సెన్సార్ కు సిద్దమైన ‘బాలకృష్ణుడు’ !

సెన్సార్ కు సిద్దమైన ‘బాలకృష్ణుడు’ !

Published on Nov 19, 2017 7:17 PM IST

హీరో నారా రోహిత్ బాగా సన్నబడి చేస్తున్న సినిమా ‘బాలకృష్ణుడు’. గత కొన్నాళ్లుగా కెరీర్లో సరైన హిట్ లేని ఆయన ఈ చిత్రంపైనే బోలెడు ఆశలు పెట్టుకున్నారు. పవన్ మల్లెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం యొక్క ఆడియో ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉండటంతో సినిమాపై పాజిటివ్ బజ్ నెలకొంది.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం యొక్క సెన్సార్ పనులు రేపు జరగనున్నాయట. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మహేంద్ర బాబు, వంశీ వినోద్ సంయుక్తంగా నిర్మించగా నవంబర్ 24న సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో రోహిత్ కు జోడీగా రెజినా నటించగా సీనియర్ నటి రమ్యకృష్ణ ఒక కీలక పాత్రలో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు