బాక్స్ ఆఫీసు రిపోర్ట్

ఫొటొ : ఎక్కడికి పోతావు చిన్నవాడా
Back | Start
 
ఎక్కడికి పోతావు చిన్నవాడా : హ్యాట్రిక్ హిట్స్‌తో వచ్చిన జోరును 'శంకరాభరణం'తో అందుకోలేకపోయిన నిఖిల్, తాజాగా చాలా జాగ్రత్తలు తీసుకొని, తనకు బాగా కలిసివచ్చిన ప్రయోగాన్నే నమ్ముకొని 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' అంటూ నవంబర్ 18న ప్రేక్షకుల ముందుకు వచ్చేశారు. మొదట్నుంచీ విపరీతమైన ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా, అంతా అనుకున్నట్టుగానే సరికొత్త కాన్సెప్ట్‌తో, అదిరిపోయే కామెడీతో ప్రేక్షకులను కట్టిపడేసింది.

 
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 1వ స్థానంలో ఉంది.
.
ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే దర్శకుడు విఐ ఆనంద్ రొమాంటిక్ థ్రిల్లర్ ఆద్యంతం ఎంటర్టైన్మెంట్ ను జోడించి కథను చెప్పిన విధానం బాగుంది. ముఖ్యంగా సెకండాఫ్ లో కథనాన్ని నడిపిన తీరు ఆకట్టుకుంది. ఆద్యంతం కథలో ఎదో ఒక థ్రిల్ వస్తూ సినిమాపై ఆసక్తి పెరిగేలా చేసింది. ఫస్టాఫ్, సెకండాఫ్ లలో నడిచే కొత్తదనమున్న కామెడీ ఆకట్టుకుంది. వెన్నెల కిశోర్, సత్యలు టైమింగ్ ఉన్న పంచ్ లతో మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు.

 
మైనస్ పాయింట్స్ లో ముందుగా చెప్పుకోవలసింది ఫస్టాఫ్ ఓపెనింగ్, ఇంటర్వెల్ మధ్యలో ఉన్న రన్ టైమ్ గురించి. ఆ రన్ టైమ్ లో నడిచే సినిమా చాలా వరకూ బోరింగానే సాగింది. అక్కడక్కడా వచ్చే వెన్నెల కిశోర్ కామెడీని మినహాయిస్తే ఇంటర్వెల్ పడే వరకూ ఎక్కడా రిలీజ్ దొరకలేదు. దర్శకుడు ఆ పార్ట్ ని ఇంకాస్త గ్రిప్పింగా రాసుకుని ఉండాల్సింది. అలాగే సెకండాఫ్ కథనంలో కూడా కాస్త బలం లోపించింది. ముఖ్యంగా క్లైమాక్స్ సీక్వెన్స్ రొటీన్ గానే ఉంది. సెకండాఫ్ నడుస్తున్న కొద్దీ ఆహా.. క్లైమాక్స్ అద్దిరిపోయేలా ఉంటుంది అనుకుంటే అది అన్ని సినిమాల్లాగే పాతగానే సాగింది.
 
బాక్స్ ఆఫీసు వద్ద :

 
ఎ సెంటర్స్ : బాగా ఆడుతోంది.
 
బి సెంటర్స్ : ఫర్వాలేదు
 
సి సెంటర్స్ : ఫర్వాలేదు
 
తీర్పు : సూపర్ హిట్
 
Bookmark and Share