‘ఆచారి అమెరికా యాత్ర’ షూటింగ్ అప్డేట్స్ !

‘ఆచారి అమెరికా యాత్ర’ షూటింగ్ అప్డేట్స్ !

Published on Dec 15, 2017 1:40 PM IST

మంచు విష్ణు హీరోగా, జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో వస్తోన్న తాజా సినిమా ‘ఆచారి అమెరికా యాత్ర’. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా కు తమన్ సంగీత దర్శకుడు. జనవరి 26 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పూర్తి కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కే ఈ చిత్రంలో బ్రహ్మానందం కీలక పాత్రలో నటిస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం ఈ నెల 21 నుండి ఈ సినిమా చివరి షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. ఏం.ఎల్.కుమార్ చౌదరి సమర్పణలో కీర్తి చౌదరి, కిట్టులు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారుదే. వినోధభరితంగా సాగే ఈ సినిమా తప్పకుండ ప్రేక్షకులను అలరిస్తుందని మూవీ టీం నమ్మకంగా ఉంది. ఈ సినిమాతో పాటు మంచు విష్ణు నటించిన ‘ఓటర్’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు