వరుణ్ సందేశ్ విలన్‌గా బ్రహ్మానందం..

వరుణ్ సందేశ్ విలన్‌గా బ్రహ్మానందం..

Published on Mar 7, 2015 9:29 AM IST

Brahmanandam_varun

యువ కథానాయకుడు వరుణ్ సందేశ్ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా ‘లవకుశ’. ఈ సినిమాలో మరో స్పెషాలిటీ కూడా ఉంది. ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం విలన్ పాత్రలో నటిస్తున్నారు. వెయ్యికి పైగా సినిమాల్లో నటించిన బ్రహ్మానందం విలన్ పాత్రలో నటించడం బహుశా ఇదే తొలిసారి కావొచ్చు. నవ్వించిన బ్రహ్మీ, హీరోను ఎలా ఏడిపిస్తారో చూడాలి.

జయశ్రీ శివన్ దర్శకత్వం వహించిన ‘లవకుశ’ సినిమా ప్రమోషనల్ సాంగును శుక్రవారం విడుదల చేశారు. బ్రహ్మానందం, వరుణ్ సందేశ్, ప్రభాస్ శ్రీను తదితరులపై చిత్రీకరించిన ఈ పాట విడుదల సందర్భంగా బ్రాహ్మీ, విలన్ గా చేస్తున్న సంగతి వెల్లడించారు.

రిచా పనయ్, రుచి త్రిపాఠి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను సంగారెడ్డి పేట ప్రకాశ్, సత్యమోహన్‌ రెడ్డి, పండుబాబు సంయుక్తంగా నిర్మించారు. రామ్‌ నారాయణ్ సంగీత దర్శకుడు. త్వరలో ఆడియోను విడుదల చేసి,ఆ తర్వాత సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని నిర్మాతలు తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు