సమీక్ష : ప్రేమకథ – బోర్ గా సా…గే ప్రేమ లేని కథ

సమీక్ష : ప్రేమకథ – బోర్ గా సా…గే ప్రేమ లేని కథ

Published on Jan 5, 2024 6:47 PM IST
Raghava-Reddy Movie Review in Telugu

విడుదల తేదీ : జనవరి 05, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 1.75/5

నటీనటులు: కిషోర్ శాంతి దినకరన్, దియా సీతేపల్లి, వినయ్ మహాదేవ్, నేత్ర, పుష్ప ఫేమ్ రాజ్ తిరందాసు

దర్శకుడు : శివ శక్తి రెడ్ డి

నిర్మాతలు: విజయ్ మిట్టపల్లి

సంగీతం: రధన్

సినిమాటోగ్రఫీ: వాసు పెండెం

ఎడిటింగ్: ఆలయం అనీల్

సంబంధిత లింక్స్: ట్రైలర్

ఈ వారం థియేటర్స్ లోకి పలు చిన్న చిత్రాలు అయితే విడుదలకి వచ్చాయి. వాటిలో లవ్ డ్రామాగా వచ్చిన “ప్రేమకథ” కూడా ఒకటి. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

 

కథ :

ఇక కథలోకి వస్తే.. ఆర్ధికంగా వచ్చిన కొన్ని కష్టాలు రీత్యా తన కుటుంబాన్ని పోషించుకోడానికి ప్రేమ్(కిషోర్ శాంతి దినకరన్) ఓ స్టీల్ ఫ్యాక్టరీలో పనికి చేరుతాడు. అక్కడ తన ఫ్రెండ్ తో కలిసి అతడి లవ్ మ్యాటర్ లో హెల్ప్ చేద్దామని వెళ్తాడు. అక్కడ తన ఫ్రెండ్ లవర్ ఫ్రెండ్ అయినటువంటి నటి దియా సీతేపల్లిని చూసి మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. అక్కడ నుంచి తన ప్రేమ కథ ఎలా నడిచింది? ఆమె అతడికి ఓకే చెప్పాక ఫైనల్ గా వారి ప్రేమ గెలిచిందా లేదా? ఆమె కోసం ప్రేమ్ ఏం చేసాడు అనేది మిగతా కథ.

 

ప్లస్ పాయింట్స్ :

ఈ చిత్రంలో కనిపించే మెయిన్ లీడ్ నటీనటులు డీసెంట్ పెర్ఫామెన్స్ ని అయితే అందించారు. ప్రేమ్ గా యువ నటుడు కిషోర్ సెన్సిబుల్ పెర్ఫామెన్స్ ని చాలా నాచురల్ గా కనబరిచాడు. అలాగే యంగ్ నటి దియా కూడా బ్యూటిఫుల్ లుక్స్ లో కనిపించి మంచి నటన కనబరుస్తుంది.

ఇక వారితో పాటుగా నటించిన ఫ్రెండ్ పాత్రలు వినయ్ మహాదేవ్, నేత్రలు కూడా డీసెంట్ గా నటించారు. ఇక వీరితో పాటుగా పుష్ప ఫేమ్ రాజ్ తిరందాసు తన పాత్రకి న్యాయం చేసాడు. వీరితో పాటుగా మిగతా కొందరు నటులు ఓకే అనిపిస్తారు. ఇంకా సినిమాలో సంగీతం కూడా ఒక మాదిరిగా పర్వాలేదు అనిపిస్తుంది.

 

మైనస్ పాయింట్స్ :

ఈ చిత్రంలో కనిపించే చాలా రెగ్యులర్ లైన్ అయినప్పటికీ దానిని ఏమన్నా ఎంగేజింగ్ గా చూపించే ప్రయత్నం సినిమాలో ఉందా అంటే అస్సలు లేదం చెప్పాలి. సుమారు 2 గంటల 10 గంటల సినిమా అయినప్పటికీ ఈ సినిమా పూర్తవ్వడానికి చాలా సమయం తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. కథనం అసలు లాజిక్స్ అనేది లేకుండా పరమ బోర్ గా సాగుతుంది.

అసలు దర్శకుడు అనుకున్న పాయింట్ ని ఎలా కన్విన్స్ చేద్దాం అనుకున్నాడో అర్ధం కాదు. తాను చెప్పాలి అనుకున్న చిన్న పాయింట్ కోసం చాలా సాగదీతగా జస్ట్ షార్ట్ ఫిలిం లెవెల్లో చెప్పేసేదాన్ని 2 గంటల సినిమాగా మలిచి ఆడియెన్స్ సహనాన్ని పరీక్షిస్తారు. ఇంకా హీరో నటన బాగానే ఉంది కానీ ఆన్ స్క్రీన్ హీరోయిన్ తో స్క్రీన్ పై కెమిస్ట్రీ వర్కవుట్ కాలేదు.

ఇంకా మరీ కామెడీ ఏమిటంటే తన కుటుంబం కోసం పనిలో చేరిన తాను చేరిన కొద్ది లోనే పని వదిలేసి రోజు తన ఫ్రెండ్ తో కలిసి వాళ్ళ లవర్స్ దగ్గరకి వెళ్ళిపోతారు. అలాగే ప్రేమ అనే ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ ని పెట్టుకొని అసలు ఎక్కడా కూడా ఆ ఎమోషన్ ని ఆడియెన్స్ ఫీల్ అయ్యేలా లీనం అయ్యేట్టు కనిపించదు. ఇంకా అనవసర సన్నివేశాలు ఎక్కువగాను ఎమోషన్స్ చాలా తక్కువ కనిపిస్తాయి. పోనీ సినిమాలో కామెడీ ఎక్కడైనా ఉందా కథనంలో కాసేపు నవ్వుకుందాం అనేందుకు అలాంటివి ఏవి కూడా ఉండవు.

 

సాంకేతిక వర్గం :

సినిమాలో నిర్మాణ విలువలు పర్వాలేదు. అలాగే సినిమాలో మ్యూజిక్ కొంచెం పర్వాలేదు. రధన్ డీసెంట్ సాంగ్స్ అండ్ స్కోర్ ని అందించాడు. అలాగే సినిమాటోగ్రఫీ కూడా ఓకే. ఎడిటింగ్ బాగాలేదు. డైలాగ్స్ కొన్ని బాగున్నాయి. అలాగే కాస్ట్యూమ్స్ ఇంప్రెసివ్ గా ఉన్నాయి. మెయిన్ లీడ్ ని తమ పాత్రలకి తగ్గట్టు బాగా చూపించాయి.

ఇక దర్శకుడు శివ శక్తి రెడ్ డి విషయానికి వస్తే..తాను ఈ చిత్రానికి చాలా డిజప్పాయింటింగ్ వర్క్ అందించాడు అని చెప్పాలి. రెగ్యులర్ లైన్ నే ఎంచుకున్నాడు కానీ వాటిలో కొన్ని పాయింట్స్ ని పర్ఫెక్ట్ గా చెప్పే ప్రయత్నంలో చాలా బోర్ కొట్టించే నరేషన్ తో బలహీనమైన ఎమోషన్స్ వర్కౌట్ అవ్వని లవ్ డ్రామాతో డిజప్పాయింట్ చేస్తాడు.

 

తీర్పు :

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “ప్రేమకథ” లో మెప్పించే అంశాలు మెప్పించని అంశాలు ముందు చాలా చాలా చిన్నవిగా అనిపిస్తాయి. బాగా సాగదీతగా, వర్కౌట్ అవ్వని ఎమోషన్స్, లాజిక్ లేని కథనాలతో ఈ చిత్రం పరమ బోర్ కొట్టిస్తుంది. వీటితో ఈ చిత్రాన్ని స్కిప్ చేసేయడమే మంచిది.

123telugu.com Rating: 1.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు