బాక్స్ ఆఫీసు రిపోర్ట్

ఫొటొ : ప్రేమమ్
Back | Start
 
ప్రేమమ్ : అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన 'ప్రేమమ్' భారీ అంచనాల మధ్యన అక్టోబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చేసిన విషయం తెలిసిందే. మళయాలంలో ఘన విజయం సాధించిన ప్రేమమ్‌కు రీమేక్ కావడంతో ఈ సినిమాపై మొదట్నుంచీ విపరీతమైన క్రేజ్ కనిపించింది. ఇక ఆ క్రేజ్‌కు ఏమాత్రం తగ్గకుండా, అంచనాలను అందుకున్న సినిమా మొదటి రోజునుంచే హిట్ టాక్‌తో దూసుకుపోతోంది.


 
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 2వ స్థానంలో ఉంది.
.
ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్ అంటే సూపర్ హిట్టైన ఒరిజినల్ మలయాళ వర్షెన్ కు అల్ఫోన్సే పుత్రేన్ అందించిన అందమైన ప్రేమ 'కథ'. ఈ కథ వలనే ఈ తెలుగు రీమేక్ పై మొదటి నుండి మంచి పాజిటివ్ అంచనాలున్నాయి. పైగా దర్శకుడు చందూ మొండేటి ఒరిజినల్ వెర్షన్ ను కాపీ కొట్టకుండా కాస్త కొత్తగా ట్రై చేయడం కూడా ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్. అలాగే హీరో అక్కినేని నాగ చైతన్య నటన సినిమాని మరో మెట్టు పైకి తీసుకెళ్లింది. నటనలో చైతూ పూర్తి స్థాయి పరిపూర్ణతను కనబరిచాడు. ఇంతకు ముందు చేసిన సినిమాలతో పోలిస్తే ఇందులోనే చాలా ఇష్టంగా నటించాడన్నది ఇట్టే స్పష్టమవుతోంది.

 
ఈ చిత్రంలోని మైనస్ పాయింట్స్ అంటే చాలా మందికి అసలు కథ, అందులోని పాత్రల నడవడిక పూర్తిగా తెలిసిపోవడం. దీంతో మామూలుగానే ఈ సినిమాకి ఒరిజినల్ వెర్షన్ కి వద్దనుకున్నా కాస్త కంపారిజన్ ఏర్పడి కథనంలో, పాత్రల పర్ఫామెన్స్ లో అక్కడక్కడా కాస్త నిరుత్సాహం కలిగింది . అలాగే లెక్చరర్ పాత్రలో శృతి హాసన్ అంత గొప్పగా కుదరకపోవడంతో ఆ లవ్ ట్రాక్ లో కాస్త బలం తగ్గి కాస్త బోర్ కొట్టింది. ఇక మొదటి భాగం ఇంటర్వెల్ ముందు కాసేపు సినిమాను సాగదీశారు.
 
బాక్స్ ఆఫీసు వద్ద :

 
ఎ సెంటర్స్ : బాగా ఆడుతోంది
 
బి సెంటర్స్ : బాగానే ఆడుతోంది
 
సి సెంటర్స్ : బాగానే ఆడుతోంది
 
తీర్పు : హిట్
 
Bookmark and Share