పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘అజ్ఞాతవాసి’ కి క్రేజ్ మామూలుగా లేదు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనేగాక ఓవర్సీస్లో సైతం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. గత కొన్నిరోజుల నుండి అక్కడి తెలుగు యువత పెద్ద ఎత్తున విడుదల హంగామా చేస్తున్నారు. ఇక ఈరోజు రాత్రి నుండి ప్రదర్శించబోయే ప్రీమియర్ షోలకు భారీ డిమాడ్ కనిపిస్తోంది.
అడ్వాన్స్ బుకింగ్స్ ఊహించిన దానికంటే ఎక్కువగానే జరుగుతున్నాయి. ఎంతలా అంటే బుకింగ్స్ ఓపెన్ చేసిన టికెట్ మూవీస్.కామ్ లో గత 24 గంటల నుండి మొదటి స్థానంలోనే ఉంది. బుకింగ్స్ లో పవన్ చిత్రం 26.4 % ఉండగా హాలీవుడ్ చిత్రాలు జుమాంజి 12.1 %, స్టార్ వార్స్ 8.7 %, ఇంసిడియస్ 8.3 %, ది గ్రేట్ షో మాన్ 8.2 % బుకింగ్స్ తో వెనుకబడి ఉన్నాయి.
సుమారు 570 కు పైగా స్క్రీన్స్ లో విడుదలవుతున్న ‘అజ్ఞాతవాసి’ ప్రీమియర్లతోనే మిలియన్ మార్కును అవలీలగా దాటేయనుంది.
- ఆస్ట్రేలియాలో తన స్టామినాను ప్రూవ్ చేసుకున్న మహేష్ !
- గుంటూరులో నాన్ బాహుబలి-2 రికార్డ్ సృష్టించిన ‘భరత్ అనే నేను’ !
- షూటింగ్ మొదలుపెట్టనున్న రకుల్ ప్రీత్ !
- చరణ్ రికార్డును క్రాస్ చేసిన మహేష్ !
- భారీ ఓపెనింగ్స్ అందుకోనున్న ‘భరత్ అనే నేను’ !
సంబంధిత సమాచారం :
