‘డేవిడ్‌ రెడ్డి’లో మరో యంగ్ హీరో ?

‘డేవిడ్‌ రెడ్డి’లో మరో యంగ్ హీరో ?

Published on Feb 24, 2026 12:30 AM IST

David-Reddy-1

రాకింగ్ స్టార్ మంచు మనోజ్‌ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడికల్‌ యాక్షన్‌ మూవీ ‘డేవిడ్‌ రెడ్డి’(David Reddy). హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ కోసం ఓ బ్రిటిష్ పోలీస్ స్టేషన్ సెట్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సెట్ లో మనోజ్ పై ఎంట్రీ సాంగ్ ను షూట్ చేస్తారట. ఈ సాంగ్ లో మనోజ్ తో పాటు మరో యంగ్ హీరో కూడా కనిపిస్తాడని తెలుస్తోంది. మరి ఆ యంగ్ హీరో ఎవరు అనేది చూడాలి.

ఇక ‘డేవిడ్‌ రెడ్డి’ కథ విషయానికొస్తే.. స్వాతంత్రానికి పూర్వం జరిగిన కథ ఇది. బ్రిటిష్‌ వారిపై పోరాడిన ‘డేవిడ్‌ రెడ్డి’ అనే యోధుడి కథగా రానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ‘వార్‌ డాగ్‌’ అనే బైక్‌ను రూపొందించారు. దాని బరువు దాదాపు 700 కేజీలు. సినిమాలో అది ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అన్నట్టు ఈ సినిమాలో మనోజ్‌ సరసన ‘ప్రిన్స్‌’ (కోలీవుడ్‌ మూవీ) హీరోయిన్‌ మరియా నటించబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు