తాప్సీ సినిమాకు అరుదైన గౌరవం!

తాప్సీ సినిమాకు అరుదైన గౌరవం!

Published on Apr 18, 2015 10:45 AM IST

baby
తన అందం, నటనతో తెలుగులో వరుస సినిమాలతో ఆకట్టుకున్న తాప్సీకి ఆ తర్వాత వరుసగా బాలీవుడ్ అవకాశాలు వచ్చి పడ్డాయి. అందులో విలక్షణ దర్శకుడు నీరజ్ పాండే దర్శకత్వంలో తెరకెక్కిన ‘బేబీ’ సినిమా ఒకటి. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమాలో తాప్సీది కీలక పాత్ర. ఈ సినిమాలో ఆమె సరికొత్తగా కనిపించడంతో పాటు యాక్షన్ సన్నివేశాల్లోనూ ఆకట్టుకుంది. ఇదే సినిమాలో తెలుగు హీరో రానా కూడా ఓ కీలక పాత్రలో కనిపించి మెప్పించారు. ఉగ్రవాదం నేపథ్యంలో నడిచే ఈ సినిమా జనవరి నెలలో విడుదలై అటు బాక్సాఫీస్ పరంగానూ, ఇటు ప్రేక్షకుల ప్రశంసల పరంగానూ సూపర్ హిట్ అనిపించుకుంది.

తాజాగా ఈ సినిమాకు ఓ అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక ఆస్కార్ లైబ్రరీలో ‘బేబీ’ సినిమా స్క్రిప్టుకు స్థానం లభించింది. ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ గత కొన్ని దశాబ్దాలుగా ఇస్తోన్న ఆస్కార్ అవార్డులకు ఎంత ప్రాధాన్యత ఉందో తెలిసిందే! ఈ సంస్థ దర్శక, రచయితల కోసం ఓ పెద్ద లైబ్రరీని ఏర్పాటు చేసింది. అక్కడ మంచి సినిమాలను ఎంపిక చేసి వాటి స్క్రిప్టు, డీవీడీలను భద్రపరుస్తుంది. ఆ లైబ్రరీలో ‘బేబీ’ సినిమాకు స్థానం దక్కడం అరుదైన గౌరవమనే చెప్పాలి!

సంబంధిత సమాచారం

తాజా వార్తలు