చిట్ చాట్ : మంచు విష్ణు – నేను చాలా రిస్క్ లు చేశాను

చిట్ చాట్ : మంచు విష్ణు – నేను చాలా రిస్క్ లు చేశాను

Published on Oct 16, 2013 2:00 AM IST

vishnu-manchu-(21)

మంచు విష్ణు హీరోగా నటించిన ‘దూసుకెళ్తా’ సినిమా కొద్ది రోజుల్లో విడుదల కావడానికి సిద్దంగా ఉంది. ఈ సినిమాపై మంచి రెస్పాన్ ఉంది. దీనిని విష్ణు కాష్ చేసుకోవలనుకుంటున్నాడు. వీరుపొట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లావణ్య త్రిపతి హీరోయిన్ గా నటించింది. ఈ రోజు విష్ణు ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసి ఈ సినిమాలు సంబందించిన విశేషాలను తెలియజేశాడు. తను చెప్పిన విషయాలను ఇప్పుడు మనం చూద్దాం.

ప్రశ్న) దూసుకెళ్తా సినిమా ఎలా మొదలైంది?

స) మనోజ్ ఈ సినిమా గురించి చెప్పి నన్ను చేయమని అన్నాడు. నాన్నకు కూడా ఈ సినిమా నచ్చింది. నేను ఆయన జడ్జ్ మెంట్ ని నమ్ముతాను. దానితో ఈ సినిమా కథని పూర్తిగా వినకుండానే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళాను. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నా కొద్ది సినిమాపై నాకు ఆసక్తి పెరిగింది. వీరు సినిమాని చాలా బాగా తీశాడు. డైలాగ్స్ కూడా బాగున్నాయి. ముఖ్యంగా వన్ లైన్ డైలాగ్స్.

ప్రశ్న) సినిమాని ఎవరికైనా చూపించారా?

స) అవును చూపించాను. దాసరి నారాయణరావు గారు, బి. గోపాల్, శ్రీను వైట్ల, శ్రీవాస్, విన్ని, నాగేశ్వర్ రెడ్డి గారు చూశారు. వారందరికి ఈ సినిమా నచ్చింది. ఈ సినిమాలో నా పెర్ఫార్మెన్స్ ని చూసి దాసరి నారాయణరావు గారు నన్ను మెచ్చుకున్నారు. ఆయనకి ఈ సినిమా బాగా నచ్చింది. అలాగే మిగిలిన వారు కూడా అదేవిదంగా ప్రశంసించారు. ఆ తరువాత నాకు కాస్త మనశాంతిగా అనిపించింది.

ప్రశ్న) ఈ మూవీలో మీ పాత్ర ఎలా ఉంటుంది ?

స) ఈ సినిమాలో నా పాత్ర పూర్తి ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. ఈ సినిమాలో మంచి యాక్షన్, కామెడీ ఉంటుంది. ఫైట్స్, డాన్స్ లు ఈ సినిమాకి ప్రధాన హైలైట్స్. ఈ సినిమా కోసం నేను చాలా హర్డ్ వర్క్ చేశాను.

ప్రశ్న) ఈ సినిమాలో చేసిన యాక్షన్ సన్నివేశాల కోసం చాలా రిస్కులు చేసినట్టున్నారు?

స) అవును. కానీ ఈ సినిమా కోసం నేను మిగిలిన హీరోల మాదిరిగానే చాలా జాగ్రత్తలు తీసుకొని ఒక లిమిట్ వరకే రిస్క్ చేశాను. నాకు కుటుంబం ఉంది కాబట్టి నేను చేసే యాక్షన్ సన్నివేశాలకు నాకు నేనే ఒక గీత గీసుకొని అది దాటకుండా చేసాను. నేను కొన్ని రిస్క్ లు నా మొదటి సినిమా ‘విష్ణు’ లో కూడా చేశాను. వేరే ఎవరన్నా హీరో ఏదైనా నాకన్నా బాగా చేసాడు అనిపించినప్పుడు దాన్ని స్పూర్తిగా తీసుకొని నా తదుపరి సినిమాలో కొత్తగా ట్రై చేస్తుంటాను.

ప్రశ్న) మీకు సిక్స్ ప్యాక్ తో తెరపై కనిపించడానికి ఆసక్తి చూపుతున్నారా?

స) (నవ్వుతూ) విజయవాడ వెళ్లి రిక్షా నడిపేవాన్ని చూడండి. లేదా ఔటర్ రింగ్ రోడ్, అక్కడ మనకు కూలిలుగా కనిపించే వారిని చూడండి. వారు నిజమైన సిక్స్ ప్యాక్ బాడీస్ అంటే వాళ్ళవిఅని వారి కండలు మనకు చెబుతాయి. నాకు సిక్స్ ప్యాక్ ని చూపించాలని పెద్ద ఆసక్తి లేదు. నా ద్యేయం ఒక దృడమైన, అథ్లెటిక్ బాడీని డెవలప్ చేయడం. భారత హీరోస్ లో నేను ఒక మంచి అథ్లెటిక్ మరియు ఫిట్ బాడీ ఉన్నవాడిని కావాలనుకుంటున్నాను. అలాగే నేను ఇప్పటికి 30శాతం మాత్రమే నా టార్గెట్ ని చేరుకున్నాను. త్వరలో నా లక్ష్యాన్ని చేరుకుంటానన్న నమ్మకం నాకుంది.

ప్రశ్న) మణిశర్మ అందించిన సంగీతంతో మీరు ఆనందంగా వున్నారా?

స) కచ్చితంగా. ఈ సినిమాకి ఆయన చక్కని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని అందించారు. నిజం చెప్పాలంటే ‘వస్తాడు నా రాజు’ కు అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నాకు అంత సంతోషాన్ని ఇవ్వలేదు. ఈ విషయాన్ని నేను ఆయన్ని అడిగినప్పుడు ఆయన ‘ఆ సినిమా స్టొరీకి అంతకన్నా ఇవ్వాల్సిన స్కోప్ లేదని’ అన్నాడు. అదృష్టవశాత్తు అయన ఈ సినిమా గురించి ఏమి మాట్లాడలేదు. నాకైతే ‘రాయలసీమ రామన్న చౌదరి’ సినిమాకి మణిశర్మ గారు ది బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారు.

ప్రశ్న. మీరు రాజకీయాల్లోకి వెళ్తారా?

స. (నవ్వుతూ) నా కుటుంబంలో ఇప్పటికి వున్న రాజకీయ నాయకులు చాలని నేను అనుకుంటున్నాను. రాజకీయాలు విన్నీ సైడ్. నాన్నకి రాజకీయాలంటే ఆసక్తి వుంది. కానీ ప్రస్తుతం ఆయన ఉత్సాహంగా రాజకీయాల్లో పాల్గొనలేకపోతున్నాడు. నేను కూడా సమాజానికి ఏదైనా చేయడం ముఖ్యం అనుకుంటున్నాను. అందుకే నేను తిరుపతి దగ్గర గల 10 గ్రామాలను దత్తత తీసుకొన్నాను. అక్కడ వున్న సమస్యలు – చెత్తని తొలగించడం, మరుగుదొడ్లను నిర్మించడం లాంటివి చేయిస్తున్నాను. ఒక వేళ నేను చేసేది నచ్చి మిగిలిన విద్యా సంస్థలు కూడా ఆంద్ర ప్రదేశ్ లోని మిగిలిన గ్రామాలను దత్తత తీసుకుంటే రాష్ట్రము చాలా బాగుంటుంది.

ప్రశ్న. ‘రావణ’ ఎంతవరకు వచ్చింది?

స. ‘రావణ’ నా డ్రీం ప్రాజెక్ట్. ఈ సినిమాని మేము ఇంటర్నేషనల్ టెక్నికల్ స్టాండర్డ్స్ తో నిర్మించాలని అనుకుంటున్నాము. ఈ సినిమా ప్రీ – ప్రొడక్షన్ పనులు డిసెంబర్ లో ముగిసే అవకాశం వుంది. ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలను సంక్రాంతి తరువాత ప్రెస్ నోట్ ద్వారా విడుదల చేస్తాం.

దీనితో విష్ణు మంచు ఇంటర్వ్యూ ముగిసింది. ఆయన నటించిన ‘దూసుకెళ్తా’ సినిమా మంచి విజయాన్ని సాదించాలని కోరుకుందాం. ఈ సినిమా ఈ నెల 17న విడుదల కానుంది.

CLICK HERE FOR ENGLISH INTERVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు