ఇంటర్వ్యూ : నాగార్జున – అఖిల్ తమన్నాగురించి మాట్లాడుతూనే ఉన్నాడు..

ఇంటర్వ్యూ : నాగార్జున – అఖిల్ తమన్నాగురించి మాట్లాడుతూనే ఉన్నాడు..

Published on May 27, 2013 8:30 PM IST

Nagarjuna
కింగ్ అక్కినేని నాగార్జున ఇటీవలే ‘గ్రీకు వీరుడు’ అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించాడు. అది రిలీజ్ అయిన వారానికే ఆయన తనయుడు నాగ చైతన్య హీరోగా నటించిన ‘తడాఖా’ సినిమా విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఆయన ముందు అనుకున్నట్టుగానే ఈ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో నాగార్జున చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన తన సంతోషాన్ని పంచుకోవడానికి మీడియా మిత్రులతో సమావేశమయ్యారు. చైతన్య నటనలో పరిపక్వతని, డాలీ దర్శకత్వ ప్రతిభ గురించి మెచ్చుకున్నారు. ఆ విశేశాలు మీ కోసం..

ప్రశ్న) తడాఖా సక్సెస్ ని ఎలా ఫీలవుతున్నారు?

స) సినిమా రిలీజ్ అయినప్పుడు నేను యూరప్ లో ఉన్నాను, ఆ వార్త వినగానే నేను ఎంతో హ్యాపీగా ఫీలయ్యాను. బెల్లంకొండ చైతన్యకి ఓ మంచి సినిమా ఇచ్చాడు. నేను ఆడియో వేడుకలో చెప్పినట్లు గానే ఈ సినిమాని ఆంధ్ర ప్రదేశ్ ప్రేక్షకులు ఆదరించారు.

ప్రశ్న) డైరెక్టర్ డాలీ మీ అంచనాలను అందుకున్నాడని మీరు అనుకుంటున్నారా?

స) అవును. చాలా బాగా తీసినందుకు నేను డాలీకి స్పెషల్ గా థాంక్స్ చెప్పాలి. తమిళ్ వెర్షన్ కంటే చాలా బాగా తీసాడు. ఈ సినిమాతో నాగ చైతన్యకి మాస్ యాక్షన్ హీరోగా మంచి బ్రేక్ వచ్చింది.

ప్రశ్న) మొదటి నుంచి తడాఖా సక్సెస్ పై ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఎందుకని?

స) ఈ సినిమా తమిళ్ వెర్షన్ హిట్. అది నాకు చాలా నమ్మకాన్ని ఇచ్చింది. అది కాకుండా తెలుగు వెర్షన్లో తమిళ్ కన్నా బెటర్ సీన్స్ ఉన్నాయి. ఫైట్స్ కూగా తెలుగు వెర్షన్లో బాగున్నాయి. డైలాగ్స్ కూడా బాగుండడంతో ఈ సినిమా సక్సెస్ అవుతుందని అనుకున్నాను. అలాగే ఫిలిం యూనిట్ కూడా బాక్స్ ఆఫీసు వద్ద సక్సెస్ అవుతుందని అనుకున్నారు.

ప్రశ్న) ఈ సినిమాకి హైలైట్స్ ఏమై ఉంటాయని మీరనుకుంటున్నారు?

స) సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు చాలా బాగున్నాయి. రామ్ – లక్ష్మణ్ మాస్టర్స్ చాలా బాగా కంపోజ్ చేసారు ముఖ్యంగా రెయిన్ ఫైట్ సూపర్బ్, నాకు ఒక్కసారిగా ‘శివ లో చేసిన రెయిన్ ఫైట్ గుర్తొచ్చింది’. నాగ చైతన్య టైమింగ్ మెరుగుపడింది. ఈ సినిమాలో విలన్ గా మెప్పించిన అశుతోష్ రాణా సినిమాకి చాలా ప్లస్ అయ్యాడు. పాటలన్నింటినీ బాగా చిత్రీకరించారు. అన్నిటికంటే అన్నదమ్ముల మధ్య ఎమోషనల్ సీన్స్ ని బాగా తీసారు. అన్నదమ్ముల సెంటిమెంట్ ని బాగా చూపిస్తే తెలుగు సినిమా లవర్స్ ఎప్పుడూ ఆదరిస్తారు.

ప్రశ్న) సునీల్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ అయ్యాడని అనుకుంటున్నారా?

స) అవును. బెల్లంకొండ సురేష్ గారు ఎప్పుడైతే సునీల్ పేరు చెప్పారో అప్పుడే నేను చాలా హ్యాపీగా ఫీలయ్యాను. సునీల్ మామూలుగా ఒక నటుడు, కావున అతను సినిమా సక్సెస్ కి ఏది అవసరం అనేది అర్థం చేసుకుంటాడు. అలాగే మార్పులు ఎంత అవసరమో అతనికి తెలుసు. అందుకే అతను సోలో హీరోగా హిట్స్ అందుకోగలుగుతున్నాడు. అతను పాత్రలో ఎంతో లీనమై చెయ్యడం ఈ సినిమాకి ప్లస్ అయ్యింది.

ప్రశ్న) ఎ.ఎన్.ఆర్ గారు, అఖిల్ సినిమా చూసారా? వారు ఎలా ఫీలయ్యారు?

స) నాన్న గారికి సినిమా బాగా నచ్చింది. మామూలుగా ఆయనకి యాక్షన్ సినిమాలు నచ్చవు కానీ ఆయన నన్ను పిలిచి సినిమా చాలా బాగా వచ్చింది, నాకు నచ్చింది అనడంతో నేను షాక్ అయ్యాను. ఇక అఖిల్ విషయానికొస్తే చూడగానే నచ్చేసింది, చైతన్య పెర్ఫార్మన్స్ గురించి చాలా మంచి విషయాలు చెప్పాడు. కానీ దాని కన్నా మించి తమన్నా గురించి ఆపకుండా చెప్తూనే ఉన్నాడు(నవ్వులు). ఎంతో ఉత్కంఠతకి లోనయ్యాడు. అప్పుడు సినిమాకి తమన్నా ఎంత ప్లస్ అయ్యిందో తెలుసుకున్నాను. తమన్నా యంగ్ స్టర్స్ లో బాగా క్లిక్ అయ్యింది. చైతన్య – తమన్నా మీద బీచ్ లో షూట్ చేసిన ‘మారా ఓ మారా’ సాంగ్ నాకు బాగా నచ్చింది.

ప్రశ్న) మీరు డాలీతో ఎలాంటి సినిమా తీయాలనుకుంటున్నారు?

స) డాలీ తో చేయనున్న సినిమాకి ఇంకా కథ ఫైనలైజ్ కాలేదు. ఈ వారం కూర్చొని ఏదో ఒకదాన్ని ఎంచుకోవాలి. బెల్లంకొండ సురేష్ మాస్ ఎంటర్టైనర్ చెయ్యడానికి ఆసక్తి చూపుతున్నారు. చూద్దాం మా నుండి ఎలాంటి సినిమా వస్తుందో, పూర్తి వివరాలు అధికారికంగా త్వరలోనే తెలియజేస్తాను.

ప్రశ్న) నటుడిగా చైతన్యలో వచ్చిన మెరుగుదలకి మీరు హ్యాపీ గా ఉన్నారా?

స) అవును. కానీ నాగ చైతన్యలో వచ్చిన ఈ మెరుగుదలకి పూర్తి క్రెడిట్ నాగ చైతన్యకి ఇవ్వను ఎందుకంటే ఇదంతా టీం ఎఫోర్ట్, ముఖ్యంగా డైరెక్టర్ కీలకపాత్ర పోషించాడు. ఒక నటుడిలోని కామెడీని రాబట్టుకోవాలంటే ముందుగా దర్శకుడు హీరోని, అతని బాడీ లాంగ్వేజ్ ని అర్థం చేసుకోవాలి. ఇదంతా టీం ఎఫోర్ట్.

ప్రశ్న) ‘గ్రీకు వీరుడు’ ‘తడాఖా’ కి మధ్య వచ్చిన అతి తక్కువ గ్యాప్ వల్ల మీరేమన్నా టెన్సన్ పడ్డారా?

స) ‘గ్రీకు వీరుడు’ – ‘తడాఖా’ సినిమా రిలీజ్ డేట్స్ మధ్య తక్కువ టైం ఉందని చాలా మంది అన్నారు. కానీ ఇది కావాలని జరిగింది కాదు, అనుకోకుండా కొన్ని రిలీజ్ డేట్స్ అటూ ఇటూ అవడం వల్ల జరిగింది. అన్నీ ఫైనలైజ్ తర్వాత ఈ సినిమాకి అనుకున్న డేట్ సినిమాకి చాలా హెల్ప్ అయ్యింది ఎందుకంటే అదే పర్ఫెక్ట్ టైం.

ప్రశ్న) ‘మనం’ ఎలాంటి తరహా సినిమా?

స) ‘మనం’ పూర్తి వినోదాత్మక చిత్రం. ఈ సినిమాలో ఓ మేజిక్ ఉంటుంది. ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ కల్లా పూర్తవుతుంది. మరో నెల రోజులు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు తీసుకుంటుంది. విక్రం పెర్ఫెక్షనిస్ట్, కచ్చితంగా అతనకి ఈ కామెడీపై ఎక్కువ అవకాగన ఉంది(నవ్వులు).

ప్రశ్న) ‘మనం’ సినిమాలో అఖిల్ కూడా ఉన్నారా?

స) లేదు. ‘మనం’ లో అఖిల్ లేడు. వాడు హీరో అయ్యాక ఇంకో మల్టీ స్టారర్ ప్లాన్ చేద్దాం(నవ్వులు).

ప్రశ్న) మీరు మీ సినిమాలని రీమేక్ చెయ్యమని నాగ చైతన్యని ప్రోత్సహిస్తారా?

స) కొన్ని రకాల ఎంటర్టైనర్స్ చెయ్యొచ్చు. స్క్రీన్ ప్లే మాత్రం ఇప్పటి తరానికి చెందే విధంగా ఉండాలి కానీ ఎంటర్టైన్మెంట్ కోణాన్ని మాత్రం వాడుకోవాలి. అలాగే కొన్ని సినిమాల్ని టచ్ చెయ్యకూడదు. ఉదాహరణకి ‘శివ’.. నేనైతే ‘శివ’ ని రీమేక్ చెయ్యొద్దని చెప్తాను. కానీ ‘హలో బ్రదర్’ , ‘ప్రెసిడెంట్ గారి పెళ్ళాం’ లాంటి సినిమాల్ని రీమేక్ చేస్తే హ్యాపీ గా ఫీలవుతాను.

ప్రశ్న) ‘భాయ్’ ఎలా రూపుదిద్దుకుంటోంది?

స) ‘భాయ్’ చాలా బాగా రూపుదిద్దుకుంటోంది. జూలై కల్లా షూటింగ్ పూర్తవుతుంది. కామెడీ ఎంటర్టైనర్స్ తీయడంలో వీరభద్రం చౌదరికి మంచి పేరుంది. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్.

అంతటితో నాగార్జున గారితో ఇంటర్వ్యూ ముగిసింది. ఈ ఇంటర్వ్యూ మీకు బాగా నచ్చిందని ఆశిస్తున్నాం…

CLICK HERE FOR ENGLISH INTERVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు