సినిమాలకు, రాజకీయాలకు సమన్యాయం చేస్తున్న బాలకృష్ణ

సినిమాలకు, రాజకీయాలకు సమన్యాయం చేస్తున్న బాలకృష్ణ

Published on Jul 24, 2014 1:33 AM IST

balakrishna3
నందమూరి బాలకృష్ణ తన కార్యాచరణని చాలా తెలివిగా వ్యవహరిస్తున్నాడు. ఒక పక్క తన 99వ సినిమాలో త్రిష తో ఆడిపాడుతూనే మరోపక్క రాజకీయ వృత్తిని కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రంపచోడవరం దగ్గర జరుగుతుంది

హిందూపూర్ నియోజికవర్గాన్ని అక్కడ ప్రజల సమస్యలను బాలయ్య బాబు దగ్గరుండి పరిశీలిస్తున్నాడు. అక్కడ వారి కష్టాలను తెలుసుకోవడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేశాడు

ఎటువంటి చిన్న సమస్య అయినా ఈ కమిటీ వాటిని బాలకృష్ణ వరకూ చేర్చుతుంది. ఈ కమిటీతో బాలకృష్ణ తరచూ మాట్లాడుతూ వుంటారు. త్రాగునీటి సరఫరా, డ్రైనేజి వంటి సమస్యలు ఇప్పటికే పరిష్కరించినట్టు సమాచారం

సంబంధిత సమాచారం

తాజా వార్తలు