‘మర్యాద రామన్న’ సెట్లో అల్లు అర్జున్ మూవీ

‘మర్యాద రామన్న’ సెట్లో అల్లు అర్జున్ మూవీ

Published on Nov 25, 2014 11:31 AM IST

allu-arjun
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – మాటల మాంత్రికుడు కాంబినేషన్ లో వస్తున్న సెకండ్ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఈ సినిమా షూటింగ్ హైదరబాద్ లో శరవేగంగా జరుగుతోంది. నిన్ననే ఈ చిత్ర టీం ఈ సినిమాని ఫిబ్రవరి 5న సినిమాని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేసినట్లు తెలిపారు. అనుకున్న టైంకి రిలీజ్ చెయ్యాలని షూటింగ్ స్పీడ్ ని కూడా పెంచారు.

గతంలో ‘మర్యాద రామన్న’ కోసం హైదరబాద్ శివార్లలో వేసిన స్పెషల్ సెట్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఒరిజినల్ సెట్ ని అలాగే వాడకుండా ఈ సినిమా కోసం కాస్త మార్పులు చేసారు. ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ ఈ మార్పులని చేసాడు. అల్లు అర్జున్ చేస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో మొదటి సారిగా ముగ్గురు భామలతో ఆడిపాడుతున్నాడు. సమంత, ఆద శర్మ, నిత్యా మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, స్నేహ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

యంగ్ తరంగ్ దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాని హారిక – హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నాడు. గతంలో అల్లు అర్జున్ – త్రివిక్రమ్ – రాధాకృష్ణ – దేవీశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన ‘జులాయి’ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు