సమీక్ష : బిరియాని – టేస్ట్ సరిగా కుదరలేదు..

సమీక్ష : బిరియాని – టేస్ట్ సరిగా కుదరలేదు..

Published on Dec 20, 2013 8:00 PM IST
Biryani విడుదల తేదీ : 20 డిసెంబర్ 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
దర్శకుడు : వెంకట్ ప్రభు
నిర్మాత : జ్ఞానవేల్ రాజా
సంగీతం : యువన్ శంకర్ రాజ
నటీనటులు : కార్తీ, హన్సిక, ప్రేంజీ అమరేన్..

తమిళ హీరో కార్తీ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘బిరియాని’ సినిమా ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడులో ఈ రోజు విడుదలైంది. వెంకట్ ప్రభు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో హన్సిక హీరోయిన్ గా కనిపించింది. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజ నిర్మించిన ఈ సినిమాకి యువన్ శంకర్ రాజ సంగీతం అందించాడు. చాలా కాలంగా మంచి విజయం కోసం ఎదురు చూస్తున్న కార్తీకి ఈ బిర్యానిలో అన్నీ చక్కగా కుదిరి విజయాన్ని అందించిందో లేదో ఇప్పుడు చూద్దాం..

కథ :

యంగ్ బాయ్ అయిన సుదీర్(కార్తీ)కి అమ్మాయిలను అమితంగా ఆకట్టుకునే స్పెషల్ టాలెంట్ ఉంటుంది. సుదీర్ ఒక ట్రాక్టర్ కంపెనీలో పనిచేస్తూ ఇండస్ట్రియలిస్ట్ అయిన వరదరాజన్(నాజర్) దగ్గర మంచి పేరు తెచ్చుకుంటూ ఉంటాడు. ఒక రోజు వరదరాజన్ ఇచ్చిన ఓ పార్టీకి వచ్చిన సుదీర్ అతని ఫ్రెండ్ పరశురాం(ప్రేంజీ అమరెన్) లకి హాట్ బ్యూటీ అయిన మాయ(మాండీ తఖర్) పరిచయం అవుతుంది. మాయ లుక్ కి పడిపోయిన సుదీర్ ఆ నైట్ మాయతో కలిసి తన ఇంటికి వెళతాడు. ఆ రాత్రి బాగా తాగి ఎంజాయ్ చేసిన సుదీర్ ఉదయం లేచి చూసే సరికి మాయ కనిపించదు. కట్ చేస్తే సుదీర్ ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. అక్కడి నుంచి ఆ మర్డర్ కేసు నుండి తనని రక్షించు కోవడానికి ప్రియాంక (హన్సిక) మరియు అతని స్నేహితుల సాయం తీసుకుంటాడు. ఆ మర్డర్ ఎవరు చేసారు అనే విషయాన్ని సుదీర్ ఎలా చేదించాడు? దానికోసం ఎన్ని ఇబ్బందులు పడ్డాడు? చివరికి ఆ కేసు నుంచి బయటపడ్డాడా? లేదా? అనేదే మిగిలిన కథాంశం..

ప్లస్ పాయింట్స్ :

సినిమాలో కార్తీ లుక్ మరియు అతని పెర్ఫార్మన్స్ చాలా డీసెంట్ గా ఉంది. సినిమాలో అమ్మాయిలను ఇంప్రెస్ చేసే సీన్స్ లో కార్తీ నాచురల్ లుక్ సీన్స్ కి బాగా హెల్ప్ అయ్యింది. హన్సిక చూడటానికి చాలా బాగుంది. కానీ తన పాత్ర మాత్రం చిన్నది. రిచ్ ఇండస్ట్రియలిస్ట్ పాత్రలో నాజర్ సరిపోయాడు. మాండీ తఖర్ ఉన్నది కొద్ది సేపే అయినప్పటికీ గ్లామర్ తో బాగా ఆకట్టుకుంది.

ప్రేంజీ కొన్ని సీన్స్ లో బాగా చేసాడు కానీ అక్కడక్కడా కావాలసిన దానికన్నా ఎక్కువ చేసాడనిపిస్తుంది. ఇంటర్వెల్ కి 15 నిమిషాల ముందు నుంచి బాగా వేగం పంచుకుంటుంది, అలాగే ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా బాగుంది. సెకండాఫ్ లో సస్పెన్స్ ఎలిమెంట్స్ ని బాగా చూపించాడు.

మైనస్ పాయింట్స్ :

ఫస్ట్ హాఫ్ లో స్క్రీన్ ప్లే అంత బాలేదు. అలాగే ఫస్ట్ హాఫ్ లో అర్థం పర్ధం లేని ఎన్నో సీక్వెన్స్ లు వచ్చి ‘అసలేం జరుగుతోంది’? అనేలా చిరాకు పెడతాయి. హన్సికకి డబ్బింగ్ చెప్పినచిన అమ్మాయి వాయిస్ అస్సలు సెట్ అవ్వలేదు. ఈ సినిమాలో తెలుగు ప్రేక్షకులకు తెలిసిన వారు పెద్దగా ఎవ్వరూ లేరు. తమిళ వారికి నచ్చేలా ఉండే కామెడీ ఎపిసోడ్స్ ఇక్కడి వారిని అంతగా నవ్వించలేదు. కామెడీ కోసం ఇక్కడి కమెడియన్స్ వాయిస్ ఉపయోగించి ఉండాల్సింది. సెకండాఫ్ లో కొన్ని మంచి సస్పెన్స్ ఎలిమెంట్స్ వచ్చాక క్లైమాక్స్ మళ్ళీ రొటీన్ గా తయారయ్యింది. మాములుగా ఎంటర్టైన్మెంట్ కోరుకునే బి, సి సెంటర్ ప్రేక్షకులకు ఈ సినిమా పెద్దగా నచ్చదు.

సాంకేతిక విభాగం :

శక్తి సరవనన్ సినిమాటోగ్రఫీ ఓకే అనేలా ఉంది. యువన్ శంకర్ రాజ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది, కానీ పాటలే ఏ మాత్రం ఆకట్టుకోలేదు. ఎడిటింగ్ ఓకే. డైలాగ్స్ చాలా సింపుల్ గా ఉన్నాయి. వెంకట్ ప్రభు డైరెక్షన్ కొన్ని చోట్ల బాగుందనిపిస్తుంది, ఓవరాల్ గా అయితే అతని బెస్ట్ కాదనిపిస్తుంది. స్టూడియో గ్రీన్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

బిర్యానికి కావాల్సిన అన్ని పదార్థాలను దగ్గర పెట్టుకొని కాస్త శ్రద్దగా వండితే మంచి రుచికరమైన బిరియాని తయారవుతుంది. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే ‘బిరియాని’ సినిమా విషయంలో అన్నీ కుదరలేదు. నటీనటుల పెర్ఫార్మన్స్ బాగున్నప్పటికీ స్క్రీన్ ప్లే, డైరెక్షన్ బాగా వీక్ అవ్వడంతో ‘బిరియాని’ సరిగా కుదరలేదు. మన హైదరాబాద్ బావర్చి బిరియానిలానే బిరియాని సినిమా కూడా ఉంటుందనుకోని వెళ్తే మీకు నిరాశే కలుగుతుంది. ఓవరాల్ గా చెప్పాలంటే ‘బిరియాని’ మూవీ బిరియానిలా కాకుండా జస్ట్ ఫ్రైడ్ రైస్ లా ఉంది.

123తెలుగు.కామ్ రేటింగ్ :2.75/5

మహేష్ ఎస్ కోనేరు
అనువాదం : రాఘవ

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు