జనవరి 5న రిలీజ్ కానున్న ‘రాఘవ రెడ్డి’ ప్రేక్షకులను మెప్పిస్తుంది – ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో శివ కంఠమనేని

జనవరి 5న రిలీజ్ కానున్న ‘రాఘవ రెడ్డి’ ప్రేక్షకులను మెప్పిస్తుంది – ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో శివ కంఠమనేని

Published on Jan 3, 2024 10:17 AM IST


టాలెంటెడ్ యాక్టర్ శివ కంఠమనేని హీరోగా రాశి, నందితా శ్వేత ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న తాజా చిత్రం రాఘవ రెడ్డి. స్పేస్ విజన్ నరసింహా రెడ్డి సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యూజిక్ బ్యానర్‌పై సంజీవ్ మేగోటి దర్శకత్వంలో కేఎస్ శంకర్ రావ్, జి.రాంబాబు యాదవ్, ఆర్ .వెంకటేశ్వర్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి జనవరి 5న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా సీనియర్ నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ శివ కంఠమనేని సినిమా సినిమాకు పరిధిని పెంచుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు చక్కటి కమర్షియల్ మూవీని చేశారు. రాఘవరెడ్డి సినిమా సాంగ్స్ బావున్నాయి. డైరెక్టర్ సినిమాను చక్కగా తెరకెక్కించారు. శ్రీహరి ఎలా మంచి స్టార్‌గా ఎదిగారో శివ కంఠమనేని అలాగే ఎదగాలని కోరుకుంటున్నాను. జనవరి 5న రిలీజ్ అవుతోన్న ఈ మూవీకి థియేటర్స్ దొరికాయి.

ఈ సినిమాను కమర్షియల్‌గా పెద్ద సక్సెస్ చేయాలని ప్రేక్షకులను కోరుకుంటున్నాను అన్నారు. తుమ్మల ప్రసన్నకుమార్ మాట్లాడుతూ శివ కంఠమనేని చక్కటి ప్లానింగ్‌తో ముందు నుంచి సినిమాలను చేసుకుంటూ వస్తున్నారు. డైరెక్టర్ సంజీవ్ మేగోటి మంచి కథతో కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రాఘవ రెడ్డి చిత్రాన్ని రూపొందించారు. యాక్షన్, ఫ్యాక్షన్, లవ్ స్టోరి, ఎమోషన్స్, ఫ్యామిలీ స్టోరి ఇలా అన్ని ఎలిమెంట్స్‌ను చక్కగా మిక్స్ చేసి ప్రేక్షకులకు ఏది కావాలో ఆ ఎలిమెంట్స్ అన్నీ ఉండేలా ప్లాన్ చేశారు. నిర్మాత ఆర్. వెంకటేశ్వర్ రావు విషయానికి వస్తే 33 ఏళ్లుగా ఇండస్ట్రీలో అందరికీ చేదోడు వాదోడుగా ఉంటూ వస్తున్నారు. ఘంటా శ్రీనివాస్ గారు కూడా ప్రొడక్షన్ లో భాగం కావటం ఎంతో ప్లస్ అయ్యింది.

జనవరి 5 చాలా చక్కటి రిలీజ్ డేట్. సీనియర్ ఎన్టీఆర్‌గారు నటించిన గులేబకావళి కథ ఇదే తేదీలో రిలీజై సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు అదే తేదీన రిలీజ్ అవుతోన్న రాఘవ రెడ్డి పెద్ద విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు. చిత్ర నిర్మాత ఆర్. వెంకటేశ్వర్ రావు మాట్లాడుతూ మా బ్యానర్‌లో వస్తోన్న మూడో సినిమా ఇది. ఘంటా శ్రీనివాస్‌ గారి ఆధ్వర్యలో ఈ మూడు సినిమాలను నిర్మించాం. ఇండస్ట్రీ నుంచి వ్యాపార రంగంలోకి వెళ్లాం. అక్కడ ఉంటూ మళ్లీ ఇక్కడ సినిమాలు చేస్తూ వచ్చాం. ఇక్కడ కళ్యాణ్‌గారు, ప్రసన్నగారు సపోర్ట్‌గా నిలుస్తూ వచ్చారు. రాఘవ రెడ్డి జనవరి 5న రిలీజ్ అవుతోంది. దీన్ని పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు. దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ రాఘవరెడ్డి సినిమా రూపంలో ఈ ఏడాది నాకొక మంచి దిశ, దశ ఉంటుందని భావిస్తున్నాను. సినిమాలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. మాస్ హీరో సినిమాలో ఎలాంటి అంశాలుంటాయో అవన్నీ ఈ సినిమాలో ఉంటాయి. శివగారు ముప్పై నలబై సినిమాల అనుభవమున్న నటుడిగా పరిణితితో నటించారు. నిర్మాతలు సినిమా ప్రొడక్షన్ లో సపోర్ట్ అందించారు. ఇక రాశి, నందితా శ్వేత, అజయ్, అజయ్ ఘోష్, అన్నపూర్ణమ్మ, రఘుబాబు వంటి పెద్ద స్టార్స్ అందరూ నటించారు.

తెర వెనుక మా డైరెక్షన్ టీమ్ ఎంతో కష్టపడింది. మా సినిమాటోగ్రాఫర్ హరీష్, మ్యూజిక్ డైరెక్టర్ సుధాకర్ మారియో చక్కటి సపోర్ట్ చేశారు. తొమ్మిదేళ్ల తర్వాత నా దర్శకత్వంలో వస్తోన్న సినిమా ఇది. క్రిమినాలజీ ప్రొఫెసర్ గా శివ కంఠమనేని అద్భుతంగా నటించారు. జనవరి 5న రిలీజ్ అవుతోన్న రాఘవ రెడ్డి చిత్రం అందరి ఆడియెన్స్‌ని మెప్పించి వారి మనసులో గుర్తుండిపోతుందన్నారు. హీరో శివ కంఠమనేని మాట్లాడుతూ మా టీమ్‌ని ఆదరించటానికి వచ్చిన కళ్యాణ్‌గారు, అశోక్ కుమార్ ‌గారు, ప్రసన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక నాకు వెన్నంటి ఉండి నడిపించిన మా వెంకటేశ్వర్ రావు, రాంబాబు యాదవ్, శంకర్ రావు, ఘంటా శ్రీనివాసరావు గారికి థాంక్స్. ఇది మేం చేసిన మూడో సినిమా. మధురపూడి గ్రామం అనే నేను సినిమా రాజస్థాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి ఎంపికైంది. అది మాకెంతో ఉత్సాహాన్నిచ్చింది. జనవరి 5న రిలీజ్ అవుతున్న మా రాఘవ రెడ్డి సినిమా అన్నీ వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుంది అన్నారు. ఇంకా ఈ మూవీకి డైలాగ్స్ ని అంజన్, లిరిక్స్ ని సాగర్ నారాయణ, పి.ఆర్.ఒ గా సురేంద్ర నాయుడు, ఫణి (బియాండ్ మీడియా), మ్యూజిక్ ని సంజీవ్ మేగోటి, సుధాకర్ మారియో, ఫైట్స్ ని సింధూరం సతీష్, డాన్స్ ని భాను, సన్ రే మాస్టర్ (సూర్య కిరణ్), ఎడిటింగ్ ని ఆవుల వెంకటేష్ అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు