బాక్స్ ఆఫీసు రిపోర్ట్

ఫొటొ : గౌతమిపుత్ర శాతకర్ణి
Back | Next
 
గౌతమిపుత్ర శాతకర్ణి : నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'గౌతమిపుత్ర శాతకర్ణి' సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. బాలయ్య కెరీర్‌కు వందో సినిమా అయిన శాతకర్ణి, మొదటిరోజునుంచే బాక్సాఫీస్ వద్ద సూపర్ కలెక్షన్స్ సాధిస్తూ దూసుకెళుతోంది. తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తుల్లో ఒకరైన శాతకర్ణి జీవిత కథతో తెరకెక్కిన సినిమా కావడంతో ఈ సినిమాకు సినీ ప్రముఖుల నుంచి కూడా ప్రశంసల వర్షం కురుస్తోంది.

 
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 2వ స్థానంలో ఉంది.
.
సినిమాలోని ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే ముందుగా చెప్పుకోవలసింది దర్శకుడు క్రిష్ ఎంచుకున్న నైపథ్యం గురించి. తెలుగు జాతి పౌరుషాన్ని, గొప్పతనాన్ని చాటిన గౌతమిపుత్ర శాతకర్ణి జీవిత కథ ప్రేక్షకుడికి మొదట్లోనే ఎమోషనల్ గా బాగా కనెక్టవుతుంది. ఇక యువరత్న బాలకృష్ణ ఆ పాత్రను పోషించడంతో అది ప్రేక్షకులకు ఇంకా బాగా నచ్చుతుంది. మొదటి నుండి పౌరాణిక, చారిత్రక పాత్రలకు ప్రాణం పోసే బాలయ్య శాతకర్ణి పాత్రలోని రాజసం, పౌరుషం ప్రదర్శించడంలో నూటికి నూరు పాళ్ళు విజయం సాధించి ఆకట్టుకున్నాడు.

 
మైనస్ పాయింట్స్ విషయానికొస్తే చారిత్రిక నైపథ్యంతో తెరకెక్కిన సినిమా కాబట్టి అందులో బలమైన, ఉత్కంఠ భరితమైన కథనం ఉంటుందనే ఉత్సాహం సినిమా మొదలవడానికి ముందు, మొదలైన కాసేపటి వరకు ఉంది కానీ ఆ తరువాత ఎగిరిపోయింది. ఇలాంటి చారిత్రిక అంశాలతో తెరకెక్కిన సినిమా ద్వారా వినోదం పంచలేరు కాబట్టి ఉత్కంఠనైనా కలిగించాలి. కానీ ఇక్కడ అలా జరగలేదు. ముఖ్యంగా యుద్ధ సన్నివేశాల్లో ఆ ఫీలింగ్ చాలా వరకూ కనిపించలేదు.
 
బాక్స్ ఆఫీసు వద్ద :

 
ఎ సెంటర్స్ : ప్రారంభం బాగుంది
 
బి సెంటర్స్ : ప్రారంభం బాగుంది
 
సి సెంటర్స్ : ప్రారంభం బాగుంది
 
తీర్పు : ప్రారంభం బాగుంది
 
Bookmark and Share