బాక్స్ ఆఫీసు రిపోర్ట్

ఫొటొ : మజ్ను
Back | Start
 
మజ్ను : నాని హీరోగా నటించిన 'మజ్ను', గత శుక్రవారం భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చేసిన విషయం తెలిసిందే. వరుస హిట్లతో జోరు మీద ఉన్న నాని ఇదే సంవత్సరం హాట్రిక్ కొడతాడన్న ప్రచారంతో వచ్చిన ఈ సినిమా నిజంగానే మంచి టాక్ సంపాదించుకొని దూసుకుపోతోంది.


 
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 1వ స్థానంలో ఉంది.
.
ప్లస్ పాయింట్స్ లో ముందుగా చెప్పవలసింది దర్శకుడు విరించి వర్మ కథను హ్యాడిల్ చేసిన విధానం గురించి. కథ పాతదే అయినప్పటికీ దాన్ని చాలా అందంగా, సహజంగా చెప్పాడు విరించి వర్మ. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో భీమవరంలో సాగే హీరో ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీ అయితే చాలా రియలిస్టిక్ గా, రొమాంటిక్ సాగుతూ బాగుంది. ఈ లవ్ స్టోరీకి సహజత్వం తీసుకురావడంలో దర్శకుడు నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యాడు. అలాగే ఈ లవ్ స్టోరీ మధ్యలో, సెకండ్ హాఫ్ లో నడిచే కామెడీ మంచి టైమింగ్ తో నడుస్తూ ఎంటర్టైనింగ్ గా ఉంది.

 
మైనస్ పాయింట్స్ విషయానికొస్తే చెప్పుకోవలసింది కథను గురించి. అన్ని ప్రేమ కథల్లాగే ఇది కూడా మామూలు కథే, ఇందులో పెద్దగా కొత్తదనమేమీ లేదు. మొదటి భాగం మొత్తం అందంగా నడిచి సెకండ్ హాఫ్ మాత్రం రొటీన్ గా సాగుతూ కాస్త బోర్ కొట్టించింది. ఇక ప్రీ క్లైమాక్స్ అయితే పూర్తిగా ఊహాజనితంగా ఉండటంతో పెద్దగా ఆసక్తికరంగా అనిపించలేదు.
 
బాక్స్ ఆఫీసు వద్ద :

 
ఎ సెంటర్స్ : మంచి ప్రారంభం
 
బి సెంటర్స్ : మంచి ప్రారంభం
 
సి సెంటర్స్ : మంచి ప్రారంభం
 
తీర్పు : మంచి ప్రారంభం
 
Bookmark and Share