనిపించదు. ఆమెను కేవలం పాటల కోసమే తీసుకున్నారా అనిపించింది. వడివేలు కామెడీ కోసం చాలా ఎక్కువ సమయం కేటాయించారు కానీ వడివేలు కామెడీ కొంత సేపు బాగానే ఉన్నా ఆ తరువాత కథకు సంబంధం లేకుండా పోతూ బోర్ కొట్టించింది. ఇక కథనంలోకి బలవంతంగా జొప్పించిన పాటలు బోరింగ్ సినిమాని మరింత చిరాకుగా తయారు చేశాయి.

సాంకేతిక విభాగం:

పోరాట దృశ్యాలను ముఖ్యంగా కార్ ఛేజ్ లాంటి సన్నివేశాలు సినిమాటోగ్రాఫర్ అద్భుతంగా తన కెమెరాలో బంధించాడు. హిప్ హాఫ్ తమీజా సంగీతం బాగున్నా కొరియోగ్రఫి లోపంతో అంత ఆకట్టుకోలేకపోయింది. దర్శకుడు సురాజ్ సినిమా మొదటి భాగంపై ఇంకా కొంచెం శ్రద్ద తీసుకుని కాస్త ఎంటర్టైనింగా తీసి ఉంటే బాగుండేది. ఈ సినిమా ద్విభాషా చిత్రం అన్న మాటే కానీ సినిమాలోని ప్రతి పాత్రలోనూ, వాతావరణంలోనూ తమిళ ఫ్లేవర్ కొట్టొచ్చినట్టు కనిపించింది.

తీర్పు:

ఈ ‘ఒక్కడొచ్చాడు’ చిత్రం రొటీన్ పాత సినిమా కథే. జగపతిబాబు, సంపత్ ల నటన, కొన్నియాక్షన్ సన్నివేశాలు, కొంత కామెడీ ఇందులో మెప్పించే అంశాలు కాగా బోర్ కొట్టించే రొటీన్ ఫస్టాఫ్, ఇంటర్వెల్ కి కానీ సినిమా కథలోకి వెళ్ళకపోవడం, పాత కథే కావడం, బలవంతంగా ఇరికించిన కొన్ని కామెడీ సీన్లు విసిగించాడా ఇందులోని మైనస్ పాయింట్స్. మొత్తం మీద ఈ చిత్రం ఏమాత్రం ఆకట్టుకోకుండా బలవంతంగా సోషల్ మెసేజ్ ఇచ్చిన రొటీన్ సినిమా.

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team

Click here for English Review


సంబంధిత సమాచారం :