సమీక్ష : 300 రైస్ ఆఫ్ ఎంపైర్ – రక్తపు చారలలో తడిచిన యాక్షన్ చిత్రం

సమీక్ష : 300 రైస్ ఆఫ్ ఎంపైర్ – రక్తపు చారలలో తడిచిన యాక్షన్ చిత్రం

Published on Mar 7, 2014 12:33 AM IST
300-Rise-of-an-Empire-poste విడుదల తేది :  07 మార్చ్ 2014
123తెలుగు .కామ్ రేటింగ్ : 3.25/5
దర్శకత్వం : నోమ్ ముర్రో
నిర్మాతలు : గియాన్ని నున్నారి
సంగీతం : టామ్ హోల్కేన్ బోర్గ్
నటినటులుసుల్లివన్ స్టాప్లేటన్, ఇవా గ్రీన్

300 రైస్ ఆఫ్ ఎంపైర్ సినిమా ఈ శుక్రవారం రానున్న పెద్ద సినిమాలలో ఒకటి. ఈ సినిమాకు ఈరోజు ఒకరోజు ముందుగానే ప్రత్యేక ప్రీమియర్ ను ప్రదర్శించారు. మరి ఈ సినిమా అంచనాలను అందుకుందా లేదా అన్నది చూద్దాం

కధ:

గ్రీస్ దేశం లో వుండే మారథాన్ నగరాన్ని పరిపాలించాలన్న ఆశకలిగిన పెర్షియన్ రాజు చంపబడతాడు. అతని కొడుకు గ్రీకులమీద కక్ష తీర్చుకుంటాడని శపధం చేస్తాడు. చివరికి అతని తండ్రి సహాయంతో ఒక భారీ సైన్యాన్ని ఏర్పరుచుకుని గ్రీస్ పై దండెత్తుతాడు. ఇదిలావుంటే గ్రీక్ ప్రజలు తమ రాజ్యాన్ని కాపాడుకునే ప్రయత్నంలో వుంటారు. థేర్మిస్తోకిల్స్ సైన్యాన్ని ఒకే తాటిపై నడిపించాలని కోరుకున్నా గ్రీక్ సైన్యం గుంపులుగా విడిపోతారు.

లియినోడాస్ రాజు 300 వందల మండి సైన్యంతో క్సెరెక్స్ టో పోటీకి దిగుతారు.మరో పక్క థేర్మిస్తోకిల్స్ అథెన్స్ నగరంకోసం నౌకా దళంటో పోరాడుతూవుంటాడు. చివరికి ఈ యుద్ధాలన్నీ ఏం మిగిల్చాయి? ఎవరు చివరకు విజయం సాధించారు అన్నది తెరపై చూడాలి.

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమాకు ప్రధాన బలం ఈవా గ్రీన్ నటన అనే చెప్పాలి. అందం, విలనిజం కలిపి నటించిన తీరు అద్భుతం థేర్మిస్తోకిల్స్ పాత్ర మైమరిపిస్తుంది. ఈవా గ్రీన్ టో కలిసి నటించిన సన్నివేశాలు చాలా బాగా పండాయి. ఈ చిత్రానికి కళ్ళుచెదిరే గ్రాఫిక్స్, నమ్మశక్యం కాని రీతిలో 3D ఎఫ్ఫెక్ట్స్ వీక్షకులను కట్టిపడేశాయి చిత్రానికి క్లైమాక్స్ మరో బలం అని చెప్పొచ్చు. థేర్మిస్తోకిల్స్ చివర్లో గుర్రం పైనుండి శత్రువులమీదకు దాడి చేసే సన్నివేశాలు, ముగింపు పూర్తిగా ఇవ్వకుండా మూడో భాగానికి స్కోప్ ఇవ్వడం బాగుంది.

మైనస్ పాయింట్స్ :

‘300’ సినిమాలో నటించిన పాత్రలు అంతగా కనపడవు. ఈ చిత్రం ఒక కొత్తపంధాలో సాగుతుంది.మొదటిభాగంలో హెరోయిజం లోపించింది. గత భాగంతో పోల్చుకుంటే హీరోయిజం తక్కువనే చెప్పాలి.ఈ సినిమాలో లెక్కకుమించిన ఫైట్ లు వున్నాయి. చనిపోయినవారి కళ్లను కాకులు తినడం వంటి సన్నివేశాలు మనకు అంతగా రుచించవు.

సాంకేతిక విభాగం:

సినిమాటోగ్రాఫి ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. నపధ్య సంగీతం కూడా చాలా బాగుంది. దర్శకుడి వ్యూహంలోకి వెళ్లగలిగితే ఈ సినిమా పాత చిత్రానికి కొనసాగింపే అన్న విషయం బోధపడుతుంది. దర్శకత్వం బానే చేశాడు.

చివరిగా:

300 రైజ్ ఆఫ్ ఎంపైర్ సినిమా పూర్తిస్థాయి హింసాత్మక చిత్రం. యాక్షన్ లవర్స్ ఈ సినిమా కోసం థియేటర్ లకు వెల్లచ్చు. ఈవా గ్రీన్ నటన మనకు ప్రత్యేక ఆకర్షణ. నిజానికైతే ఇది 300 సినిమాకు సీక్వెల్ కాదు.
123తెలుగు. కామ్ రేటింగ్ : 3.25/5

123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు