బాక్స్ ఆఫీసు రిపోర్ట్

ఫొటొ : బేతాళుడు
Back | Next
 
బేతాళుడు : 'బిచ్చగాడు' అన్న ఒకే ఒక్క సినిమాతో తెలుగులో ఓవర్‌నైట్ స్టార్‌డమ్ సంపాదించిన విజయ్ ఆంటోనీ నటించిన తాజా చిత్రం 'బేతాళుడు' (తమిళంలో సైతాన్). తమిళంలో ఎక్కడిలేని క్రేజ్ ఉన్న ఈ సినిమాకు తెలుగులోనూ అదేస్థాయిలో క్రేజ్ కనిపించింది. ఆ క్రేజ్ దృష్ట్యానే తెలుగులో ఈ సినిమా డిసెంబర్ 1న సుమారు 500 థియేటర్లలో విడుదలైంది.

 
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 2వ స్థానంలో ఉంది.
.
ప్లస్ పాయింట్స్ లో ముందుగా చెప్పుకోవలసింది సినిమా ఫస్టాఫ్ గురించి. సినిమా మొదలవడమే చాలా ఆసక్తికరంగా మొదలైంది. ఆరంభం నుండే విజయ్ ఆంటోనీ మానసిక సమస్యను ఎలివేట్ చేస్తూ రాసిన సన్నివేశాలు, వాటిని తెరపై చాలా సున్నితంగా చూపించిన తీరు బాగున్నాయి. కొన్ని సన్నివేశాల్లో అయితే హర్రర్ సినిమా చూస్తున్నామా అనే భావన కలిగింది. ఇక ఆ సన్నివేశాల్లో విజయ్ ఆంటోనీ నటన సన్నివేశాలను మరింత ప్రభావితంగా చేసింది.

 
సినిమాలోని మైనస్ పాయింట్స్ లో ముందుగా చెప్పుకోవలసింది సెకండాఫ్ గురించి. సెకండాఫ్ లో నడిచే ఆంటోనీ గత జన్మ కథ బాగానే ఉన్నా అది ప్రస్తుతానికి వచ్చి పూర్తిగా వేరే ట్రాక్ తీసుకోవడం అంతగా నచ్చలేదు. పూర్తిగా ఒక మోడ్ లో ఉన్న ప్రేక్షకుడిని ఏమాత్రం ప్రిపరేషన్ లేకుండా ఉన్నట్టుండి వేరే మోడ్ లోకి తీసుకెళ్లిన ఈ విధానం నిరుత్సాహపరిచింది. దాంతో అప్పటిదాకా సినిమా క్లైమాక్స్ పై పెట్టుకున్న తారా స్థాయి అంచనాలు ఒక్కసారిగా నీరుగారాయి.
 
బాక్స్ ఆఫీసు వద్ద :

 
ఎ సెంటర్స్ : ప్రారంభం బాగానే ఉంది
 
బి సెంటర్స్ : ప్రారంభం బాగానే ఉంది
 
సి సెంటర్స్ : ప్రారంభం బాగానే ఉంది
 
తీర్పు : ప్రారంభం బాగానే ఉంది
 
Bookmark and Share