బాక్స్ ఆఫీసు రిపోర్ట్

ఫొటొ : జనతా గ్యారేజ్
Back | Next
 
జనతా గ్యారేజ్ : ‘జనతా గ్యారెజ్’.. కొద్దినెలలుగా తెలుగు సినీ పరిశ్రమలో బాగా వార్తల్లో నిలుస్తూ వచ్చిన సినిమా. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం సెప్టెంబర్ 1న విడుదలైంది. భారీ అంచనాలు నడుమ విడుదలైన ఈ చిత్రంలోలో మోహన్ లాల్ ఓ ప్రధాన పాత్ర పోషించారు. భారీ స్థాయిలో ఓపెనింగ్స్ సాధించిన ఈ చిత్రం రిలీజ్ మొదటిరోజు మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ బలమైన ఎమోషనల్ కంటెంట్, ఎన్టీఆర్, మోహన్ లాల్ ల నటనతో రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ ను రాబడుతోంది.


 
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 2వ స్థానంలో ఉంది.
.
‘జనతా గ్యారెజ్’.. కొద్దినెలలుగా తెలుగు సినీ పరిశ్రమలో బాగా వార్తల్లో నిలుస్తూ వచ్చిన సినిమా. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం సెప్టెంబర్ 1న విడుదలైన సంగతి తెలిసిందే. భారీ అంచనాలు నడుమ వచ్చితిన్ ఈ సినిమా మొదటిరోజు బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ ను సాధించింది. కానీ రిలీజ్ రోజే సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ దర్శకుడు కొరటాల శివ రాసుకున్న రెండు బలమైన పాత్రలు, వాటి చుట్టూ అల్లుకున్న ఎమోషన్, ఎన్టీఆర్, మోహన్ లాల్ ల నటన, సెకండ్ హాఫ్ లో వచ్చే 20 నిముషాల సన్నివేశాలు, జయహో జనతా మాంటేజ్ సాంగ్, కాజల్ చేసిన పక్కా లోకల్ ఐటమ్ సాంగ్ బాగా పండి సినిమాను భారీ కలెక్షన్ల దిశగా నడిపిస్తున్నాయి.

 
సినిమాలో బలమైన కథ, కథనం లేకపోవడం, మొదటి భాగంలో అసలు కథ పరిచయమవకపోవడం బోర్ కొట్టిస్తుంది. అలాగే సెకండ్ హాఫ్ లో 20 నిముషాల ఎమోషనల్ సన్నివేశాలు మినహా మిగతా రన్ టైమ్ అంత ఆసక్తిగా ఏమీ లేదు. ఇక మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వగల హీరోయిన్లు సమంత, నిత్యా మీనన్లకు కథలో పెద్దగా సన్నివేశాలు లేకపోవడం, రొటీన్ క్లైమాక్స్ నిరుత్సాహపరుస్తాయి.
 
బాక్స్ ఆఫీసు వద్ద :

 
ఎ సెంటర్స్ : బాగానే ఆడుతోంది
 
బి సెంటర్స్ : బాగా ఆడుతోంది
 
సి సెంటర్స్ : బాగా ఆడుతోంది
 
తీర్పు : సూపర్ హిట్
 
Bookmark and Share