షూటింగ్ లో ప్రొఫెషనల్స్ తో పోటీపడ్డ స్టార్ హీరో

షూటింగ్ లో ప్రొఫెషనల్స్ తో పోటీపడ్డ స్టార్ హీరో

Published on Oct 16, 2019 2:12 PM IST

స్టార్ హీరో తల అజిత్ రైఫిల్ షూటింగ్ లో ప్రొఫెషనల్స్ తో పోటీపడ్డారు. అంతే కాకుండా ర్యాంక్ లిస్టులో చెప్పుకో దగ్గ స్థానాలు సంపాదించాడు. తాజాగా ఢిల్లీ వేదికగా జరిగిన షూటింగ్ టోర్నమెంట్ లో అజిత్ పాల్గొనడం జరిగింది. ప్రొఫెషనల్ షూటర్లు పాల్గొన్న ఈ ఈవెంట్ లో అజిత్ రెండు విభాగాలలో పాల్గొని ఒక విభాగం నందు 9వ స్థానం, మరొక విభాగంలో 12స్థానంలో నిలిచారు. కేవలం హాబీ షూటర్ ఐనప్పటికి అజిత్ ఆ మాత్రం పోటీ ఇచ్చారంటే మెచ్చుకోదగ్గ విషయమే. ఇవే కాకుండా కార్ రేసింగ్, కుకింగ్,ఫోటో గ్రఫీ వంటి హాబీస్ అజిత్ కి ఉన్నాయి. 2010 ఎం ఆర్ ఎఫ్ రేసింగ్ లో అజిత్ పాల్గొన్నారు.

ఇక నెర్కొండ పార్వై చిత్రంతో మరో హిట్ అందుకున్న అజిత్ తన 60వ చిత్రం కొరకు సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రాన్ని కూడా దర్శకుడు హెచ్ వినోత్ తెరకెక్కిస్తుండగా, బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ మూవీ కోసం బరువు తగ్గడంతో పాటు పూర్తిగా లుక్ మార్చేసిన అజిత్ కొత్తగా కనిపిస్తున్నారు. త్వరలో సెట్స్ పైకెళ్లనున్న ఈ మూవీ వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదలయ్యే అవకాశం కలదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు