మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ‘ఏంజెల్’

మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ‘ఏంజెల్’

Published on Aug 26, 2016 8:00 PM IST

angel
‘కుమారి 21 ఎఫ్, ఆడో రకం ఈడో రకం’ చిత్రాలు సూపర్ హిట్టవ్వడంతో హీరోయిన్ హెబ్బా పటేల్ ఫేట్ ఒక్కసారిగా మారిపోయింది. భారీ ఆఫర్లు ఆమె చేతిలో వాలుతున్నాయి. ప్రస్తుతం వరుణ్ తేజ్ తో ‘మిస్టర్’, నిఖిల్ సిద్దార్థతో ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ చిత్రల్లో నటిస్తున్న హెబ్బా నాగ అన్వేష్ తో కలిసి ‘ఏంజెల్’ చిత్రంలోనూ నటిస్తోంది.

ఈ చిత్రం తాజాగా మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. 15రోజుల పాటు జరిగిన ఈ షూటింగ్ లో హీరో హీరోయిన్లపై నడిచే కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు దర్శకుడు బాహుబలి పళని. భువన సాగర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సంగీతాన్ని అందిస్తుండగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గుణ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉండబోతున్న ఈ చిత్రంలో సోషియో ఫాంటసీ ఛాయలు కూడా కనిపిస్తాయని దర్శకుడు పళని తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు