లాక్ డౌన్ రివ్యూ: ‘రన్’ తెలుగు మూవీ (ఆహా)

లాక్ డౌన్ రివ్యూ: ‘రన్’ తెలుగు మూవీ (ఆహా)

Published on May 29, 2020 4:44 PM IST

 

నటీనటులు : నవదీప్, పుజితా పొన్నాడ, వెంకట్, అమిత్ తివారీ, ముక్తర్ ఖాన్, కౌసల్య, మనాలి రాథోడ్, షఫీ, మధు నందన్, భాను శ్రీ, కిరీతి దామరాజు మరియు ఇతరులు

దర్శకుడు : లక్ష్మీకాంత్ చెన్నా

ఛాయాగ్రాహకుడు : సజీష్ రాజేంద్రన్

సంగీతం : నరేష్ కుమారన్

ప్రొడక్షన్ హౌస్ : ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్

 

లాక్ డౌన్ రివ్యూ సిరీస్ లో మన నెక్స్ట్ మూవీ ఆహా ఒరిజినల్ తెలుగులో విడుదలైన రన్. దర్శకుడు లక్ష్మీ కాంత్ చెన్నా తెరకెక్కించిన ఈ సస్పెన్సు థ్రిల్లర్ ఎలా ఉందో సమీక్షలో చుద్దాం..

 

కథాంశం ఏమిటీ?

ఏడాది క్రితం పెళ్లి చేసుకున్న సందీప్ (నవదీప్), శృతి(పూజిత పొన్నాడ) ఇద్దరు ఎంతో హ్యాపీగా జీవితాన్ని గడుపుతుంటారు. వెడ్డింగ్ యానివర్సరీ రోజు నవదీప్ కు షాక్ ఇస్తూ శృతి చనిపోయిందన్న వార్త తెలుస్తుంది. విషయం తెలుసుకుని అక్కడకు వచ్చిన పోలీసులు ఇంటరాగేషన్ మొదలుపెడతారు. ఆమెది సూసైడ్ కాదు మర్డర్ అని తెలుసుకుంటారు. శృతి భర్త సందీప్ కావాలని ఆమెను చంపాడని అనుమానిస్తారు. పోలీసుల నుండి తప్పించుకున్న సందీప్ తన భార్యను హత్య చేసిన వారి గురించి వెతకడం మొదలుపెడతాడు. ఇంతకీ శ్రుతిని చంపింది ఎవరు..? సందీప్, శృతి లైఫ్ లో వచ్చిన ఆ మూడో వ్యక్తి కథ ఏమిటీ? శృతిని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? అనే విషయాల సమాహారమే రన్ మూవీ…

 

ఏమి బాగున్నది?
ఈ మూవీకి తన నటనతో ప్రధాన ఆకర్షణగా నిలిచాడు హీరో నవదీప్, చేయని నేరంలో ఇరుకున్న భర్తగా, భిన్న షేడ్స్ కలిగిన పాత్రలో ఆయన ఆకట్టుకున్నారు. ఈ మూవీ అంతా నవదీప్ వన్ మాన్ షో అన్నట్లు సాగింది. క్లైమాక్స్ లో కూడా నవదీప్ చక్కని నటనతో ఆకట్టుకున్నాడు.

నవదీప్ భార్య రోల్ చేసిన పూజిత క్యూట్ అండ్ గ్లామరస్ గా ఉంది. ఆమె పాత్రకు పెద్దగా పరిధి లేకున్నప్పటికీ ఉన్నంతలో ఆకట్టుకొనే నటనతో మెప్పించింది. ఇక ఓ కీలక రోల్ దక్కించుకున్న అమిత్ చక్కని నటన కనబరిచారు. సపోర్టింగ్ రోల్స్ చేసిన, భానుశ్రీ, షఫీ పరిధిమేర ఆకట్టుకున్నారు.

చాలా కాలం తరువాత స్క్రీన్ పై కనిపించిన నటుడు వెంకట్ పోలీస్ రోల్ లో సహజంగా నటించారు. ఆయన ఆ పాత్రకు చక్కగా సరిపోయారు. ఇక మూవీ ప్రారంభం, అక్కడక్కడా ఆకట్టుకొనే ట్విస్ట్స్ బాగున్నాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ముఖ్యంగా మూవీ బీజీఎమ్ అద్భుతం అని చెప్పాలి.

 

ఏమి బాగోలేదు?
సైకోలాజికల్ థ్రిల్లర్స్ ఎంచుకొనే టప్పుడు డైరెక్టర్ ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రన్ మూవీని దర్శకుడు అద్భుతమైన ఆరంభంతో పాటు ఆకట్టుకొనే ట్విస్ట్స్ తో తెరకెక్కించాడు. ఐతే ప్రధాన పాత్ర చేసిన నవీద్ నేపథ్యం ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేయాల్సింది. మూవీ క్లైమాక్స్ సైతం హడావుడిగా ముగించారు. ఈ వెబ్ మూవీ ట్రైలర్ చూసి నిజంగా సస్పెన్స్ తో ఆడియెన్స్ ను థ్రిల్ చేస్తుందని అనుకున్నారు. కానీ ఆశించిన స్థాయిలో లేదని చెప్పొచ్చు. సినిమాను నడిపించడానికి కొన్ని అవసరం లేని పాత్రలను కూడా తీసుకున్నాడు. అంత తక్కువ నిడివిలో సినిమా ఎందుకు ముగించారో అర్థం కానీ పరిస్థితి. సస్పెన్స్ థ్రిల్లర్ కి ఇచ్చిన ముగింపు కూడా కన్విన్సింగ్ గా లేదు.

 

చివిరి మాటగా
ఆసక్తికమైన పాయింట్ తో పాటు అద్భుతమైన ఆరంభం కలిగిన రన్ మూవీ చిన్నగా పట్టుకోల్పోతుంది. ఆకట్టుకోని కథనం, హడావుడిగా ముగించిన విధానం మరియు చివరి 20 నిమిషాల మూవీ ప్రేక్షుకుడికి నిరాశ కలిగిస్తాయి. హీరో నవదీప్ నటన, అక్కడక్కగా వచ్చే ట్విస్ట్స్ కొంచెం ఉపశమనం కలిగించే అంశాలు. లాక్ డౌన్ సమయంలో ఓ సారి చూద్దాం అనుకుంటే చూడండి.

Rating: 2.5/5

సంబంధిత సమాచారం

తాజా వార్తలు