సమీక్ష : “రౌడీ బాయ్స్” – కొన్ని చోట్ల ఆకట్టుకునే కాలేజీ డ్రామా !

సమీక్ష : “రౌడీ బాయ్స్” – కొన్ని చోట్ల ఆకట్టుకునే కాలేజీ డ్రామా !

Published on Jan 15, 2022 3:04 AM IST
Rowdy Boys Review In Telugu

విడుదల తేదీ : జనవరి 14, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: ఆశిష్, అనుపమ పరమేశ్వరన్, సహిదేవ్ విక్రమ్, కార్తీక్ రత్నం, తేజ్ కూరపాటి, కోమలీ ప్రసాద్.

దర్శకత్వం : హర్ష కొనుగంటి

నిర్మాత: దిల్ రాజు, శిరీష్

సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్

సినిమాటోగ్రఫీ: మదీ

ఎడిటర్ : మధు

హీరోగా పరిచయం అవుతూ శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో వచ్చిన చిత్రం “రౌడీ బాయ్స్”. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని దిల్‌ రాజు నిర్మించారు. మరి ఈ రోజు విడుదల అయిన ఈ చిత్రం ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టకుందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

 

అక్షయ్ (ఆశిష్) ఇంజినీరింగ్ స్టూడెంట్, కావ్య (అనుపమ పరమేశ్వరన్) మెడికల్ కాలేజీ స్టూడెంట్. అయితే, ఇంజినీరింగ్ – మెడికల్ కాలేజీ విద్యార్థుల మధ్య గ్యాంగ్ వార్ నడుస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్షయ్, కావ్యను చూసి ప్రేమలో పడతాడు. ఆమెను ప్రేమలో పడేయడానికి అక్షయ్ రిస్క్ చేసి మరీ మెడికల్ స్టూడెంట్స్ తో గొడవలకు దిగుతాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం కావ్య, అక్షయ్ తో లివింగ్ రిలేషన్ తో ఉండటానికి అంగీకరిస్తోంది. ఆ తర్వాత వీరి ప్రేమకథ ఎలా సాగింది ? అక్షయ్, కావ్యకి దూరం అవ్వడానికి గల కారణం ఏమిటి ? ఊహించని పరిస్థితుల మధ్య అక్షయ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు ? చివరకు అక్షయ్ – కావ్య ఒకరి కోసం ఒకరు ఏమి చేశారనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే..హీరో ఆశిష్ తనకు మొదటి సినిమా అయినా చాలా బాగా నటించాడు. ఆశిష్ పెర్ఫార్మెన్స్ అండ్ డ్యాన్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తాయి. అలాగే ఆశిష్ డైలాగ్ మాడ్యులేషన్, కామెడీ టైమింగ్ కూడా చాలా బాగున్నాయి. ఇక అనుపమ పరమేశ్వరన్ తన పాత్రకు ప్రాణం పోసింది. ఎమోషనల్ సన్నివేశాల్లో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో తన పాత్రకి పూర్తి న్యాయం చేసింది. మెయిన్ గా సెకెండ్ హాఫ్ లో సాగే సన్నివేశాలు అలాగే క్లైమాక్స్ లో అనుపమ నటన చాలా బాగుంది.

అలాగే ఆశిష్ – అనుపమ మధ్య కెమిస్ట్రీ కూడా బాగా అలరిస్తుంది. కీలక పాత్రలో నటించిన సహిదేవ్ విక్రమ్ తన నటనతో ఆకట్టుకోగా.. ఇక ఎప్పటిలాగే తన శైలి పాత్రలో కనిపించిన కార్తీక్ రత్నం కూడా బాగా నటించాడు. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. శ్రీహర్ష కొనుగంటి రాసిన కథ మరియు పాత్రలు కాలేజీ లైఫ్ ను, స్టూడెంట్స్ జీవితాల్లోని సంఘటనలను బాగా ఎలివేట్ చేశాయి.

 

మైనస్ పాయింట్స్ :

 

కాలేజీ నేపథ్యం, ప్రధాన పాత్రలు అలాగే సినిమాలోని కొన్ని ఎమోషన్స్ బాగా ఎలివేట్ చేసినా.. సినిమాలో కొన్ని సన్నివేశాలు బాగా స్లోగా సాగుతూ బోర్ కొడతాయి. దీనికి తోడు రెగ్యులర్ సీన్స్ కూడా ఎక్కువ అయిపోయాయి. అలాగే హీరో, హీరోయిన్ని వదిలేసే సీక్వెన్స్ కూడా బలంగా లేదు. ఇక హీరో హీరోయిన్ల మధ్య కొన్ని లవ్ సీన్స్ ల్యాగ్ అనిపిస్తాయి. మొత్తంగా రెగ్యులర్ ప్లే, స్లో నరేషన్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి.

అదే విధంగా సెకండ్ హాఫ్ లో వచ్చే హీరో మ్యూజికల్ జర్నీకి సంబంధించిన సన్నివేశాలు కూడా పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు. వీటికి తోడు హీరో హీరోయిన్ల క్యారెక్టైజేషన్స్ కూడా అనవసరమైన ఎమోషన్ కి లోబడి.. మరి నాటకీయకంగా సాగుతున్న భావన కలుగుతుంది. ముందు నుంచి ట్రెండీగా సీన్స్ రాసుకున్న దర్శకుడు.. లవ్ స్టోరీలో మాత్రం రెగ్యులర్ మెలో డ్రామా వైపే మొగ్గు చూపడం సినిమాకి అతి పెద్ద మైనస్.

 

సాంకేతిక విభాగం :

 

దర్శకుడు శ్రీహర్ష కాలేజీ లైఫ్ కి సంబంధించి మంచి పాయింట్ తీసుకున్నాడు. అయితే సినిమాలో ఎక్కువ సీక్వెన్స్ స్లోగా నడిపాడు. ఇక సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. కాలేజీ నేపథ్యంకు అనుగుణంగా విజువల్స్ ను చాలా అందంగా చూపించారు. సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ అందించిన పాటలు ఆకట్టుకున్నాయి. నేపధ్య సంగీతం కూడా బాగుంది. మధు ఎడిటింగ్ విషయానికి వస్తే.. ల్యాగ్ సీన్స్ లెంగ్త్ తగ్గించి ఉంటే బాగుండేది. సినిమాలోని నిర్మాతలు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి.

 

తీర్పు:

 

‘రౌడీ బాయ్స్’ అంటూ వచ్చిన ఈ కాలేజీ ట్రెండీ ఎమోషనల్ డ్రామాలో కాలేజీ నేపథ్య సన్నివేశాలు, అలాగే స్టూడెంట్ లైఫ్ లో చేసే పొరపాట్లు తాలూకు పర్యవసానాలను బాగా ఎస్టాబ్లిష్ చేశారు. ఆశిష్ – అనుపమ కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. వారిద్దరీ కెమిస్ట్రీ బాగుంది. అయితే స్క్రీన్ ప్లే లో స్లో నెరేషన్, రెగ్యులర్ ప్లే, కొన్ని బోరింగ్ సన్నివేశాలు.. పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా లేకపోవడం సినిమాకి మైనస్ అయ్యాయి. కాకపొతే యూత్ కి ఈ సినిమా కనెక్ట్ అవ్వొచ్చు.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు