తుఫాను బాధితులకు 5 లక్షల విరాళం అందజేసిన అల్లరి నరేష్

Allari-Naresh
హుదుద్ తుఫాను ఆంద్ర తీరప్రాంతాన్ని, అక్కడ ప్రజలని ఎంత కలవరపెట్టిందో తెలిసినవిషయమే. దాదాపు ఒక్క విశాఖపట్టణంలోనే 10వేల కోట్లమేరకు నష్టం వాటిల్లినట్టు సమాచారం. దీనికి ఆంద్ర, తెలంగాణా ప్రభుత్వాలు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టాయి. వారికి తొడిగా మేమున్నామంటూ సినిమా హీరోలుకూడా చేయూతనివ్వడం విశేషం

ఈ నష్టాన్ని చూసి తమ మానవతా హృదయంతో ఉదయం నుండి అగ్ర హీరోలైన పవన్, ఎన్.టి.ఆర్, రామ్ చరణ్ వంటి తారలు భారీగా విరాళం అందజేశారు. ఈ జాబితాలోకి కామెడీ నటుడు అల్లరి నరేష్ కూడా చేరాడు. బాధితుల సహాయార్ధం సి.ఎం రిలీఫ్ ఫండ్ కి మన అల్లరోడు 5లక్షలు విరాళం ఇచ్చినట్టు సమాచారం. ఈ విధంగా సినిమా ప్రముఖులు బాధితులకు చేయూతనివ్వడం అభినందనీయం

 

Like us on Facebook