యాక్సిడెంట్ పై క్లారిటీ ఇచ్చిన ఆది !
Published on Jan 21, 2018 3:10 pm IST


తెలుగు, తమిళ పరిశ్రమల్లో హీరోగా మాత్రమేగాక ప్రతినాయకుడిగా, సహాయనటుడిగా గుర్తుండిపోయే పాత్రలు చేస్తూ ప్రేక్షకుల ప్రసంశల్ని అందుకుంటున్న నటుడు ఆది తన గురించి వస్తున్న అసత్యపు వార్తలకు చెక్ పెట్టారు. ఈరోజు ఉదయం నుండి ఆయన యాక్సిడెంట్ కు గురయ్యారని పుకార్లు పుట్టుకొచ్చాయి.

కానీ అలాంటిదేంలేదని, అవన్నీ ఒట్టి గాలి వార్తలేనన్న ఆయన తాను బాగానే ఉన్నానని, షూటింగ్, స్క్రిప్ట్స్ వినడంలో బిజీగా ఉన్నానని, ఈ పుకార్ల పట్ల స్పందించి తన యోగ క్షేమాల గురించి వాకబుచేసిన వారందరికీ కృతజ్ఞతలని అన్నారు. ప్రస్తుతం ఈయన రామ్ చరణ్ ‘రంగస్థలం’లో ఒక కీలక పాత్ర చేస్తున్నారు.

 
Like us on Facebook