నైజాంలో అల్లు అర్జున్ కొత్త రికార్డు..!!

నైజాంలో అల్లు అర్జున్ కొత్త రికార్డు..!!

Published on Apr 28, 2016 1:56 PM IST

sarrinodu
‘సరైనోడు’.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను పూర్తి స్థాయి మాస్ హీరోగా పరిచయం చేస్తూ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన మాస్ ఎంటర్‌టైనర్. మొదటి రోజు అన్నిచోట్లా ఫర్వాలేదనిపించుకునే టాక్ మాత్రమే తెచ్చుకున్న ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద మాత్రం రోజు రోజుకీ మెరుగుపడుతూ ఎవ్వరూ ఊహించని విధంగా కలెక్షన్స్ సాధిస్తోంది. నైజాం ఏరియాలో ఈ సినిమా 6 రోజుల్లో పదికోట్ల మార్క్ దాటేసింది. ఆరో రోజు పూర్తయ్యే సరికి ‘సరైనోడు’ నైజాంలో 10.60 కోట్ల రూపాయల షేర్ సాధించింది.

ఇక ఇదిలా ఉంటే అల్లు అర్జున్ హీరోగా నటించిన గత ఆరు చిత్రాలూ నైజాం ఏరియాలో 10 కోట్ల మార్క్ దాటిన సినిమాలు కావడం విశేషంగా చెప్పుకోవచ్చు. ‘జులాయి’ నుంచి మొదలుకొని, ‘ఇద్దరమ్మాయిలతో’, ‘రేసుగుర్రం’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘రుద్రమదేవి’, తాజాగా ‘సరైనోడు’.. ఇలా బన్నీ నటించిన ఆరు సినిమాలు 10 కోట్ల మార్క్ దాటి అతడి కెరీర్‌కి ఓ కొత్త రికార్డుని తెచ్చిపెట్టాయి. ‘సరైనోడు’తో తాను పూర్తి స్థాయి మాస్ హీరోగానూ మెప్పించగలనని నిరూపించుకున్న అల్లు అర్జున్, ఇకపై కూడా కెరీర్‌ను అదే జోరులో కొనసాగించాలని తదుపరి సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు