సమీక్ష : ఆట ఆరంభం – స్టైలిష్ రివెంజ్ డ్రామా..

సమీక్ష : ఆట ఆరంభం – స్టైలిష్ రివెంజ్ డ్రామా..

Published on Dec 7, 2013 1:00 AM IST
Aata-Arrambam విడుదల తేదీ : 6 డిసెంబర్ 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
దర్శకుడు :  విష్ణు వర్ధన్
నిర్మాత : శ్రీనుబాబు. జి
సంగీతం : యువన్ శంకర్ రాజ 
నటీనటులు : అజిత్, ఆర్య, నయనతార, తాప్సీ…

మాములుగా ఇతర భాషల్లో సినిమా హిట్ అయితే దాన్ని వెంటనే తెలుగులోకి డబ్ చేసి నాలుగు డబ్బులు సంపాదించుకుందామని ఇక్కడి చిన్న నిర్మాతలు ట్రై చేస్తుంటారు. అదే కోవలోనే తమిళ్ లో ఫుల్ క్రేజ్ ఉన్న అజిత్ హీరోగా నటించిన సినిమా ఆరంభం వచ్చి చేరింది. దీపావళి కానుకగా విడుదలై తమిళ్ లో విజయాన్ని అందుకున్న ఈ సినిమాని ‘ఆట ఆరంభం’ అనే టైటిల్ తో తెలుగులో ఈ రోజు రిలీజ్ చేసారు. ఈ సినిమాలో అజిత్ తో పాటు ఆర్య, రానా కూడా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. నయనతార, తాప్సీ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి యువన్ శంకర్ రాజ మ్యూజిక్ కంపోజ్ చేసాడు. గతంలో పవన్ కళ్యాణ్ తో ‘పంజా’ సినిమా తీసిన విష్ణు వర్ధన్ ఈ సినిమాకి డైరెక్టర్. తమిళ ప్రేక్షకులని మెప్పించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులని ఎంతవరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం…

కథ :

అశోక్ కుమార్(అజిత్) ముంబైలో వరుస బ్లాస్ట్ లు చేస్తాడు. కట్ చేస్తే ముంబై వచ్చిన ఎథికల్ హ్యాకర్ అర్జున్(ఆర్య), అతని ఫ్రెండ్ మాయ(నయనతార)ని కిడ్నాప్ చేస్తాడు. అలాగే ఆర్య పెళ్లి చేసుకోబోయే అనిత(తాప్సీ) ని కూడా కిడ్నాప్ చేస్తాడు. అలా కిడ్నాప్ చేసిన వారిని చంపేస్తానని చెప్పి ఆర్యని బ్లాక్ మెయిల్ చేసి కొన్ని చట్ట విరుద్దమైన పనులు చేయమంటాడు. ఇక చేసే దారిలేక అశోక్ చెప్పింది అర్జున్ చేస్తుంటాడు.

అదే తరుణంలో ఈ బ్లాస్ట్ లు, ముంబైలో జరుగుతున్న కొన్ని మర్డర్ లపై పోలీస్ డిపార్ట్ మెంట్ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడుతుంది. అసలు అశోక్ కుమార్ ఎందుకు ఇలా చట్ట వ్యతిరేఖ పనులు చేస్తున్నాడు? అర్జున్, మాయ, అనిత అశోక్ నుంచి తప్పించుకోగాలిగారా? లేదా? చివరికి పోలీసులు అశోక్ ని పట్టుకోగలిగారా? లేదా? అనే ఆసక్తికరమైన కథాంశాన్ని వెండితెరపైనే చూడాలి.

ప్లస్ పాయింట్స్ :

మాములుగానే డైరెక్టర్ విష్ణు వర్ధన్ కి స్టైలిష్ డైరెక్టర్ అని పేరుంది. మరోసారి ఆ పేరుని సార్ధకత చేసుకుంటూ ఎంచుకున్న సింపుల్ కాన్సెప్ట్ ని చాలా స్టైలిష్ గా తీసాడు. అజిత్ ఈ సినిమాలో రెండు షేడ్స్ ఉన్న పాత్ర పోషించాడు. అందులో ఒకటి బాంబ్ స్క్వాడ్ ఆఫీసర్. ఆ పాత్రలో పెర్ఫార్మన్స్ డీసెంట్ గా ఉంది. మరొక షెడ్ నెగటివ్.. మాములుగానే నెగటివ్ షేడ్స్ చేయడంలో తమిళ్ హీరో తల అజిత్ కి చాలా మంచి పేరుంది. ఈ సినిమాలో కూడా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో సూపర్బ్ అనిపించాడు. అలాగే చట్టాన్ని వాడుకొని దేశాన్ని దోచుకుంటున్న వారందరినీ మట్టు పెట్టడానికి ఒంటరిగా పోరాటం చేస్తుంటాడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో అజిత్ ఫ్రెండ్ గా అతిధి పాత్రలో కనిపించిన రానా నటన చాలా బాగుంది.

ఆర్య నటన బాగుంది. తను లవర్ బాయ్ గా తాప్సీతో చేసే సందడి కామెడీగా ఉంటుంది. అలాగే తాప్సీ నటన పాత్రకి తగ్గట్టు ఉంది. నయనతార చాలా స్టైలిష్ అండ్ గ్లామరస్ గా ఉంది. ఒక సీన్ లో బాగా హాట్ హాట్ గా కనిపించి ముందు బెంచ్ వారిని బాగా ఆకట్టుకుంది. హోం మినిస్టర్ పాత్రలో మహేష్ మంజ్రేకర్ నటన బాగుంది. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా వేగంగా సాగిపోతుంది. అలాగే సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకి ప్రధాన హైలైట్ అని చెప్పుకోవచ్చు.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాలో మహేష్ మంజ్రేకర్, అతుల్ కులకర్ణి, సుమన్ రంఘనాథన్ పాత్రలను చూస్తున్నప్పుడు కాన్సెప్ట్ ఏంటా అనేది కొంత వరకు ఊహించేయవచ్చు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అవ్వగానే నెక్స్ట్ సినిమాలో ఏం జరుగుతుంది, క్లైమాక్స్ ఎలా ఉండబోతుంది అనేది ప్రేక్షకులకి అర్థమైపోతుంది. ఆర్య మంచి నటుడు కానీ సినిమాలో అజిత్ తో పోల్చుకుంటే పెద్దగా ఏమీ అనిపించదు. అలాగే ఆర్యని కాలేజ్ ఎపిసోడ్ లో చూపించిన విధానం అంత బాలేదు. చెప్పాలంటే డైరెక్టర్ అనుకున్న దానిలో ఎం తప్పులేదు. కానీ ఆ లుక్ ఆర్యకి సెట్ అవ్వలేదు. సినిమా చాలా వేగంగా సాగిపోతుండడం వల్ల పాత్రలు కూడా అలా వస్తుంటాయి అలా వెళ్లి పోతుంటాయి దానివల్ల ప్రేక్షకులకి ఏ పాత్ర ఎందుకు వస్తోందో, వెళ్ళిపోతోందో అనేది అర్థం కాదు.

సాంకేతిక విభాగం :

ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ సూపర్బ్ గా ఉంది. అలాగే ఈ సినిమా గురించి ది బెస్ట్ అని చెప్పుకునే వాటిల్లో సినిమాటోగ్రఫీ ఒకటి. ఇక యువన్ శంకర్ రాజ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. కానీ పాటలు మాత్రం చెప్పుకునేలా లేవు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాగుంది.

డైరెక్టర్ విష్ణు వర్ధన్ సెంట్రల్ గవర్నమెంట్ లో జరిగన ఓ స్కాంని కాన్సెప్ట్ గా తీసుకొని రాసుకున్న సింపుల్ కథకి మంచి స్క్రీన్ ప్లే తోడవడంతో సినిమా వేగంగా సాగిపోతుంది. కానీ క్లైమాక్స్ మాత్రం అనుక్కున్న స్థాయిలో లేదు. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సింది. నిర్మాణ విలువలు మాత్రం బాగా రిచ్ గా ఉన్నాయి.

తీర్పు :

ఆట ఆరంభం సినిమాని మొత్తాన్ని అజిత్ ఒక్కడే తన భుజాల మీద వేసుకొని చేసాడు. అలాగే తను ఎక్కడా నిరుత్సాహపరచలేదు. అతను డాన్స్ లు, పర్ఫెక్ట్ ఫిజిక్ తో ఆకట్టుకోకపోయినా సూపర్బ్ స్టంట్స్, నెగటివ్ షేడ్స్ పాత్రతో అందరినీ ఆకట్టుకున్నాడు. సినిమా ఫస్ట్ హాఫ్ చూసాక సినిమా సెకండాఫ్ పై ఆడియన్స్ కి అంచనాలు పెరిగిపోతాయి. కానీ ఆ అంచనాలను అందుకోలేకపోయింది. క్లైమాక్స్ మరీ ఊహాజనితంగా మారిపోవడంతో ప్రేక్షకులు నిరుత్సాహానికి గురవుతారు. మొత్తంగా ఆట ఆరంభం చూడదగిన స్టైలిష్ రివెంజ్ డ్రామా.

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

రాఘవ

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు