బాక్స్ ఆఫీసు రిపోర్ట్

ఫొటొ : ఖైదీ నంబ‌ర్ 150
Back | Start
ఖైదీ నంబ‌ర్ 150 : మెగాస్టార్ చిరంజీవి తొమ్మిదేళ్ళ తర్వాత సినిమాలకు రీ ఎంట్రీ ఇస్తూ చేసిన సినిమాయే ఖైదీ నంబర్ 150. భారీ అంచనాల మధ్యన జనవరి 11న విడుదలైన ఈ సినిమా ఆ అంచనాలను అందుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. పలు చోట్ల రికార్డు కలెక్షన్స్ సాధించిన సినిమా లాంగ్‌రన్‌లో ఇంకా ఎక్కువ వసూళ్ళు రాబడుతుందని ట్రేడ్ అంచనా వేస్తోంది.

 
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 1వ స్థానంలో ఉంది.
.
ఈ సినిమాకు అతి పెద్ద ప్లస్ పాయింట్ అంటే అది మెగాస్టార్ చిరంజీవే. 9 ఏళ్ల తరువాత స్క్రీన్ మీద ఆయన్ను ఫుల్ లెంగ్త్ హీరోగా చూడటం అభిమానులకు పండగే అని చెప్పాలి. చిరంజీవి కూడా బాగా వర్కవుట్స్ చేసి యంగ్ గా కనువిందు చేశారు. ఎమోషనల్ సన్నివేశాల్లో ఆయన అసామాన్యమైన నటన, డైలాగులు, ఫైట్స్ బాగున్నాయి. ముఖ్యంగా ప్రతి పాటలోనూ చిరంజీవి వేసిన సూపర్ స్టెప్పులు ప్రేక్షకుల ఉత్సాహాన్ని తారా స్థాయికి తీసుకెళ్ళేలా ఉన్నాయి.

 
మైనస్ పాయింట్స్ విషయానికొస్తే ప్రధానంగా కనిపించేది బలం లేని ప్రతి నాయకుడి పాత్ర అనే చెప్పాలి. చిరంజీవి అంతటి స్టార్ హీరోకి ఇమేజ్ ని సినిమాలో మోయాలంటే అంతే బలమైన ప్రతి నాయకుడు అవసరం. ఆద్యంతం హీరోతో పోటీ పడుతూ హీరో పాత్ర బలంగా మారేలా చేయాలి. కానీ ఇందులో విలన్ పాత్ర అలా చేయలేదు. చిరంజీవి ముందు చాలా వరకు చిన్నబోయింది. దీంతో సినిమాని చాలా వరకు చిరంజీవి వైపు నుండే చూడాల్సి వచ్చింది. ఆ పాత్రలో నటించిన తరుణ్ అరోరా నటన కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. పైగా ఆయన చెప్పిన డబ్బింగ్ చూస్తే ఏదో హిందీ సినిమా చూసినట్టు తోచింది.
 
బాక్స్ ఆఫీసు వద్ద :

 
ఎ సెంటర్స్ : ప్రారంభం బాగుంది
 
బి సెంటర్స్ : ప్రారంభం బాగుంది
 
సి సెంటర్స్ : ప్రారంభం బాగుంది
 
తీర్పు : ప్రారంభం బాగుంది
 
Bookmark and Share