కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ‘అజ్ఞాతవాసి’ పరిస్థితి !

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ‘అజ్ఞాతవాసి’ పరిస్థితి !

Published on Jan 17, 2018 12:51 PM IST

భారీ అంచనాల నడుమ రూపుదిద్దుకున్న ‘అజ్ఞాతవాసి’ చిత్రం రికార్డ్ స్థాయి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిపిన సంగతి తెలిసిందే. చాలా ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లు అత్యధియాక్ మొత్తం వెచ్చించి చిత్ర హక్కుల్ని కొనుగోలు చేశారు. అలాంటి ఏరియాల్లో కృష్ణా, గుంటూరు జిల్లాలు కూడా ఉన్నాయి. ఈ ఏరియాల్లో 10వ తేదీన విడుదలైన సినిమా ఇప్పటి వరకు జరిపిన బిజినెస్ వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.

ముందుగా రూ.8 కోట్లకు అమ్ముడైన కృష్ణా జిల్లా విషయానికొస్తే నిన్న మంగళవారం రూ.23.80 లక్షల షేర్ ను వసూలుచేసి 7 రోజులకుగాను రూ.3.08 కోట్ల షేర్ ను నమోదు చేసిందీ చిత్రం. అలాగే రూ.9 కోట్లకు అమ్ముడైన గుంటూరు జిల్లాలో మంగళవారం రూ.19.59 లక్షల షేర్ ను కలెక్ట్ చేసి 7 రోజులకుగాను రూ.5.01 కోట్ల షేర్ ను ఖాతాలో వేసుకుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు