‘పండగ చేస్కో’ సినిమాకు టాప్ డైరెక్టర్ విషెస్!

‘పండగ చేస్కో’ సినిమాకు టాప్ డైరెక్టర్ విషెస్!

Published on May 27, 2015 3:29 PM IST

Murugadoss
ఎనర్జిటిక్ హీరో రామ్, సూపర్ హిట్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కిన తాజా సినిమా ‘పండగ చేస్కో’. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ వారమే (మే 29న) విడుదలవుతోన్న విషయం తెలిసిందే. రామ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, సోనాల్ చౌహన్‌లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను పరుచూరి కిరీటి నిర్మించారు. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా విషయంలో మొదట్నుంచీ పాజిటివ్ వైబ్రేషన్ ఉంది.

‘పండగ చేస్కో’ సినిమాకున్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేసేందుకు నిర్మాత ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. అమెరికాలో కూడా సుమారు 70కి పైగా థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది. ఇక ఈ సందర్భంగా సినిమా మంచి విజయం సాధించాలని తెలుగు, తమిళ, హిందీ సినిమాలతో టాప్ డైరెక్టర్‌గా ఎదిగిన ఏ.ఆర్.మురుగదాస్ కాంక్షించారు. “పండగ చేస్కో సినిమా విడుదలకు సందర్భంగా నా తమ్ముడు గోపీచంద్ మలినేనికు ఆల్ ది బెస్ట్” అంటూ శుభాకాంక్షలు తెలిపారు. గతంలో గోపీచంద్ మలినేని ఏ.ఆర్.మురుగదాస్ వద్ద పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు