వరల్డ్ వైడ్ ప్రీసేల్స్ వసూళ్లలో ‘ఉస్తాద్’ హవా..!

వరల్డ్ వైడ్ ప్రీసేల్స్ వసూళ్లలో ‘ఉస్తాద్’ హవా..!

Published on Mar 18, 2026 11:03 AM IST

ustaad-bhagat-singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ పండుగ సినిమానే “ఉస్తాద్ భగత్ సింగ్”. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా తెలుగు స్టేట్స్ సహా ఓవర్సీస్ మార్కెట్ లో సాలిడ్ ప్రీ సేల్స్ వసూళ్లు నమోదు చేస్తున్నట్టు పి ఆర్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రానికి కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ సాలిడ్ ఓపెనింగ్స్ పై ఉస్తాద్ కన్నేశాడు. ఆల్రెడీ ఈ సినిమా 20 కోట్లకి దగ్గర ప్రీ సేల్స్ వసూళ్లు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

అంతే కాకుండా మన దగ్గర కూడా బుకింగ్స్ పరంగా గత 24 గంటల్లో లక్ష 16 వేలకి పైగా టికెట్స్ ఈ సినిమాకి ఒక్క బుక్ మై షో యాప్ నుంచే అమ్ముడుపోయాయి. దీనితో వరల్డ్ వైడ్ ఉస్తాద్ హవా స్ట్రాంగ్ గానే కొనసాగుతుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్, థమన్ లు సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు. అలాగే ఈ శ్రీలీల, రాశి ఖన్నా పవన్ సరసన మొదటిసారి నటించారు.

తాజా వార్తలు