ఓటిటి రివ్యూ : క్రిమినల్ జస్టిస్ సీజన్ 2 (హిందీ సిరీస్ హాట్ స్టార్ లో ప్రసారం)

ఓటిటి రివ్యూ : క్రిమినల్ జస్టిస్ సీజన్ 2 (హిందీ సిరీస్ హాట్ స్టార్ లో ప్రసారం)

Published on Dec 30, 2020 1:58 PM IST

నటీనటులు : జిస్సు సేన్‌గుప్తా, కీర్తి కుల్హారీ, ఆశిష్ విద్యార్తి, పంకజ్ త్రిపాఠి, అనుప్రియా గోయెంకా

దర్శకత్వం : రోహన్ సిప్పీ

నిర్మాతలు : సమీర్ నాయర్, దీపక్ సెగల్, మైలీతా అగా

పలు ఆసక్తికర ఓటిటి వెబ్ సిరీస్ లు అలాగే డిజిటల్ గా రిలీజ్ అవుతున్న సినిమాల రివ్యూస్ తో కొనసాగిస్తున్న క్రమంలో మేము ఎంచుకున్న లేటెస్ట్ వెబ్ సిరీస్ “క్రిమినల్ జస్టిస్” డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉన్న ఈ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం రండి.

 

కథ :

 

ఇక ఈ రెండో సీజన్లో చిన్నపాటి లాయర్ అయినటువంటి మాధవ్ మిశ్రా (పంకజ్ త్రిపాఠి) అను చంద్ర(కృతి కుల్హారి) అనే ఆమె భర్త బిక్రమ్ చంద్ర(జిస్సు సేన్ గుప్త)ను చంపిన కేసును తీసుకొంటాడు. ఇక ఇదిలా ఉండగా బిక్రమ్ హాస్పిటల్ లో చనిపోయే సమయానికి ఈ సిరీస్ లో మాధవ్ కూడా ఊహించని ట్విస్ట్ ఒకటి తెలుస్తుంది. మరి ఈ కేసులో నిజంగానే అను చంద్ర తన భర్త బిక్రమ్ ను చంపాలి అనుకుందా? అసలు నిందితులు ఎవరు? ఎందుకు చేసారు? ఈ కేసును మాధవ్ ఎలా రక్తి కట్టించాడు అన్నదే అసలు కథ.

 

ఏమి బాగుంది?

 

ఇక ఈ రెండో సీజన్ విషయానికి వస్తే ఇందులో ఎంచుకున్న కథ మంచి ఆసక్తికరంగా అనిపిస్తుంది. అంతే కాకుండా దానిని మరింత గ్రిప్పింగ్ గా టేక్ చెయ్యడం దీనిపై మరింత ఆసక్తి కలిగిస్తుంది. ఇంకా అలాగే కొన్ని వయోలెన్స్ సన్నివేశాలను చాలా బాగా హ్యాండిల్ చేసినట్టు అనిపిస్తుంది. అంతే కాకుండా లాస్ట్ ఎపిసోడ్ కూడా మరింత ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది.

వీటితో పాటుగా మంచి నిర్మాణ విలువలు కూడా ఈ కథకు తగ్గట్టుగా ఆయా సన్నివేశాల రీత్యా నాచురల్ గా ఈ సిరీస్ లో కనిపిస్తాయి. ఇక ఈ సిరీస్ లోని కీలక నటుల విషయానికి వస్తే సీనియర్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ పంకజ్ త్రిపాఠి మరోసారి తన అవుట్ స్టాండింగ్ పెర్ఫామెన్స్ ను కనబరిచారు. ఎన్నో సిరీస్ లలో మంచి రోల్స్ లో కనిపించిన తాను సీజన్లో కూడా లాయర్ గా మంచి నటనను కనబరిచారు.

వీటితో పాటు మంచి ఫన్ కూడా ఇందులో జెనరేట్ చేసారు. ఇక అలాగే కృతి కుల్హారి కూడా ఈ సిరీస్ లో మంచి నటనను కనబర్చింది. ముఖ్యంగా పలు ఎమోషనల్ సన్నివేశాల్లో అయితే చాలా నాచురల్ లుక్స్ తో మంచి అవుట్ ఫుట్ ఇచ్చింది. ఇక అలాగే జిస్సు సేన్ గుప్తా మరో లాయర్ గా కనిపించిన ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థి తదితరులు తమ రోల్స్ నిమిత్తం మంచి నటనను కనబరిచారు.

 

ఏమి బాగోలేదు.?

 

ఇక ఈ సిరీస్ లో మెయిన్ డ్రా బ్యాక్ కోసం మాట్లాడుకున్నట్టయతే ఈ సీజన్ కాస్త నెమ్మదిగా అలా సాగుతున్నట్టు అనిపిస్తుంది. అలాగే కొన్ని సన్నివేశాల్లో మరింత ఫాస్ట్ నరేషన్ ఉంటే బాగున్ను.

అలాగే ఈ సిరీస్ ఎనిమిది ఎపిసోడ్స్ గా తీసేంత పెద్దదిగా కూడా అనిపించకపోవచ్చు జస్ట్ ఆరింటికి కుదించి ఉంటే బాగుండేది. అలాగే జిస్సు మరియు అతని భార్య మధ్యలో ఎపిసోడ్స్ ను ఇంకా ఆసక్తికరంగా మలచి ఉంటే బాగుండేది. అలాగే మరికొన్ని సన్నివేశాలు రిపీటెడ్ గా వచ్చినట్టు అనిపిస్తుంది. అలాంటివి అన్నీ ఎడిటింగ్ లో తీసేస్తే బాగున్ను.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసుకున్నట్టయతే ఈ “క్రిమినల్ జస్టిస్” సిరీస్ నటీనటుల మంచి పెర్ఫామెన్స్ లు డీసెంట్ స్టోరీ దానిని తెరకెక్కించిన విధానం, నిర్మాణ విలువలు బాగా అనిపిస్తాయి. కానీ కాస్తంత నెమ్మదిగా సాగే నరేషన్ లైట్ గా డిజప్పాయింట్ చేస్తుంది. మాకు కాస్త ఓపిక ఉంది లేదా స్కిప్ చేస్కుంటూ చూస్తాం అనుకునే వారికి ఈ సిరీస్ మంచి ఛాయిస్ అని చెప్పొచ్చు.

Rating: 3/5

సంబంధిత సమాచారం

తాజా వార్తలు