ఇంటర్వ్యూ: కళ్యాణ్ కృష్ణ – ‘నేల టికెట్టు’ సినిమాలో రవితేజలోని రెండు షేడ్స్ కనిపిస్తాయి !

ఇంటర్వ్యూ: కళ్యాణ్ కృష్ణ – ‘నేల టికెట్టు’ సినిమాలో రవితేజలోని రెండు షేడ్స్ కనిపిస్తాయి !

Published on May 19, 2018 1:07 PM IST

‘సోగ్గాడే చిన్ని నాయన, రారండోయ్ వేడుక చూద్దాం’ వంటి సినిమాలతో ప్రేక్షకుల్ని మెప్పించిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తాజాగా రవితేజతో ‘నేల టికెట్టు’ అనే సినిమా తీశారు. ఈ నెల 25న చిత్రం విడుదలకానుంది. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..

సినిమాకు ‘నేల టికెట్టు’ అనే టైటిల్ ఎందుకు పెట్టారు ?
అంటే ఇందులో పెద్ద పెద్ద ఫైట్స్ ఉంటాయని ఆ టైటిల్ పెట్టలేదు. ఎక్కువగా సినిమాలో మాస్ జనం కనిపిస్తారు, హీరో వాళ్ళతోనే ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆ టైటిల్ పెట్టాను.

మరి క్లాస్ వాళ్లకు నచ్చుతుందా ?
తప్పకుండా. ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడ ఉన్నాయి. సెన్సార్ సభ్యులు కూడ సినిమా చూసి బాగుందన్నారు. బాల్కనీ వాళ్లకు కూడ సినిమా నచ్చుతుంది.

ఇందులో హీరో పాత్ర ఎలా ఉండబోతుంది ?
ఇందులో హీరో ఆవారా. లైఫ్ జర్నీలో అతను ఎంతమందిని తనతో కలుపుకుని ఒక ఫ్యామిలీని తయారుచేసుకున్నాడు అనేది అతని పాత్ర.

ఇందులో రవితేజను కొత్తగా ఏమైనా చూపించారా ?
రవితేజలో కామెడీ, ఫైర్ రెండూ ఉంటాయి. ఆ రెండూ క్యారెక్టర్లని కలిపి ఈ సినిమాలో చూపించాం.

రవితేజగారితో సినిమా చేయడం ఎలా ఉంది ?
ఈ సినిమా కోసం చాలా రోజులుగా రవితేజగారితో ట్రావెల్ చేశాను. ఆయనతో వర్క్ నిజంగా చాలా కంఫర్ట్ గా ఉంటుంది. కేవలం 90 రోజుల్లో షూటింగ్ చేసేశాను.

మీ నిర్మాత గురించి చెప్పండి ?
రామ్ గారికి చాలా వ్యాపారాలున్నాయి. ఆయనకు మేనేజ్మెంట్ స్కిల్స్ చాలా ఎక్కువ. ఏది కావాలని అడిగినా నిముషాల్లో ఏర్పాటు చేసేవారు.

రవితేజగారి నుండి మీరేం నేర్చుకున్నారు ?
ఆయనలో కమిట్మెంట్ నాకు చాలా ఇష్టం. నా సినిమా షూటింగ్ చివరి రోజు చివరి షాట్ అవగానే వెంటనే వేరే లొకేషన్ కు వెళ్లి మైత్రి మూవీస్ వాళ్ళ కొత్త సినిమాను మొదలుపెట్టారు. ఆ కమిట్మెంట్ అందరికీ ఉండదు. ఆయన్నుండి అదే నేర్చుకున్నాను.

ఇలా వరుసగా స్టార హీరోలతో సినిమాలు చేయడం ఎలా అనిపించింది ?
మొదటి సినిమానే నాగార్జునగారితో చేయడం నా అదృష్టమనే చెప్పాలి. ఆ తర్వాత రెండవ సినిమా అన్నపూర్ణ బ్యానర్లో చేయడం, మూడో సినిమా రవితేజగారితో చేయడం నా అదృష్టం.

హీరోయిన్ పాత్ర ఎలా ఉంటుంది ?
హీరోయిన్ ది కథలో చాలా ముఖ్యమైన పాత్ర. కేవలం హీరోయిన్ ఉండాలి కాబట్టి ఉన్నట్టు ఉండదు.

మీ మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పండి ?
శక్తికాంత్ చాలా మంచి సంగీతం అందించాడు. ఇప్పుడు కూడ మిక్సింగ్లో కూర్చుని ఇంకా బెటర్ ఔట్ ఫుట్ ఇవ్వాలని కష్టపడుతున్నాడు. అతను ఒకేసారి రెండు మూడు సినిమాలు చేయడు. ఒకదాని తర్వాత ఇంకొకటి చేస్తుంటారు. అతని వర్క్ పట్ల నేను సంతృప్తిగా ఉన్నాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు