సమీక్ష : “శ్రీరంగ నీతులు” – జస్ట్ కొన్ని సీన్స్ కోసం మాత్రమే !

సమీక్ష : “శ్రీరంగ నీతులు” – జస్ట్ కొన్ని సీన్స్ కోసం మాత్రమే !

Published on Apr 12, 2024 3:01 AM IST
Sri Ranga Neethulu Movie Review in Telugu

విడుదల తేదీ : ఏప్రిల్ 11, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: సుహాస్‌, కార్తీక్‌ర‌త్నం, రుహానిశ‌ర్మ‌, విరాజ్ అశ్విన్‌, కిరణ్‌, రాగ్‌ మయూర్‌, దేవి ప్రసాద్ తదితరులు

దర్శకుడు: ప్ర‌వీణ్‌ కుమార్ వీఎస్ఎస్

నిర్మాత: వెంకటేశ్వరరావు బల్మూరి

సంగీత దర్శకుడు: హర్షవర్థన్‌ రామేశ్వర్‌, అజయ్‌ అరసాడ

సినిమాటోగ్రఫీ: టీజో టామీ

ఎడిటింగ్: సశాంక్ వుప్పుటూరి

సంబంధిత లింక్స్: ట్రైలర్

దర్శకుడు ప్ర‌వీణ్‌ కుమార్ వీఎస్ఎస్ తెరకెక్కించిన సినిమా ‘శ్రీరంగ నీతులు’. కాగా ఈ సినిమా మీడియాకి ప్రీమియర్ షోలు వేశారు. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

ఈ కథ మూడు పాత్రల చుట్టూ సాగుతుంది. బస్తీకి చెందిన శివ(సుహాస్‌) ఓ టీవీ కంపెనీలో జాబ్‌ చేస్తుంటాడు. ఐతే, స్కూల్ గ్రౌండ్ లో అతను తన ఫోటోతో పెద్ద ఫ్లెక్సీ పెడతాడు. దాన్ని ఎవరో తీసేస్తారు. మళ్లీ కొత్త ఫ్లెక్సీ వేయించాలనే పట్టుదలతో ఉంటాడు ?, దాని కోసం అతను ఏం చేశాడు ? అనేది ఓ కథ.

మరో పాత్ర విషయానికి వస్తే.. వరుణ్‌ (విరాజ్‌ అశ్విన్‌), ఐశ్వర్య(రుహానీ శర్మ) ప్రేమించుకుంటారు. తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పలేక వరుణ్‌ కు కోపం తెప్పిస్తుంది ఐశ్వర్య. చివరకు, వీళ్లు కలిశారా? లేదా? అనేది రెండో కథ.

మూడో పాత్ర విషయానికి వస్తే.. ఉన్నత చదువులు చదివిన కార్తిక్‌(కార్తీక్‌ రత్నం) డ్రగ్స్‌కి అలవాటు పడి జులాయిగా తిరుగుతుంటాడు. అతన్ని మార్చడానికి అతని తండ్రి (దేవి ప్రసాద్) ఎలాంటి ప్రయత్నం చేశాడు ? అనేది మూడో కథ. ఈ మూడు కథలు చివరకు ఎలా ముగిశాయి ? అనేది మిగిలిన సినిమా.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకి ప్రధానంగా ప్లస్ పాయింట్.. ఈ సినిమాలోని ఉప కథలే. దర్శకుడు ప్ర‌వీణ్‌కుమార్ వీఎస్ఎస్ రాసుకున్న సున్నితమైన కథలు ఈ సినిమాకు ప్రధాన బలం. ముఖ్యంగా ఆయన భావోద్వేగమైన పాత్రలతో సున్నితమైన మెసేజ్ ను పండించిన విధానం బాగుంది. అలాగే, ప్రధానంగా సాగే మూడు పాత్రలు కొన్ని చోట్ల బాగానే ఆకట్టుకున్నాయి. వీటితో పాటు ప్ర‌వీణ్‌ కుమార్ టేకింగ్ సినిమాకు కావాల్సినంత సహజత్వాన్ని అందించింది.

దాంతో పాటు కథలోని ప్రతి పాత్ర చాలా సహజంగా ఉంటుంది. ఇక కీలక పాత్రల్లో సుహాస్‌, కార్తీక్‌ర‌త్నం, రుహానిశ‌ర్మ‌, విరాజ్ అశ్విన్‌ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. సుహాస్‌ పాత్రలోని అమాయత్వం, కార్తీక్‌ ర‌త్నం పాత్రలోని సైకోజం, రుహానిశ‌ర్మ‌ భయం, విరాజ్ అశ్విన్‌ ఆవేదన.. మొత్తానికి సినిమాలో పెద్దగా బలమైన సీన్స్ లేకపోయినా పాత్రలన్నీ సమస్యలతో సాగడం వల్ల సినిమాకి ప్లస్ అయ్యింది. ఇక మిగిలిన ప్రధాన పాత్రల్లో నటించిన రాగ్‌ మయూర్‌, దేవి ప్రసాద్ లు కూడా చాలా బాగా నటించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

మైనస్ పాయింట్స్ :

ఈ ‘శ్రీరంగ నీతులు’ సినిమాలో మెయిన్ పాయింట్ బాగున్నా.. కథ చాలా వీక్ గా ఉంది. దీనికి తోడు స్క్రీన్ ప్లే పరంగా కూడా సినిమా ఏమాత్రం ఆకట్టుకునే విధంగా సాగలేదు. ముఖ్యంగా కథకు అవసరం లేని సీన్స్ ఎక్కువైపోయాయి. పైగా ఆ సీన్స్ కూడా లాజిక్ లేకుండా సాగడం.. అలాగే కామెడీ కోసమని అనవసరమైన సీన్స్ ను ఇరికించడం కూడా సినిమాకి మైనస్ అయ్యింది.

దీనికితోడు, దర్శకుడు ప్ర‌వీణ్‌ కుమార్ తాను అనుకున్న కంటెంట్ ను కూడా స్క్రీన్ మీద బాగా ఎలివేట్ చేయలేకపోయారు. సినిమాను ఇంట్రెస్టింగ్ ఎలెమెంట్స్ తో ఆసక్తికరంగా మలచలేకపోయాడు. నిజానికి కంటెంట్ పరంగా మంచి ఎంటర్ టైన్మెంట్ మరియు ఇంట్రెస్టింగ్ సన్నివేశాలు రాసుకునే అవకాశం ఉన్నా, ప్ర‌వీణ్‌ కుమార్ మాత్రం సినిమాని ఆ దిశగా నడిపలేకపోయారు.

పైగా బోరింగ్ ట్రీట్మెంట్ తో పాటు ఆసక్తి కలగించలేని కొన్ని కీలక సన్నివేశాల కారణంగా.. ప్లే లో సరైన ప్లో కూడా లేకుండా పోయింది. పైగా చాలామంది నటులు ఉన్నప్పటికీ, సినిమాలో బలమైన సీన్స్ కూడా పడలేదు. సెకండ్ హాఫ్ ప్లే లో చాలా టర్నింగ్ పాయింట్లు ఉన్నాయి గానీ, అవి కూడా ఆసక్తిగా అనిపించవు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. దర్శకుడిగా ఓకే అనిపించుకున్నా.. రచయితగా ప్ర‌వీణ్‌ కుమార్ ఫెయిల్ అయ్యారు. కెమెరామెన్ గా చేసిన టీజో టామీ సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. సంగీత దర్శకులు హర్షవర్థన్‌ రామేశ్వర్‌, అజయ్‌ అరసాడ అందించిన సంగీతం పర్వాలేదు. ఎడిటర్ వర్క్ సినిమాకి తగ్గట్లు ఉంది. సినిమాలోని నిర్మాత వెంకటేశ్వరరావు బల్మూరి పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. .

తీర్పు :

మొత్తమ్మీద, ఈ ‘శ్రీరంగ నీతులు’ సినిమా కొన్ని చోట్ల ఓకే అనిపించినా.. బోరింగ్ అండ్ సిల్లీ అంశాలతో నడుస్తోంది. కథాకథనాలు ఆసక్తి కరంగా సాగకపోవడం, సినిమాలో సరైన ప్లో మిస్ అవ్వడం, ఓవరాల్ గా సినిమా స్లోగా సాగుతూ బోర్ కొట్టించడం.. వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. అయితే, కొన్ని కీలక సన్నివేశాలు పర్వాలేదు. ఓవరాల్ గా ఈ సినిమా మాత్రం నిరాశ పరిచింది.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు