నార్త్ అమెరికాలో ‘పెద్ది’ ప్రీమియర్స్ కి భారీ కలెక్షన్స్ !

నార్త్ అమెరికాలో ‘పెద్ది’ ప్రీమియర్స్ కి భారీ కలెక్షన్స్ !

Published on May 25, 2026 10:07 AM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా పై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం జూన్ 4న గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమాను మేకర్స్ చాలా ఉధృతంగా ప్రమోట్ చేస్తున్నారు. ఐతే, తాజా సమాచారం ప్రకారం, నార్త్ అమెరికా ప్రీమియర్ షోల ప్రీ-సేల్స్ $500K మార్కును దాటాయి. మరి ప్రీ-సేల్స్ లోనే ఈ స్థాయిలో కలెక్షన్స్ వస్తుంటే.. మొత్తం ప్రీమియర్స్ ద్వారా ‘పెద్ది’ ఎంత వసూలు చేస్తుందో చూడాలి.

ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ పెద్దిలో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అన్నట్టు ఈ స్పోర్ట్స్ డ్రామాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా సినిమా పై ఉన్న భారీ హైప్‌కు మరింత ఊపునివ్వడానికి మేకర్స్ సాంగ్స్ ను కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఐటమ్ సాంగ్ అదరగొడుతుంది.

తాజా వార్తలు