ఆసక్తి కలిగిస్తున్న రజినీ కొత్తసినిమా టైటిల్

ఆసక్తి కలిగిస్తున్న రజినీ కొత్తసినిమా టైటిల్

Published on May 25, 2017 10:34 AM IST


కబాలి దర్శకుడు పా రంజిత్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ మరో చిత్రంలో నటించనున్న విషయం తెలిసిందే.తాజాగా ఈ చిత్రానికి ఆసక్తికరమైన టైటిల్ ని ఫిక్స్ చేశారు. రజిని కొత్త చిత్ర టైటిల్ ‘కాలా’. ఈ మేరకు చిత్ర యూనిట్ టైటిల్ లోగోని విడుదల చేసింది. స్టైలిష్ గా డిజైన్ చేసిన ఈ టైటిల్ లోగో అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

రాజకీయ నాయకుడు, అండర్ వరల్డ్ డాన్ అయిన హాజీ మస్తాన్ పాత్రని రజినీకాంత్ ఈ చిత్రంలో పోషించనున్నారు. హ్యూమా క్యురేషియా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించనుంది. ఈ చిత్ర షూటింగ్ కూడా ముంబై లో జరగనుంది. రజిని అల్లుడు ధనుష్ ఈ చిత్రానికి నిర్మాత కావడం విశేషం. రజినీకాంత్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వం లో 2.0 చిత్రం లో నటిస్తున్న విషయం తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు