బాక్స్ ఆఫీసు రిపోర్ట్

ఫొటొ : నందిని నర్సింగ్ హోమ్
Back | Next
 
నందిని నర్సింగ్ హోమ్ : 'నందిని నర్సింగ్ హోమ్'.. ఆడియో విడుదల ముందు వరకూ ఎవ్వరికీ పెద్దగా పరిచయం కూడా లేని ఈ సినిమా, సూపర్ స్టార్ మహేష్ చేతుల మీదుగా ఆడియో ఆవిష్కరణ జరుపుకోవడంతో ఓ ప్రత్యేక క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత మెల్లిగా ట్రైలర్‌తో ఆసక్తి రేకెత్తించిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్ అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకొచ్చింది.


 
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 3వ స్థానంలో ఉంది.
.
ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే ఒక సస్పెన్స్ ఎలిమెంట్‌ను మొదట్నుంచీ, చివరివరకూ ఎంతో ఆసక్తిగా నడిపించిన విధానాన్ని చెప్పుకోవాలి. రెగ్యులర్ కమర్షియల్ కామెడీగా కనిపించే కథలో మొదటి సీన్‌తోనే ఒక సస్పెన్స్ ఎలిమెంట్‌ను మొదలుపెట్టడం, క్లైమాక్స్ వరకూ అది ఏమై ఉంటుందా అని ఆలోచించేలా చేయడం బాగా ఆకట్టుకుంది. ఇక ఆ సస్పెన్స్ ఎలిమెంట్ కూడా ఊహించే విధంగా ఉండకపోవడం మరో బలం. ఈ సస్పెన్స్ ఎలిమెంట్ రివీల్ అయ్యే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు కట్టిపడేసేలా ఉన్నాయి.

 
ఈ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ అంటే లెంగ్త్ కాస్త ఎక్కువవ్వడం అనే చెప్పుకోవాలి. కొన్ని అనవసరమైన సన్నివేశాలకు చోటిస్తూ పోవడం వల్ల అక్కడక్కడా సినిమా చాలా నెమ్మదిగా నడిచినట్లనిపించింది. ఇక కామెడీ పంచడంలో ఎక్కడా తగ్గకపోయినా, వెన్నెల కిషోర్, సప్తగిరి ట్రాక్ కాస్త ఎక్కువసేపు సాగినట్లనిపించింది. సెకండాఫ్‌లో అసందర్భంగా వచ్చే ఓ పాటను కూడా మైనస్‌గానే చెప్పుకోవాలి.
 
బాక్స్ ఆఫీసు వద్ద :

 
ఎ సెంటర్స్ : ప్రారంభం ఫర్వాలేదు
 
బి సెంటర్స్ : ప్రారంభం ఫర్వాలేదు
 
సి సెంటర్స్ : ప్రారంభం ఫర్వాలేదు
 
తీర్పు : ప్రారంభం ఫర్వాలేదు
 
Bookmark and Share